Hin

12th june2024 soul sustenance telugu

June 12, 2024

సరైన విధంగా సంతోషాన్ని ఆస్వాదించడం  (పార్ట్ 2)

నేడు కొంతమందికి సంతోషం అనేది భౌతికమైన వాటిపై  ఆధారపడి ఉండి జీవితంలోని ప్రతి రంగంలో వివిధ రకాలైన సైన్స్ మరియు టెక్నాలజీని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఈ రకమైన సంతోషానికి రెండు ముఖాలు ఉన్నాయని మీకు తెలుసా. జీవితంలో మంచిగా ఉన్నప్పుడు అంటే మీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు లేనప్పుడు, మీరు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నారని మీరు భావిస్తారు. అలాగే, ఇంట్లో గొడవలు లేదా మీ ఆరోగ్యంలో కొద్దిగా మార్పు లేదా ఒక స్నేహితుడు మీతో సహకరించకుండా మీతో బాగా మాట్లాడకపోవడం వంటి చిన్న ప్రతికూల సంఘటనలు జరిగినప్పుడు సైన్స్ మరియు టెక్నాలజీ యొక్క అదే భౌతిక మాధ్యమాలు ఇకపై ఆధారం అవ్వలేవు. మీకు లోపల ఖాళీగా అనిపిస్తుంది. ఇది సంతోషానికి తప్పు పునాది. మరోవైపు, జీవితం మనకు అపుడప్పుడు నెగిటివ్ సంఘటనలను అందించినప్పటికీ,నిజమైన సంతోషం మన శక్తులు మరియు గుణాలపై ఆధారపడి ఉంటుంది, శాశ్వతమైనది. జీవితంలో సానుకూల సంఘటనలు మాత్రమే ఉన్న వ్యక్తి కొరకు వెతకటం ప్రయత్నిస్తే మీకు ఏ సమస్య లేని వారు ఒక్కరు కూడా కనిపించరు. 

అలాగే, ప్రపంచం వైజ్ఞానిక పురోగతి వల్ల లేదా మెరుగైన వైద్య సదుపాయాల వల్ల లేదా ఎక్కువ సంపద వల్ల సంతోషం పెరుగుతోందనే తప్పుడు నమ్మకంతో జీవిస్తోంది. ఇది ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఇది తాత్కాలికం. ప్రపంచంలో బాధపడుతూ దుఃఖంగా అనేకులు లేరా? అత్యంత ధనవంతులు, అత్యంత ప్రసిద్ధమైన వ్యక్తులు, అత్యంత విద్యావంతులు మరియు అత్యంత అభివృద్ధి చెందిన వ్యక్తులు నేడు జీవిత సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ధ్యానం వైపు చూస్తున్నారు. చాలా సందర్భాలలో ధనవంతులుగా, ప్రసిద్ధులుగా, భౌతిక వాసతులతో విజయవంతంగా అవ్వడంలో వచ్చే ఒత్తిళ్ల నుండి విముక్తి పొందాలని వారు కూడా కోరుకుంటున్నారు.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd june2024 soul sustenance telugu

మీ మనస్సు ఒక బిడ్డ వంటిది

మనస్సు మన బిడ్డలాంటిది. మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, మీలో ఉన్న ఈ బిడ్డ  శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దానిని ప్రేమించాలి, పాలన చేయాలి మరియు ఓదార్చాలి. మనుష్యులు తమ మనస్సుపై నియంత్రణ

Read More »
21st june2024 soul sustenance telugu

మనుష్యుల వైబ్రేషన్లను అనుభూతి చెందడం ప్రారంభించండి

మీరు ఎవరినైనా కలిసినప్పుడు, మీ దృష్టి ఎటు వెళుతుంది? ఒకటి: వారి రూపం మరియు వస్త్రాలు పై మీ దృష్టి వెళుతుంది. రెండు: వారి మాటలు మరియు చేతల పై దృష్టి వెళుతుంది. ఇపుడు

Read More »
20th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 4)

మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు సమతుల్య మనస్సును ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. కోపం, ఆవేశం, అహం లేదా దురాశ మన ఆలోచనలలో అసమతుల్యతను సృష్టించవచ్చు. మనల్ని మనం మనలాగే అనుభవం చేసుకున్నప్పుడు మరియు

Read More »