Hin

27th august 2024 soul sustenance telugu

August 27, 2024

సవాళ్లతో కూడిన పరిస్థితులకు కృతజ్ఞతలు

మనం సాధారణంగా జీవితంలో అన్ని మంచి విషయాలకు మన కృతజ్ఞతను వ్యక్తం చేస్తాము. కానీ సవాళ్లతో కూడిన పరిస్థితులకు మనం చాలా అరుదుగా కృతజ్ఞతను ప్రదర్శిస్తాము. కష్టతరమైన పోరాటానికి, లోతైన దుఃఖానికి కృతజ్ఞతతో ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ కష్టమైన అనుభవాలు ప్రయోజనకరంగా ఉంటాయి – అవి మంచి ఫలితాన్నయినా ఇస్తాయి, లేదా అవి మనల్ని ఆంతరికంగా బలోపేతం చేస్తాయి. మీరు ఎదుర్కోవటానికి నిజంగా కష్టపడిన పరిస్థితిని గుర్తుకు తెచ్చుకోగలరా? ఆ సవాలు దశలో ఉన్నప్పుడు, మీరు కోపంగా, విమర్శనాత్మకంగా, ఆందోళనగా, చేదుగా ఉన్నారా, లేదా బాధపడ్డారా? మీరు సమస్యను విజయవంతంగా దాటిన తర్వాత, మీ ఉత్తమమైనదాన్ని బయటకు తెచ్చినందుకు ఆ గందరగోళ పరిస్థితికి మీరు కృతజ్ఞతతో ఉన్నారా? సవాళ్లను అంగీకరించే బదులు, బాధపడటం, కలత చెందడం, మన విధిని నిందించడం లేదా మరొకరిని నిందించడం సాధారణమని మనం భావిస్తాము. ఈ ప్రతిచర్యలు మన శక్తిని మరింత తగ్గించి, పరిస్థితిని ఎదుర్కోవటానికి ఉన్న మన బలాన్ని లాక్కుంటాయి. మన బలహీనత సమస్యను వాస్తవంలో ఉన్నదానికంటే పెద్దదిగా కనిపించేలా చేస్తుంది. మన నిజమైన సామర్థ్యాన్ని చూపించినందుకు సవాళ్లకు కృతజ్ఞతతో ఉందాం. మన కంఫర్ట్ జోన్ నుండి బయటకు నెట్టివేయబడినప్పుడు మనకు తెలియని కొన్ని గుణాలు బయటపడతాయి. మన ఎదుర్కునే శక్తి, సహించే శక్తి, సర్దుబాటు చేసే శక్తి సక్రియం చేయబడతాయి. కృతజ్ఞత మనల్ని ఆంతరికంగా బలోపేతం చేస్తుంది, మన సామర్థ్యాన్ని పెంచుతుంది, ప్రతికూల శక్తుల నుండి మనల్ని రక్షిస్తుంది మరియు మన ఉన్నతమైన శక్తిని సన్నివేశానికి ప్రసరింపజేస్తుంది. కృతజ్ఞతతో సవాళ్లను అంగీకరించండి, గౌరవించండి. మీ శక్తి వాటిని ప్రభావితం చేస్తూ, స్థిరంగా అధిగమించడానికి మీకు సహాయపడుతుంది.

మీ ఆంతరిక సామర్థ్యాన్ని చూపించినందుకు జీవితంలో ప్రతికూల పరిస్థితులకు కృతజ్ఞతతో ఉండాలని మీ మనస్సుకు నేర్పించడం ప్రారంభించండి. సంతృప్తిని అనుభవం చేసుకుంటూ మీరు ఎవరో, మీ వద్ద ఉన్నదానికి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పండి. మీ జీవితంలోని ప్రతి పరిస్థితికి ధన్యవాదాలు తెలుపుకోండి. ప్రతి సన్నివేశం అది ఎలా ఉండాలో అలా పరిపూర్ణంగా ఉందని గుర్తుంచుకోండి. అది మీకు ఏది తెచ్చి పెట్టినా దానికి ధన్యవాదాలు. ప్రతి పరిస్థితిని మీరు ఎంచుకున్నట్లుగా అంగీకరించండి. ఇది కర్మ ఫలితం, మీ గత కర్మ ఫలితం అని అర్థం చేసుకోండి. ఒక విషాదం, ఒక విపత్తు, ఒక సంక్షోభం ఎదురైనప్పుడు కూడా, ఆ దృశ్యాన్ని ప్రశ్నించకండి. ఇది ఖచ్చితమైనది మరియు ప్రయోజనకరమైనది అని అర్థం చేసుకోండి. పరిస్థితులు అసంపూర్ణంగా ఉండవచ్చు, కానీ మీ మానసిక స్థితి పరిపూర్ణంగా ఉండాలి. ఒత్తిడి, బాధ లేదా భయాన్ని సృష్టించవద్దు. మీ కృతజ్ఞత పరిస్థితిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది, మీ అంగీకారం మీ మనస్సును నిశ్శబ్దం చేస్తుంది. సరైన ఆలోచనలను ఎంచుకోండి, మీ అంతర్ దృష్టిని సక్రియం చేసి మీ అంతరాత్మను వినండి. ఇప్పుడు సరైన కర్మ చేసి స్థిరత్వం, గౌరవంతో పరిస్థితిని దాటండి. మీ గత కర్మలను తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతతో ఉండండి. మీ ఆంతరిక శక్తిని పెంచుకోవడానికి, పరిస్థితి నుండి మరింత బలంగా బయటకు వచ్చి పాఠాలను ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతతో ఉండండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »