Hin

20th august 2024 soul sustenance telugu

August 20, 2024

సరైన అలవాట్లను స్థిరంగా అమలు చేయడం

మొదట మనం మన అలవాట్లను తయారు చేసుకుంటే, మన అలవాట్లు మనల్ని తయారు చేస్తాయి అన్న నానుడి ఉంది. మనలో చాలా మంది గొప్ప అలవాట్లు చేసుకుంటారు, కానీ అవి మన జీవనశైలిలో విలీనం అయ్యేంత వరకు వాటిని కొనసాగించలేము.  ఏదైనా కార్యాచరణ లేదా అలవాటుతో, మన ఆలోచనల నుండి ప్రారంభించి, అవి మన వ్యక్తిత్వంలో స్థిరమైన భాగంగా మారే వరకు మనం చిన్న చర్యలను తీసుకోవాలి. మీరు నిజంగా ప్రయోజనకరంగా ఉన్న కొత్త అలవాటును అలవరుచుకొని  దానిని కొనసాగించడం కష్టమనిపించిందా? మీకు ఒత్తిడి అనిపించి లేదా దానికి కట్టుబడి ఉండటం కష్టమని మరొకరు చెప్పినందువల్ల ఏదైనా  ఆరోగ్యకరమైన అలవాటును వదులుకున్నారా? దానిని స్వీకరించడానికి మీకు మీరే కొంత సమయం ఇవ్వండి. ఏదైనా అలవాటు ఆటోమేటిక్ గా  మారడానికి ముందు కొన్ని రోజుల నిలకడగా  రోజూ  రిపీట్ అవడం  అవసరం. గతంలో ఒక అలవాటును కొనసాగించడంలో విఫలమైనప్పటికీ, లేదా కొనసాగించడం కష్టమని అందరూ  భావించినప్పటికీ, మనం దానిని అభ్యసిస్తూనే ఉండాలి. ఒక ఆరోగ్యకరమైన అలవాటును ఏర్పరచుకోవడంపై దృష్టి పెట్టండి. దాని అవసరాన్ని కొని అర్థం చేసుకొని  మీ షెడ్యూల్ లేదా పరిస్థితితో సంబంధం లేకుండా వరుసగా 20 రోజులు సాధన చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతిరోజూ, దాని కోసం ఒక దృఢ సంకల్పం తీసుకొని, ఇది ఇప్పటికే మీ దినచర్యలో విలీనం అయినట్లుగా విజువలైజ్ చేయండి . ఇది మీ జీవనశైలిలో కొత్త అలవాటును స్వీకరించడాన్ని సులభతరం చేస్తుంది. ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించడంలోనే బహుమతి దాగి ఉంది. అదనంగా, ఇది సంకల్ప శక్తిని, ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని పెంచుతుంది, మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది మరియు పనిలో మీకు విజయాన్ని తెస్తుంది. మీ అలవాట్లతో స్థిరమైన దినచర్యను ఏర్పాటు చేసుకోవడంతో స్వయం పట్ల  నియంత్రణను పెరుగుతుంది.

సరైన ఆలోచన, వైఖరి, నమ్మకాలు, వ్యాయామాలు, ధ్యానం, ఆధ్యాత్మిక అధ్యయనం, ఆహారం, విశ్రాంతి, నిద్ర, పని నీతి, సామాజిక అలవాట్లు మొదలైన మీ వ్యక్తిగత వృద్ధికి తోడ్పడే మంచి అలవాట్లను పెంపొందించడానికి క్రమశిక్షణను పెంపొందించడం ప్రారంభించండి. మీ వాస్తవికత ఎలా ఉండాలనుకుంటున్నారో దాని గురించి మాత్రమే స్థిరంగా ఆలోచనలను సృష్టించండి. మీ ఆలోచనలు సరైన వైఖరిని మరియు సరైన చర్యలను సృష్టిస్తాయి, ఆ చర్యలన్నీ మీ వ్యక్తిత్వంలో ఒక భాగంగా మారతాయి. వాటి గురించి ఆలోచించి, వాటిని ఆచరణలోకి తీసుకురావడం ద్వారా, మీరు మీ అలవాట్లను బలోపేతం చేసుకుంటారు. వాటిని మీ దినచర్యలో చేర్చుకోండి, అవి మీ ప్రాధాన్యత, అవి మీ రోజువారీ ప్రణాళికలో భాగం. మీరు ఏ కారణంగా అయిన మీ సాధారణ కార్యకలాపాలు మిస్ అయితే, మిమ్మల్ని మీరు విమర్శించుకొని వదిలేయకండి. మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి, అలవాటును అమలు చేయడానికి తిరిగి వెళ్ళండి మరియు మీరు చేయగలరని, మీరు చేస్తారని మీకు మీరే చెప్పుకోండి. మీ కోసం ఆరోగ్యకరమైన అలవాట్లకు కట్టుబడి ఉండటాన్ని సులభమైన పనిగా చేసుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »