Hin

14th feb 2024 soul sustenance telugu

February 14, 2024

సంతోషాన్ని అనుభూతి చెందడం మరియు ఇతరులకు పంచడం (పార్ట్ 1)

జీవితాన్ని ఉత్సాహభరితంగా, సంతోషంగా గడపడం అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అందమైన అంశం. అలాగే, మన వ్యక్తిత్వంతో, చేతలు మరియు నైజంతో ఆ సంతోషాన్ని ఇతరులకూ పంచుతూ ఉంటాము. మనం సంతోషంగా ఉండటం ఒక విషయమైతే ఆ సంతోషాన్ని ఇతరులతో ప్రతి అడుగులో పంచుకోవడం మరో విషయం. రోజంతా ఎవరు కలిసినా వారిని గ్రీట్ చేస్తూ ఆనందంగా ఉండటం కొందరి హాబీగా ఉంటుంది. ఇలా చేయడం వలన, రోజంతా వచ్చే టెన్షన్లను వారు తేలికైన మనసుతో ఎదుర్కోగలుగుతారు.

అలాగే, ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క సుగుణం అనే రుచిని అందించండి, చిరునవ్వు, సంతృప్తి, తేలికదనము ఇవన్నీ సంతోషంలోని భిన్న భిన్న రంగులు, ఇవి జీవిత ప్రయాణాన్ని అందంగా చేస్తాయి. ఈ జీవిత ప్రయాణాన్ని మీరు ఇతరులతో కలిసి చేస్తున్నారు. కనుక, మీతోపాటు, మీతో ఉన్నవారు కూడా ఈ అందమైన అనుభవాలను ఆస్వాదించగలుగుతారు. ఇటువంటి ఇవ్వడము మరియు తీసుకోవడం ప్రయాణాన్ని సంపూర్ణ ఆనందాలతో నింపి జీవితం మీరు ఆశించిన విధంగా ఉండి, జీవితాన్ని మీరు పూర్తిగా ఆస్వాదిస్తారు. ఈ అనుభూతులు బహుమతుల వంటివి, వీటిని మనం ఇతరులతో ఇచ్చిపుచ్చుకుంటే సంతోషం ఎప్పటికీ మనతోటే ఉంటుంది. భౌతికమైన కానుకలు కొద్ది రోజుల వరకే, కొందరి వరకే పరిమితం అయి ఉంటాయి. కానీ ఈ అగోచరమైన కానుకలు, అనంతమైన సంతోషాల బహుమతులు ఇతరులకు రోజూ ఇస్తూ ఉండవచ్చు, అందరికీ ఇవ్వవచ్చు. ఇది మనం మన ఇంట్లో, ఆఫీసులో, సన్నిహితుల వద్ద, సమాజంలో చేయవచ్చు.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th april 2025 soul sustenance telugu

మనకు మనమే ఎమోషనల్ డిటాక్స్ చేసుకోవాలి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి కొన్ని నిమిషాలకు వివిధ మీడియా నుండి వచ్చే సందేశాలను చదవడానికి మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ని చెక్ చేసే అలవాటు

Read More »
25th april 2025 soul sustenance telugu

సంతుష్టత – ధారణ చేసి రేడియేట్ చేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన సంతుష్టతని మరియు మన కోరికలను సమతుల్యం చేసుకోవడమే మనం నేర్చుకోవలసిన జీవిత-నైపుణ్యం. నా జీవితంలో అన్ని మెరుగుదలలు చేసిన తర్వాత,

Read More »
24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »