Hin

16th feb 2024 soul sustenance telugu

February 16, 2024

సంతోషాన్ని అనుభూతి చెందడం మరియు ఇతరులకు పంచడం (పార్ట్ 3)

సంతోషంగా పనులు చేయడం వలన జీవితం అప్పుడప్పుడూ మీ ముందుకు తీసుకువచ్చే  చింతలు, టెన్షన్ల నుండి మిమ్మల్ని పూర్తిగా విముక్తి చేస్తుంది. సంతోషాలు నిండిన జీవితం మిమ్మల్ని పూర్తిగా స్థిరంగా, భావోద్వేగపరంగా శక్తివంతంగా చేస్తుంది. ఈ ఒక్క రోజు ఇలా ప్రయత్నించి చూడండి. ఒక రోజు కలిసిన వారందరికీ సంతోషాన్ని పంచి చూడండి, మరుసటి రోజు ఇవ్వకుండా చూడండి. సంతోషాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో బిజీగా ఉన్నప్పుడు ఆంతరికంగా శక్తివంతంగా ఉంటారు. అనేక రకాల ఆటంకాలను సులభంగా, మరింత దృఢంగా ఎదుర్కుంటారు.

సంతోషాలు పంచిన రోజు చాలా త్వరగా గడిచినట్లుగా, ఆనందాల రైడ్ చేసినట్లుగా, కానుకలు ఇచ్చిపుచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ కానుకలు కనిపించవు, ఆంతరిక వ్యక్తిత్వానికి సంబంధించినవి. మీలోని ప్రత్యేకతలను ఇతరులకు బహుకరించండి. వాటిని మీవద్దే పెట్టుకోకండి. ఇతరులకు ఇవ్వడంలో పెద్ద మనసు పెట్టుకోండి. ఉదాహరణకు, మీకు ధైర్యంగా మాట్లాడగలిగే కళ ఉందనుకోండి, ఈ కళను మీ వద్దే పెట్టుకోకండి. ఆ మాటలతో ఇతరులకు సంతోషాన్ని పంచండి, వారిని ఉత్సాహంలో నింపండి. మీలో వినయము, అందరి కోసం మంచిగా ఆలోచించే సుగుణం ఉందనుకోండి, ఆ శుభ భావనలను మీలోనే పెట్టుకోకండి. వాటిని మీ మాటలతో, చేతలతో వ్యక్తపరిచి వారికి సంతోషాన్ని పంచండి. ఉదాహరణకు మీరు బాగా తెలివైనవారు అనుకోండి, మీకున్న జ్ఞానాన్ని మీ వద్దే పెట్టుకోకుండా అందరికీ ఇచ్చి సహాయం చేయండి. సంతోషాన్ని పంచేందుకు ఇవి రకరకాల మార్గాలు. గుర్తుంచుకోండి, మీలో ఉన్న ప్రతి ప్రత్యేకత సేవ చేయాలి, అంతేకానీ మీ కోసమే వాటిని మీ లోపల దాచి పెట్టుకోకండి. మీలోని విశేషతల తరంగాలను అందరికీ పంచండి. అప్పుడు మీ జీవితం మరియు ఇతరుల జీవితం సంతోషాలు, ఆనందాలతో నిండిపోతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »
2nd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 1)

మనం అనూహ్యమైన జీవితాన్ని గడుపుతున్నాము. మన జీవితంలో తరచూ ఊహించని పరిస్థితులు వస్తున్నాయి. దీనికంతటికీ కారణం ఏమిటి? ఈ రోజు మన జీవితాలలో క్లిష్ట పరిస్థితులు ఎందుకు పెరుగుతున్నాయి? భగవంతుడు వెల్లడించిన ప్రపంచ నాటకం

Read More »
1st dec 2024 soul sustenance telugu

దివ్యమైన ఆత్మ యొక్క 12 లక్షణాలు (పార్ట్  2)

స్వయంలోని బలహీనతలను, లోపాలను సులభంగా పరిశీలించుకోగలిగే అద్దం లాంటి వారు దివ్యమైన ఆత్మ. వారిలో భగవంతుని మంచితనాన్ని, శక్తులను చూడగలుగుతాము. వారు భగవంతునితో స్వచ్ఛంగా, సత్యంగా ఉంటారు. వారు ప్రతిదీ ఎలా ఆచరణలోకి తీసుకురావాలనే

Read More »