Hin

25th April 2025 Soul Sustenance Telugu

April 25, 2025

సంతుష్టత – ధారణ చేసి రేడియేట్ చేయండి

మన సంతుష్టతని మరియు మన కోరికలను సమతుల్యం చేసుకోవడమే మనం నేర్చుకోవలసిన జీవిత-నైపుణ్యం. నా జీవితంలో అన్ని మెరుగుదలలు చేసిన తర్వాత, నేను సంతుష్టంగా ఉంటాను అని అనుకుంటున్నానా, లేదా నేను ప్రస్తుతం సంతుష్టంగా ఉంటూ మరింత మెరుగుపరచడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకుంటున్నానా అని మనము చెక్ చేసుకుందాము. సంతుష్టత అంటే మనకు సాధించాలనే కోరిక లేదని కాదు. మనము ఇప్పటికే సంతృప్తిగా ఉన్నాము మరియు మా భవిష్యత్తును మెరుగుపరచడానికి మరింత కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాము అని అర్థం . లక్ష్యాలను సాధించి, బాగా పని చేసి, సౌకర్యవంతమైన జీవితాలను గడుపుతున్నపటికీ ఎప్పుడూ సంతృప్తి చెందని వ్యక్తులను మీరు చూసే ఉంటారు.  అలాగే, ఏదీ  సాధించకుండా, జీవితంలో చాలా సంతృప్తిగా ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా మీరు కలిసి ఉంటారు. ఇది సంతుష్టత మరియు సాఫల్యం మధ్య ఉన్న లింక్ ఏంటి అని మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది కదా ? సంతుష్టత, మనము ఎవరము, మన వద్ద ఏముంది లేదా ఏమి సాధించాము అన్నదానికి సంబంధము లేనిది. అది, ఇప్పుడు ఉన్న దానితో సంతోషంగా ఉంటూ మరిన్నింటి కోసం కృషి చేయడం అనే ఒక అందమైన గుణం. బాహ్య పరిస్థితులు మరియు వ్యక్తులతో సంబంధం లేకుండా సంతుష్టతను పెంపొందించుకోవాలి. సంతుష్టంగా ఉండటం అంటే మనం ఉపసంహరించుకోవడం, బద్ధకంగా ఉండడం, సాధించడం మానేయడం లేదా మన వద్ద ఉన్నదానితో స్థిరపడడం అని అర్థం కాదు. ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ – అంటే  మనం ఎవరు, మనకు మరియు మన చుట్టూ ఏమి జరుగుతుందో మరియు మనం ఉన్న వ్యక్తులతో – ప్రతిదీ సరిగ్గానే ఉంది మరియు మేము తదుపరి విషయాలపై పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని అర్థము. సంతుష్టంగా ఉండాలంటే ఒక్క ఆలోచన చాలు. పరిస్థితుల పట్ల మీ సంతుష్టత యొక్క ఎనర్జీ పోజిటివిటీకి ఇందనం మరియు శక్తి వంటిది. 

 

రోజును ప్రారంభించే ముందు, మీరు ఒక సంతుష్ట జీవి అని ప్రతిరోజూ గుర్తు చేసుకోండి. మీ జీవితంలోని ప్రతి సన్నివేశంతో, మీతో, మీ కుటుంబంతో, మీ పనితో, మీకు ఏమి జరుగుతుందో, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎల్లప్పుడూ సంతుష్టంగా ఉండండి. అంతా బాగానే ఉంది, ఏ విధంగా జరగాలో అలాగే జరుగుతోంది, మీరు ఉన్న తీరు పరిపూర్ణంగా ఉంది, మీకు ఉన్నది సరిపోతుంది మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు పరిస్థితులు సరైనవి. మీ సంతుష్టత మీ ఆంతరిక సంతోషం మరియు శాంతికి ప్రతిబింబం. మీరు సంతుష్టతను అనుభవం చేయడానికి బయట ఏదీ పరిపూర్ణంగా ఉండవలసిన అవసరం లేదు. మీ లక్ష్యాల కోసం కృషి చేస్తున్నప్పుడు మీ శాంతి, ప్రేమ మరియు సంతోషం అనే విలువలపై ఎప్పుడూ రాజీపడకండి. మీ సంతుష్టత అనేది మీరు సాధించిన వాటిపై ఆధారపడి ఉండదు. మీకున్న దానితో సంతుష్టంగా ఉండండి. సంతుష్టంగా ఉంటూ ప్రగతి కొరకు పని చేయండి, ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోండి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి, అర్థవంతమైన లక్ష్యాలను సాధించండి మరియు స్వీయ-అభివృద్ధి కోసం పని చేయండి. ప్రతి సన్నివేశానికి మీ ఉన్నతమైన వైబ్రేషన్‌ని రేడియేట్ చేయండి. ప్రతి సన్నివేశానికి మీ శాంతి, స్వచ్ఛత మరియు శక్తిని రేడియేట్ చేయండి మరియు తదుపరి సన్నివేశం యొక్క శక్తిని ఉన్నతంగా చేయండి. పోటీకి బదులు అందరికి సహకరించండి. లోలోపల నుండి మీరు సృష్టించే పాజిటివిటీ, ఇతరుల నుండి మీరు పొందే ఆశీర్వాదాలు మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతుష్టంగా, సంతోషంగా మరియు విజయవంతంగా ఉంచుతాయి.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »