
చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల
October 1, 2024
జీవిత ప్రయాణంలో అడ్డంకులు మన విజయాలకు తాత్కాలిక అడ్డంకులు కావచ్చు, కానీ మన సంతోషానికి అడ్డంకులు కావు అనే ఆలోచన విలువైనది. అప్పుడే జీవిత ప్రయాణం సంతోషం కోసం కాకుండా సంతోషకరమైన ప్రయాణం అవుతుంది. ఒకేసారి అనేక సవాళ్లతో ఉన్న ప్రయాణంలో సంతోషంగా ఉండటానికి అత్యంత ముఖ్యమైన విధానాలలో ఒకటి మన ఆలోచనా సంపదను పెంచుకోవడం. అసంపూర్ణమైన పనులు లేదా లక్ష్యాలు సంపూర్ణం కావడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నప్పటికీ లేదా అధిగమించాల్సిన జీవిత సంఘటనలు ఉన్నప్పటికీ సరైన ఆలోచనా విధానం మనల్ని సంతోషపరుస్తుంది. సవాలుతో కూడిన రోజున మీ ఆలోచనల నాణ్యతను పెంచుకొని ఆంతరికంగా మీకు ఎంత ఉన్నతంగా మరియు సంపూర్ణంగా అనిపిస్తుందో చూసుకోండి. ఇది మిమ్మల్ని పూర్తిగా శుద్ధమైన సంతోష స్మృతిలో ఉండేలా చేస్తుంది గానీ సమస్య స్మతిలోగానీ, సమయ(తేదీ) స్మృతిలోగానీ ఉండనివ్వదు. సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో మీ కళ్ళతో మీరు ఎప్పుడు చూడగలరో, ఏ తేదీన అది జరుగుతుందో అని మీరు వేచి ఉండరు. మీరు ఎంచుకోవలసిన ఎంపికనే గొప్ప ఆలోచనకు మూలం. మీరు జ్ఞానాన్ని బాగా ఎంచుకొని పనికి బయలుదేరే ముందు లేదా మిమ్మల్ని రోజంతా బిజీగా ఉంచే ఏదైనా కార్యకలాపాలను ప్రారంభించే ముందు ప్రతిరోజూ దానిని మీ మనస్సుకు అందించండి.
అలాగే, ఒక కట్టెలు కొట్టేవాడి కథ కూడా ఉంది. అతను రోజంతా చాలా కష్టపడి పనిచేసేవాడు, కానీ కారణం తెలియకుండానే రోజు చివరిలో ఎక్కువ కట్టెలను కొట్టేవాడు కాదు. ఇది చాలా రోజుల పాటు కొనసాగింది, ఒక రోజు ఎవరో ఒక వ్యక్తి మీ గొడ్డలిని ఎందుకు పదును పెట్టకూడదని అతనికి సూచించారు. అలా అతను పదును పెట్టాక అతని అలసిపోయే రోజులు ముగిసాయి. అదే విధంగా, మన బలాలు, విశేషతలు, నైపుణ్యాలు అయిన మన గొడ్డలిని పదును పెట్టాల్సిన అవసరం ఉందని ఎప్పుడూ ఆలోచించకుండా వివిధ జీవిత లక్ష్యాల కోసం రోజంతా వెతుకుతూ ఉంటాము. మన ప్రత్యేకమైన ప్రతిభతో సహా మన బలాలు, సానుకూలతలు మరియు విశేషమైన వ్యక్తిత్వ లక్షణాలను అనుభవం చేసుకోని రోజు లేకుండా చూసుకోవాలి. వీటిని మనం ఎలా అనుభవం చేసుకుంటామని మీరు ఆలోచించవచ్చు. వాటిని ఆచరణాత్మక చర్యలోకి తీసుకురావడమే సులభమైన మార్గం. ఇది మిమ్మల్ని ఆంతరికంగా పరిపూర్ణంగా చేస్తుంది. కానీ దానితో పాటు, మీ లోపల ఉన్న ఈ ప్రత్యేకమైన సానుకూలతలను ఆచరణాత్మకంగా వర్తింపజేయడం మరియు దాని ఫలితంగా అనుభవం అయ్యే ఉన్నతమైన ఆత్మగౌరవం వల్ల కలిగే స్వచ్ఛమైన సంతోషం, మీ ఆశయాలను వేగంగా నెరవేర్చడాన్ని సులభతరం చేస్తుంది.
(సశేషం…)
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల
Start your day with a breeze of positivity and stay motivated with these daily affirmations
After Clicking on Join, You will be redirected to Whatsapp Community to receive daily message. Your identitiy will be secured and no group member will know about another group member who have joined.