Hin

30th sep 2024 soul sustenance telugu

September 30, 2024

సంతోషం కొరకు ప్రయాణమా లేక సంతోషకరమైన ప్రయాణమా (పార్ట్ 1)

మన రోజువారీ పరస్పర చర్యలలో మనం సాధారణంగా “నేను ఈ లక్ష్యాన్ని సాధించే వరకు వేచి ఉండి అది సాకారం అయ్యాక నేను సంతోషంగా ఉంటాను”  అని తప్పుగా వ్యక్తపరుస్తాము.  ఆ లక్ష్యం పదోన్నతి కావొచ్చు, పరీక్షలో విజయం, వివాహం, పదవీ విరమణ, పిల్లల జననం లేదా కష్టమైన పరిస్థితి యొక్క  ముగింపు కావొచ్చు. ఈ మాటలు తప్పుఅని ఎందుకు అంటాము? జీవితం అంటే అంతే కదా? అలా అనడం తప్పు లేదా అసహజం కాదా? ఇలాంటి పదాలు లేకుండా మీ జీవితంలో ఒక్క క్షణం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు ఆశ్చర్యపోతారు. లక్ష్యాలను సాధించడానికి వేచి ఉండి, ఆపై ఆనందంగా ఉండటం అనేది  తప్పు అని గ్రహించడం చాలా ముఖ్యం. కాబట్టి ఇది సంతోషం కోసం ఒక ప్రయాణమా లేదా సంతోషకరమైన ప్రయాణమా అని ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిది. సంతోషం కోసం వేచి ఉండటం తప్పు ఎందుకంటే ఒక లక్ష్యం తరువాత మరొక సవాలు వస్తుంది; సవాలు తరువాత మరొక ఊహించని దశ వస్తుంది, చాలా అసౌకర్యమైన ఒత్తిడుల మధ్య మనం కోరుకున్న ఆనందాన్ని పొందడానికి సమయం  లేకుండా పోతుంది.

సంతోషాన్ని ఒక లక్ష్యం కోసం కృషి చేస్తున్నప్పుడు ఉండే స్థితిగా నిర్వచించవచ్చు, అంతే కానీ లక్ష్యాన్ని సాధించిన తర్వాత పొందే అనుభూతి కాదు. ఎందుకంటే జీవితం లక్ష్యాలతో కూడిన ప్రయాణం, కొన్నిసార్లు ఒకదాని తరువాత ఒకటి మరియు కొన్నిసార్లు అనేక లక్ష్యాలు ఒకే సమయంలో వస్తాయి.  కాబట్టి లక్ష్యాలను సాధించే వరకు ఆత్రుతగా వేచి ఉండాలా లేదా లక్ష్యాలను సాధించే సమయాన్ని మన జీవిత ప్రయాణంలో అంతర్భాగంగా అంగీకరించాలి. జీవితం  నిత్యం వేగవంతంగా సవాళ్ళతో కూడినదిగా మారిన కారణంగా  మనం సంతోషాన్ని విజయంతో ముడిపెట్టడం మన ఆధునిక విశ్వాస వ్యవస్థలో(బిలీఫ్ సిస్టమ్) అంతర్భాగంగా మారింది. ఆధ్యాత్మిక జ్ఞానం ఈ ఆలోచనలో మార్పు తీసుకురావాలని సూచిస్తుంది మరియు ప్రతి రోజు సంతోషాన్ని పొందడం బోధిస్తుంది – (i) సృజనాత్మక ఆలోచనల అనుభూతి పొందడం (ii) వాటిని ఆచరణలోకి తీసుకురావడం ద్వారా మీ శక్తులు , ప్రత్యేకతలు మరియు నైపుణ్యాల అనుభూతి పొందడం (iii) స్వయంతో, భగవంతునితో మరియు ఇతరులతో మంచి సంబంధాలను అనుభూతి చేసుకోవడం. (iv) మంచితనాన్ని మరియు సద్గుణాలను  అనుభూతి చెందుతూ ఇతరులకు అదే అనుభవాన్ని పంచడం.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »