Hin

4th mar 2024 soul sustenance telugu

March 4, 2024

సత్సంబంధాలను కలిగి ఉండటానికి సమస్యలను పరిష్కరించండి

సత్సంబంధాలు అంటే ఎప్పుడూ ఒకరితో ఒకరు కోపం, కలతలు  చెందకుండా లేదా చిరాకు పడకుండా ఉండటం  కాదు. సత్సంబంధం అంటే కలత చెందిన దానిని మీరు త్వరగా  పరిష్కరించుకొని తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం. 

వాదన, మోసం తర్వాత మనం బాధపడి నిరాశకు గురవుతాము. ఎంతో సమయం కోపం, బాధతో  ఉండటాన్ని ఎంచుకుంటాము. బాధను సమర్ధించుకొని ఇతరుల పొరపాటుగా  భావించి  వారు సరిదిద్దుకోవాలని అనుకంటాము. కొన్నిసార్లు వారితో గతంలోలా ఉండలేమని కూడా భావిస్తాము. జరిగిన దానితో సంబంధం లేకుండా సాధారణ స్థితికి రావడానికి కేవలం 1 ఆలోచన మాత్రమే కావాలి. కానీ మనస్సు ప్రశ్నిస్తుంది, దానికి సమాధానాలు ఇవ్వండి.

 

(1) అది వారి తప్పు అయినపుడు, నేను దీన్ని ఎందుకు చేయాలి? ఎందుకంటే నా అహం కంటే నా సంబంధం ముఖ్యం కనుక. (2) ఇంత త్వరగా సమాధాన పరచడం ఎందుకు, కనీసం వారిని తమ తప్పును గ్రహించనివ్వాలి కదా? ఎందుకంటే గడిచిన ప్రతి క్షణం ఇరువురికి బాధను కలిగించి మా సంబంధాన్ని బలహీనపరుస్తుంది. (3) నేను ముందు అడుగు వేస్తే  నేను బలహీనంగా పరిగణించబడతానా? క్షమించడం, మరచిపోవడం మరియు ముందుకు సాగడం శక్తి, కనుక ఇరువురికీ నేను ఆ శక్తిని ఇస్తాను. (4) నేను తిరిగి సాధారణ స్థితికి వస్తే , వాళ్ళు కూడా అలాగే మారుతారా? వారు మారడానికి సమయాన్ని తీసుకోవచ్చు, కానీ నేను సాధారణ స్థితికి వస్తే, మారే ప్రక్రియ ప్రారంభమైంది కనుక అతి త్వరలో వారు సాధారణ స్థితికి వస్తారు.  (5) నేను ఉపేక్షించబడతానా? నేను చూపించే ప్రేమను, శ్రద్ధను ఇతరులు తక్కువ చేసి చూస్తే, అది నా అదృష్టం. నేను వారిని ఎప్పుడూ ప్రేమిస్తున్నానని వారు నమ్మడానికి నేను వారికి ఒక కారణం ఇచ్చాను.

చాలా ప్రశ్నలు ఉండవచ్చు, కానీ మన సంబంధమే మన ప్రాధాన్యత అని, తప్పొప్పులు కన్నా అందరి సంతోషం మనకు ముఖ్యం అని నిర్ణయించుకుంటే ప్రతి ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉంటుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 2)

పరీక్షల సమయంలో  లేదా జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కొంటున్నప్పుడు స్థిరంగా ఉండటానికి చాలా ముఖ్యమైన మార్గం అంతర్గత శాంతి, శక్తి , స్థిరత్వంతో నిండిన కొన్ని సానుకూల ఆలోచనలను చేస్తూ రోజులో కొన్ని సార్లు

Read More »
21st jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 1)

మనమందరం మన ముందు ఎల్లప్పుడూ వివిధ రకాల సవాళ్లతో మన జీవితాలను గడుపుతాము. మనమందరం ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సవాళ్లలో లేదా మన పిల్లలు ఎదుర్కొనే అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటి పాఠశాల

Read More »
20th jan 2025 soul sustenance telugu

మీ సంకల్పశక్తి మీకు అతిపెద్ద బలం

మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలనుకున్నా, వ్యసనాన్ని వదులుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించాలనుకున్నా, విజయం లేదా వైఫల్యాన్ని మన సంకల్ప శక్తికి ఆపాదించుకుంటాము. కొన్నిసార్లు మనం అత్యధిక సంకల్ప

Read More »