Santhosham gurinchina 3 avaastava nammakaalu mariyu vaastavam

September 9, 2023

సంతోషం గురించిన 3 అవాస్తవ నమ్మకాలు మరియు వాస్తవం (పార్ట్ 1)

ఈరోజు ప్రపంచంలో చాలామంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. కొద్దిసేపు ఆగి మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన సమయం ఇది. నేను మానసిక ఆరోగ్యం తద్వారా వచ్చే భావోద్వేగ ఆరోగ్యం కోసం చేయాల్సినంత కృషి చేస్తున్నానా? ఒత్తిడి, కోపం, భయం, గాయపడటం, అసూయ మనకు వస్తున్నాయంటే మన భావోద్వేగ ఆరోగ్యం దెబ్బ తింటుందని అర్థం. నిజానికి, సంతోషాన్ని అన్వేషించే ప్రయత్నంలో మనం వీటికి చిక్కుతున్నాం. మన కలల వెనక మనం చిన్నప్పటి పరిగెడుతూ ఉంటాం, సంవత్సరాలుగా ఎంత పరిగెడుతున్నామంటే క్షణం కూడా ఆగి చూసుకోవడం లేదు. నేను ఏది పొందుతానో, నా వద్ద ఎన్ని వస్తువులు ఉంటాయో అంతగా నేను సంతోషంగా ఉంటాను అన్న అవాస్తవ నమ్మకమే ఇందుకు కారణం. అందుకే మనం సాధించిన వాటిలో, వస్తువులలో, సంబంధాలలో సంతోషాన్ని పొందాలని చూస్తున్నాము. సంతోషం గురించిన 3 అవాస్తవ నమ్మకాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం – 

అవాస్తవ నమ్మకం 1: విజయాలు నాకు సంతోషాన్నిస్తాయి

 మేనేజర్‌గా పదోన్నతి పొందేందుకు రెండేళ్లు పడుతుందని తెలిసిన ఒక ఉద్యోగిని నేను అనుకుందాం, నేను దాని కోసం సిన్సియర్‌గా పని చేస్తున్నాను. కానీ, ‘మేనేజర్‌గా పదోన్నతి పొందినప్పుడు నేను సంతోషంగా ఉంటాను’ అని నాకున్న నిర్దిష్ట ఆలోచన తరచుగా నాకు గుర్తుచేస్తూ ఉంటుంది. అంటే, ఈరోజు సంతోషంగా ఉండడానికి నేను సిద్ధంగా లేను, మరో రెండు సంవత్సరాలు కూడా నేను సంతోషంగా ఉండటానికి సిద్ధంగా లేను. ఏదో ఒక రోజు నా అసమర్థత, జట్టు సభ్యులతో సమస్య లేదా మేనేజ్‌మెంట్ నిర్ణయం వల్ల నా ప్రమోషన్ జరగకపోవచ్చని నేను భావిస్తే, నేను ఒత్తిడి, కోపం మరియు ఆందోళనకు గురవుతాను – ఇవి నా కెరీర్‌ను ప్రభావితం చేయడమే కాకుండా నా ఆనందాన్ని లాగేసుకుంటున్నాయని నేను నమ్ముతున్నాను. ప్రమోషన్ పొందడానికి నేను అన్యాయమైన పద్ధతులను ఉపయోగించవచ్చు. అంటే, నేను ప్రతికూలతను సృష్టిస్తూ దానినే వ్యాప్తి కూడా చేస్తున్నాను. రెండు సంవత్సరాల పాటు బాధకు గురవుతున్నాను. ఈ స్థితిలో నేను మేనేజర్‌గా అయితే, నేను సంతోషంగా ఉండగలనా? అలాగే, తదుపరి ప్రమోషన్‌పై దృష్టి సారిస్తాను కాబట్టి ఆనందం కొనసాగదు, తరువాత తదుపరి…

వాస్తవము: మన విజయాలలో మన సంతోషం దాగి లేదు. మన గమ్యాన్ని చేరుకునే వరకు సంతోషాన్ని వాయిదా వేయవలసిన అవసరం లేదు. మన ఆలోచనా బాటలో, జీవిత ప్రయాణంలో, లక్ష్యాన్ని చేరుకునేందుకు చేసే కృషిలోనే సంతోషం ఉంది. 

రేపు ఇంకో రెండు నమ్మకాల గురించి చర్చించుకుందాం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »