Hin

30th dec 2023 soul sustenance telugu

December 30, 2023

సరళత మీ జీవితాన్ని నడిపించనివ్వండి

సమయానుసారంగా మీ గుర్తింపు వాస్తవిక, సత్య స్వరూపం  నుండి ఇతరులు మిమ్మల్ని  కోరుకున్నట్లుగా మారుతున్నట్లు మీకు అనిపిస్తుందా? మీరు సమాజానికి అనుగుణంగా లేకుంటే మిమల్ని అంచనా వేసి, లేబుల్ చేస్తారని లేదా తిరస్కరించబడతారని మీరు భయపడుతున్నారా? మనం ఇతరులచే అంగీకరించబడేలా, ప్రశంసించబడేలా లేదా ఆమోదించబడేలా జీవించినప్పుడు, మనం మన సత్య స్వరూపాన్ని చంపుకుంటాము. ఇతరుల అంచనాలు, అభిప్రాయాలకు మనస్సు చిందరవందరగా అయ్యి  ఒత్తిడికి గురవుతుంది. మనం మనలా ఉండటానికి మరియు జీవించడానికి మనల్ని మనం తగినంతగా అంగీకరించి, గౌరవించుకుందాం. స్వయంతో సంబంధాన్ని కోల్పోవద్దు. మన గురించి మనం ఆలోచించే, మన భావాలను, ఆలోచనలను తెలియపరిచే మరియు మనకు కావలసినది చేసే  ధైర్యం, చిత్తశుద్ధి ఉండాలి. ఇది సరళత. మనం మన మనస్సును సరళంగా చేసుకున్నప్పుడు, మన జీవితం సరళంగా మారుతుంది. ఇంట్లో అయినా, కార్యాలయంలో అయినా లేదా అందరి సమూహంలో అయినా, మీ అలవాట్లు, విలువలు, ప్రవర్తనలను నిర్వచించుకొని వాటికి కట్టుబడి ఉండండి. ఆహారం, డ్రెస్సింగ్ లేదా జీవన అలవాట్లు అయినా, నాకు ఏది సరైనదో నేను నిర్ణయించుకుంటాను. నేను సరళత మరియు ప్రామాణికతను ఎంచుకుంటాను అని మీకు మీరే గుర్తు చేసుకోండి.

 

మన జీవితంలోని ప్రతి అంశాన్ని ఎక్కడో క్లిష్టంగా చేసుకున్నామని మీరు నమ్ముతున్నారా? మీరు చిన్న చిన్న విషయాలలో ఆనందాన్ని పొందిన మరియు నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన ఆ సరళమైన కాలానికి తిరిగి వెళ్లాలనుకుంటున్నారా? ఈ రోజు మనం సంబంధాలు క్లిష్టంగా ఉన్నాయని, ఉద్యోగాలు కష్టంగా ఉన్నాయని, పిల్లల పెంపకం ఒక సవాలుగా ఉందని, ఆరోగ్యం క్షీణిస్తోందని అంటున్నాం…నిజానికి ఈ ప్రపంచం క్లిష్టంగా లేదు, అతిగా ఆలోచించడం, గతాన్ని పట్టుకుని ఉండటం, మన చేతిలో లేని వాటిని నియంత్రించాలని అనుకోవడం, అనాలోచితంగా స్పందించడం, ఇలా ఆటో పైలట్ మోడ్ లో జీవిస్తున్నాము. కాబట్టి, మన మనస్సు, బుద్ధి మరియు శరీరం నిరంతరం ఒత్తిడితో ఉంటున్నాయి. ఈ ఒత్తిడిని మనం ప్రపంచానికి ప్రసరింపజేస్తున్నాము. తిరిగి ఒత్తిడి, కోపం, భయం మరియు బాధ యొక్క వైబ్రేషన్స్ ని తీసుకుంటున్నాము. మన మనస్సును, జీవితాన్ని మరియు మన ప్రపంచాన్ని సరళీకృతం చేయడానికి సమయం ఇదే. ఈ రోజు, విషయాలు సరళంగా ఉంచకుండా మిమ్మల్ని నిరోధించే ప్రతిదాన్ని వదిలేయడానికి మీ మనస్సును ప్రోగ్రామ్ చేయండి. సరళత మీ జీవితాన్ని నడిపించనివ్వండి. మీకు మరియు మీతో నివసించే లేదా పని చేసే వ్యక్తులకు అది తెచ్చే అపారమైన స్వేచ్ఛ మరియు ఆనందాన్ని మీరు గ్రహిస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 2)

పరీక్షల సమయంలో  లేదా జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కొంటున్నప్పుడు స్థిరంగా ఉండటానికి చాలా ముఖ్యమైన మార్గం అంతర్గత శాంతి, శక్తి , స్థిరత్వంతో నిండిన కొన్ని సానుకూల ఆలోచనలను చేస్తూ రోజులో కొన్ని సార్లు

Read More »
21st jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 1)

మనమందరం మన ముందు ఎల్లప్పుడూ వివిధ రకాల సవాళ్లతో మన జీవితాలను గడుపుతాము. మనమందరం ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సవాళ్లలో లేదా మన పిల్లలు ఎదుర్కొనే అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటి పాఠశాల

Read More »
20th jan 2025 soul sustenance telugu

మీ సంకల్పశక్తి మీకు అతిపెద్ద బలం

మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలనుకున్నా, వ్యసనాన్ని వదులుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించాలనుకున్నా, విజయం లేదా వైఫల్యాన్ని మన సంకల్ప శక్తికి ఆపాదించుకుంటాము. కొన్నిసార్లు మనం అత్యధిక సంకల్ప

Read More »