Hin

15th Feb 2024 Soul Sustenance Telugu

February 15, 2024

సంతోషాన్ని అనుభూతి చెందడం మరియు ఇతరులకు పంచడం (పార్ట్ 2)

మీ రోజును ప్రారంభించేటప్పుడు మీ మనసును సంతోషపు ఆలోచనలతో నింపుకోండి. ఉదా-  ఈరోజు, రోజంతా, ఎవరిని కలిసినా కానీ నేను అందరికీ నా చిరునవ్వును కానుకగా ఇస్తాను, ప్రతి ఒక్కరిలోని ప్రత్యేకతలను నేను మనసులో ఉంచుకుని ఆనందాన్ని ఆస్వాదిస్తాను. రోజంతా, ఈరోజు, నేను అందరినీ వారిపట్ల నాకున్న పాజిటివ్ ఆలోచనలతో కలుస్తాను. ఇలా కూడా ఆలోచించవచ్చు – రోజంతా, ఈ రోజు, నేను రకరకాల సుగుణాలను వినియోగించి కర్మలను చేస్తాను, కర్మలో తేలికదనాన్ని అనుభూతి చెంది ఆ తేలికదనాన్ని ఇతరులకూ పంచుతాను.

ఈ విధమైన ఆలోచనలు నా చుట్టూ ఉన్నవారిని సంతోషపరిచి తిరిగి నాకు సంతోషాన్నిస్తాయి. ఇది నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా సంతోషంగా చేస్తుంది. సంతోషం ముందుగా నా నుండే ప్రారంభమవుతుంది, ఇతరులకు పంచే సంతోషం ముందుగా నాకే సంతోషాన్నిస్తుంది. రోజంతటిలో, ఎవరిని కలిసినా, మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి మరియు పరిశీలించుకోండి – నేను వ్యక్తిని సామాన్య రీతిలో కలిసానా లేక వారితో నేను సంతోషాన్ని పంచుకుని వారి భారాన్ని, చింతను తగ్గించానా? ఎవరిని కలిసినా వారికి అనంతమైన సంతోషాన్ని అందించడం నా కర్తవ్యం. సంతోషం అనే భావోద్వేగమే మనందరినీ ఒక బంధంగా బంధిస్తుంది. సంతోషాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వలన జీవితం అందంగా మారి మన మనుగడ అర్థవంతంగా అవుతుంది. సాధారణంగా, ఆఫీసులోగానీ, మరే పనిలోనైనా మనం పనిలో మునిగిపోయి బిజీగా ఉంటాం. ఆ సమయంలో మనం ఎటువంటి నెగిటివ్ పనులు చేయము. అయితే మనలో ఉండే గుణాలను మనం మర్చిపోయినప్పుడు మన సంతోషం తగ్గుతుంది.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

15th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మన విధి అందంగా ఉంటుంది  నేడు, మనం ప్రతిరోజూ ఒక సాధారణ లక్ష్యంతో జీవిస్తున్నాము – మన

Read More »
14th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి ఉదయం మనం రోజును ప్రారంభించినప్పుడు, వివిధ చర్యలను చేయాల్సి ఉంటుంది. మనం ఇంట్లో ఉన్నా లేదా మన ఆఫీసులో ఉన్నా

Read More »
13th May 2025 Soul Sustenance Telugu

తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మనది వినాలని లేదా మనమంటే ఆసక్తికరంగా అనిపించాలని అందరితో మాట్లాడుతూ ఉండాలి అని భావిస్తాము. ఈ ఆత్రుత

Read More »