Hin

3rd sep 2024 soul sustenance telugu

September 3, 2024

శక్తివంతమైన విశ్వాస భావంతో అడ్డంకులను అధిగమించడం (పార్ట్ 1)

దాదాపు ప్రతి రోజు, మన ప్రస్తుత జీవితంలో మనస్సు, భౌతిక శరీరం, సంబంధాలు, సంపద మరియు వ్యక్తిగత లేదా వృత్తిపరమైన పాత్రలో వివిధ ఒడిదుడుకులను చూస్తాము. నేడు ప్రపంచంతటిలో, పైన పేర్కొన్న వాటిలో స్థిరమైన సానుకూల స్థితిలో ఉండే ఒక్క మానవ ఆత్మ కూడా లేదు. అన్ని అంశాలు చాలా మారుతూ ఉంటాయి. ప్రతిసారి వాటితో పాటు ప్రతికూలత లేదా ప్రతికూల పరిస్థితులను తీసుకువస్తున్నట్లు అనిపిస్తుంది. దీనికి చాలా సహజమైన కారణం ఏమిటంటే, ఈ రోజు మనం శాశ్వతమైన ప్రపంచ నాటకం యొక్క చివరిలో ఉన్నాము. ఇనుప యుగం లేదా కలియుగం అంతిమంలో, ప్రతి మానవ ఆత్మ జనన మరణ ప్రయాణంలో చివరి దశలో ఉంటుంది. అది ఆత్మ అనేక తప్పులు చేసిన ప్రయాణం, ముఖ్యంగా ప్రయాణం యొక్క చివరి భాగంలో, భౌతిక శరీరం యొక్క స్పృహలో అనేక చర్యలను ప్రదర్శించినందున అది ఆధ్యాత్మిక శక్తిని కోల్పోవడం కొనసాగించింది.

కాబట్టి, జీవితంలోని పైన పేర్కొన్న అన్ని అంశాలలో ఎప్పటికప్పుడు వచ్చే సమస్యలు ప్రతి ఆత్మ చేసిన తప్పుడు చర్యల ప్రతిబింబం లేదా కర్మ ఫలితం తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా ఈ ప్రపంచ నాటకం యొక్క చివరి భాగంలో ఇలా ఉంటుంది. ఇప్పుడు, అన్నీ పూర్తిగా మంచిగా, సదా సానుకూలతతో ఉండటం అనేది సాధ్యం కాదు. కలియుగం అంతిమంలో, ఆత్మలందరూ పూర్తిగా శుద్ధంగా అయ్యి తిరిగి పరమ శాంతిగా ఉండే ఇంటికి అనగా పరంధామానికి వెళ్లనంతవరకు ఇది సాధ్యం కాదు. మనం తిరిగి ఇంటికి వెళ్లే వరకు, ఈ శుద్దీకరణ జరగాలంటే, మన గత ప్రతికూల కర్మలు లేదా తప్పుడు చర్యల ఖాతాలన్నింటినీ ఆధ్యాత్మిక సాధికారత ద్వారా అలాగే జీవితంలోని ఈ ఐదు అంశాలలో సమస్యలను ఎదుర్కొంటూ తీర్చుకోవాలి. సమస్యలన్నీ ఒకే సారి ఎదుర్కోవాల్సి వస్తుందని కాదు, కానీ ఎప్పటికప్పుడు ఒకటి లేదా ఎక్కువ అంశాల్లో తేలికగా సానుకూలత మరియు శక్తితో ఎదుర్కున్నప్పుడు ప్రతికూల కర్మల ఖాతాలు తీరిపోతాయి. ఈ వాస్తవికత నుండి పారిపోయే బదులు మనం దానిని పూర్తిగా అంగీకరించాలి. ఈ అంశాలను కొంత వరకు మాత్రమే మనం సానుకూలంగా చూడగలము. ఎందుకంటే మన ఈ అంశాలలో లోతైన ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రతికూలతను పూర్తిగా మార్చడం మనకు సాధ్యం కాని సందర్భాలు ఉంటాయి. కావున, వాటిని సానుకూలంగా మార్చడానికి చూసే బదులు వాటిని అంగీకరించాలి. ఈ అంశాల యొక్క అన్ని సమస్యలను పరిష్కరించడానికి మనం చూడాలి. కానీ ప్రతిసారీ ఈ అంశాలు మనకు కావలసినంత మెరుగ్గా, మనం కోరుకునే వేగంతో మారడం సాధ్యం కాదు. ఎందుకంటే, ఎన్నో గత ప్రతికూల చర్య ఖాతాలను తక్కువ వ్యవధిలో తీర్చుకోవాల్సి ఉంటుంది.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

18th july 2025 soul sustenance telugu

స్వీయ సందేహం మరియు అభద్రతలను అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆనందాన్ని క్షీణింపజేసి, మనకు నిరాశ కలిగించే ఒక భావోద్వేగం – అభద్రత. మన గురించి, మన సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థికం

Read More »
17th july 2025 soul sustenance telugu

ఇదే సరైన సమయం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మీరనుకున్న మార్పును తీసుకురావడానికి లేదా అసంపూర్ణంగా ఉన్న పనిని పూర్తి చేయడానికి ఏది సరైన సమయం? నేను నూతన సంవత్సరంలో ప్రారంభిస్తాను…

Read More »
16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »