Hin

2nd october 2024 soul sustenance telugu

October 2, 2024

సంతోషం కొరకు ప్రయాణమా లేక సంతోషకరమైన ప్రయాణమా (పార్ట్ 3)

జీవితం అందమైన సంబంధాల సంపదతో నిండినప్పుడు అన్ని స్థాయిలలో సంతోషాన్ని పొందవచ్చు. మీకు అత్యంత సన్నిహిత వ్యక్తి మీరే. మీ సంతోషానికి మూలం స్వయం యొక్క ఆధ్యాత్మిక గుర్తింపు యొక్క  స్పష్టమైన అవగాహన, మీ విలువను, మీ ప్రత్యేకతలు తెలిసిన స్వయంతో మీకున్న మంచి సంబంధం. అలాగే, మీరు మీ స్వయానికి ఎంత దగ్గరగా ఉంటారో, భగవంతునితో మరియు ఇతరులతో మీ సంబంధం అంత మంచిగా ఉంటుంది. భగవంతుడు స్వయంగా సానుకూల వ్యక్తిత్వ లక్షణాల సాగరుడు. వారి వ్యక్తిత్వంలోని ప్రతి అంశం, వారితో విభిన్న సంబంధాలను అనుభవం చేసుకోవటం మిమ్మల్ని సంతోషపరుస్తుంది, జ్ఞానం మరియు శక్తితో నింపుతుంది. అలాగే, మీరు భగవంతుడిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తారో, జీవితంలోని ప్రతి రంగంలో వారి చేతిని ఎంత ఎక్కువగా పట్టుకుంటారో, అంత ఇతరులు మీతో సన్నిహితంగా మరింత సంతృప్తి చెందుతారు. ఇది ప్రతి దశలో జీవితాన్ని అందంగా, తేలికగా చేస్తుంది. కాబట్టి స్వయాన్ని, భగవంతుడిని మరియు ఇతరులను ప్రేమించడం, దాని ప్రతిఫలంగా ప్రేమను పొందడం మీ జీవిత ప్రయాణంలో వివిధ కార్యాలు మరియు లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది.

అనుకున్నవి జరగడము, అనుకన్నవి జరగకపోవడం అనే మలుపులు మరియు హెచ్చుతగ్గులతో కూడిన రోలర్ కోస్టర్ ప్రయాణంలా ఉన్న జీవితం ఒక ప్రశాంతమైన రైలు ప్రయాణంలా మారుతుంది, ఎందుకుంటే సాఫీగా జరిగే ఈ ప్రయాణంలో మీరు మీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు ప్రభావితమవ్వకుండా సంతృప్తి మరియు ఆనందాల చల్లని గాలులను ఆస్వాదిస్తారు.

చివరగా, సద్గుణాలు ఇతరులతో పంచుకోవడమే గొప్ప లక్షణం అని చెబుతారు. మరో మాటలో చెప్పాలంటే, మీ సుగుణాలను మీరు అనుభవం చేసుకోవటం, వాటిని పెంచుకుంటూ మీ ముఖం, మీ దృష్టి, మీ చిరునవ్వు, మీ మధురమైన మాటలు మరియు మీ గొప్ప చర్యల ద్వారా వాటిని ఇతరులకు ప్రసరింప చేయడం ఇతరులను సంతోషపెట్టడమే కాక వారి సంతోషం, తేలికతనం మరియు ప్రేమతో నిండిన ఆశీర్వాదాలు మీకు చేరి మిమ్మల్ని సంతోషపరుస్తాయి. మంచితనాన్ని పంచుకోవడం అంటే మంచితనాన్ని స్వీకరించడం. లోలోపల పొందిన మంచితనం మీలో సంతోషం, తేలికతనం యొక్క నిధిని తెరుస్తుంది. కాబట్టి, మంచితనంతో నిండిన చాలా మంచి వ్యక్తిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకోండి. అప్పుడు మీరు చాలా సంతోషకరమైన వ్యక్తి అవుతారు. ఎందుకంటే భావోద్వేగ సంపన్న వ్యక్తి సంతోషంలో కూడా సంపన్నంగా ఉంటాడు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »
8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »