Hin

11th june2024 soul sustenance telugu

June 11, 2024

సరైన విధంగా సంతోషాన్ని ఆస్వాదించడం  (పార్ట్ 1)

మన జీవన విధానాన్ని నిర్వచించే అతి ముఖ్యమైన,  ప్రభావవంతమైన అంశం ఆశ మరియు దృఢత్వం. జీవితంలో విజయం ఎక్కువగా ఈ రెండు శక్తులచే నిర్వచించబడుతుంది. ఒక కఠిన పరిస్థితి యొక్క ప్రభావం వ్యక్తులపై ఎంతగా చూపుతుందంటే ఇక దాని తరువాత వారు విజయం సాధించగలరని వారు నమ్మరు. ఉదా. చాలా విజయవంతమైన వ్యక్తి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతాడు లేదా ముఖ్యమైన బంధువును పోగొట్టుకుంటాడు లేదా పనిలో ఆకస్మిక ఆర్థిక నష్టాలను అనుభవిస్తాడు. ఇలాంటి సంఘటనలు చాలా మంది వ్యక్తుల ఉత్సాహాన్ని బలహీనపరచి భవిష్యత్ చర్యల పట్ల వారి విశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే,  జీవితంలో ఎదుర్కొన్న ఒక నిర్దిష్ట ప్రతికూల సంఘటన తర్వాత చాలా మంది వ్యక్తుల జీవితాలు మారిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు ఏదో ఒక ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నారనేది నిజం. ఈ ప్రతికూల పరిస్థితులు మనస్సుతో లేదా వారి భౌతిక శరీరంతో లేదా వారి పాత్రలో లేదా చాలా ముఖ్యంగా వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో ఉంటాయి.

ఆశ మరియు దృఢత్వం అనే రెండు శక్తులు ఈ విభిన్న పరిస్థితులను ఎదుర్కోవడానికి మనందరికీ అవసరం. ప్రస్తుతం చాలా మందిలో ఈ రెండు శక్తులు తగ్గుముఖం పట్టాయని చూసాము. ప్రపంచం అనేక రకాలుగా పురోగమిస్తున్నప్పటికీ, పెరుగుతున్న విభిన్న ప్రతికూల సంఘటనలను ఎదుర్కొనేందుకు వ్యక్తులు ఆంతరికంగా శక్తివంతంగా లేరు. అలాగే, మన ఆలోచనలు, భావాలు మరియు భావోద్వేగాలను నియంత్రించే శక్తి తగ్గిపోతుంది. వాటిని సానుకూలంగా ఉంచడం చాలా మందికి కష్టంగా మారుతోంది. అయితే, జీవితం అంతా హెచ్చు తగ్గులు మాత్రమేనని, సంతోషం మరియు దుఃఖం రెండూ జీవితంలో భాగమేనని కొందరు నమ్ముతున్నారు. కానీ, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం, దుఃఖాన్ని అనుభవించడం అనేది ఆంతరిక శక్తి  మరియు స్థిరత్వం లేకపోవడానికి సంకేతం. అలాగే, ఆనందం అనేది మన సహజమైన మానసిక స్థితి, ఇది మనం ఇష్టపడేది. దీనిని ఎల్లప్పుడూ అనుభవం చేసుకోవాలి.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd june2024 soul sustenance telugu

మీ మనస్సు ఒక బిడ్డ వంటిది

మనస్సు మన బిడ్డలాంటిది. మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, మీలో ఉన్న ఈ బిడ్డ  శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దానిని ప్రేమించాలి, పాలన చేయాలి మరియు ఓదార్చాలి. మనుష్యులు తమ మనస్సుపై నియంత్రణ

Read More »
21st june2024 soul sustenance telugu

మనుష్యుల వైబ్రేషన్లను అనుభూతి చెందడం ప్రారంభించండి

మీరు ఎవరినైనా కలిసినప్పుడు, మీ దృష్టి ఎటు వెళుతుంది? ఒకటి: వారి రూపం మరియు వస్త్రాలు పై మీ దృష్టి వెళుతుంది. రెండు: వారి మాటలు మరియు చేతల పై దృష్టి వెళుతుంది. ఇపుడు

Read More »
20th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 4)

మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు సమతుల్య మనస్సును ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. కోపం, ఆవేశం, అహం లేదా దురాశ మన ఆలోచనలలో అసమతుల్యతను సృష్టించవచ్చు. మనల్ని మనం మనలాగే అనుభవం చేసుకున్నప్పుడు మరియు

Read More »