Hin

సర్వ గుణాలు మరియు శక్తులతో మిమ్మల్ని మీరు నింపుకోవడం

March 10, 2024

సర్వ గుణాలు మరియు శక్తులతో మిమ్మల్ని మీరు నింపుకోవడం

సహజ లక్షణాలు లేక ప్రాథమిక లక్షణాలు మార్చలేని లక్షణాలు. సూర్యుని నుండి వేడిని, చక్కెర నుండి తీపిని తీయడం అసాధ్యం. వేడి-తీపి, సూర్యుడు-చక్కెర యొక్క తయారీలోనే ఉన్నాయి. అవి వాటి  ప్రాధమిక లక్షణాలు. అదే విధంగా, ఆత్మనైన నేను మానవ ఆత్మగా మారినప్పటికీ, నా లోతైన ప్రాథమిక లక్షణాలు ఇప్పటికీ నాలో ఎల్లప్పుడూ ఉన్నాయి. ఇవి నా అంతర్గత గుణాలు, నిజానికి నేను ఏ పని చేసినా, ఎవరితో సంభాషించినా మంచితనంలో పరిపూర్ణంగా ఉండేలా నా ఈ అంతర్గత గుణాలే నన్ను ప్రేరేపిస్తాయి.

ఆత్మ యొక్క ప్రాధమిక సహజ సుగుణాలు 7  : శాంతి, ఆనందం, ప్రేమ, సుఖం, స్వచ్ఛత, శక్తి మరియు సత్యత.  ఆ సుగుణాలే  శక్తులకు పునాది. 7 సుగుణాలు ప్రాథమిక రంగుల వలె ఉంటాయి మరియు శక్తులు వాటి ద్వితీయ రంగులు. నారింజ (ద్వితీయ రంగు) ఎరుపు మరియు పసుపు (రెండు ప్రాథమిక రంగులు) మరియు ఆకుపచ్చ (ద్వితీయ రంగు) పసుపు మరియు నీలం (రెండు ప్రాథమిక రంగులు)తో తయారు చేయబడినట్లుగా, సహనం, మాధురత, సంతృప్తి, వినయం మొదలైన అన్ని లక్షణాలు .. మరియు సహన శక్తి, ఎదుర్కొనే శక్తి, సర్దుకునే శక్తి, సహకరించే శక్తి మొదలైన అన్ని శక్తులు ప్రాథమిక సుగుణాలను కలపడం ద్వారా పొందబడతాయి.  ఉదా.

సహనం – శాంతి మరియు శక్తి

వినయం – ప్రేమ మరియు సత్యత 

ఎదుర్కొనే శక్తి – శక్తి మరియు సత్యత 

సహకరించే శక్తి – ప్రేమ మరియు ఆనందం

నేను అన్ని గుణాలు మరియు శక్తులతో నిండి ఉండేలా నా 7 సద్గుణాలను వెలుపలికి తీసి  పెంచుకోవటం మెడిటేషన్ యొక్క లక్ష్యం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

14th feb 2025 soul sustenance telugu

విశ్వసించండి. ఇక మీరు విజయం సాధిస్తారు

మీరు మీ పెద్ద లేదా చిన్న లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటూ వాటిని చేరుకోవడానికి చాలా కష్టపడ్డారా… కానీ ఎక్కడో ఒక చోట విజయం సందేహాస్పదంగా అనిపించిందా? అది ఫలితాన్ని ఎలా ప్రభావితం

Read More »
13th feb 2025 soul sustenance telugu

స్వీయ నియంత్రణ కళలో ప్రావీణ్యం పొందటం

మనమందరం బాగా జీవించడానికి మన జీవితాలపై నియంత్రణ కలిగి ఉండాలని కోరుకుంటాము. మన మనస్సు, బుద్ధి మరియు స్వభావాన్ని నియంత్రించడం మన శక్తి. అది మన భౌతిక ఇంద్రియాలను కూడా ఆటోమేటిక్ గా నియంత్రిస్తుంది.

Read More »
12th feb 2025 soul sustenance telugu

నిద్రపోయే ముందు పనులకు సంబంధించిన కమ్యూనికేషన్ మరియు టెక్నాలజీ నుండి దూరమవ్వండి 

రాత్రి వరకు పనులకు సంబంధించిన కమ్యూనికేషన్ లో చిక్కుకోవడం వల్ల మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనస్సు పనుల గురించి ఆలోచిస్తూ, మన నిద్రకు భంగం కలిగిస్తుంది. మన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అదుపు తప్పడం

Read More »