Hin

5th sep 2024 soul sustenance telugu

September 5, 2024

శక్తివంతమైన విశ్వాస భావంతో అడ్డంకులను అధిగమించడం (పార్ట్ 3)

జన్మ, పునర్జన్మలు తీసుకునే ప్రపంచ నాటకం యొక్క చివరి భాగంలో, ప్రతికూల కర్మల ఖాతాలు పెరగడంతో, గత రెండు రోజుల సందేశాలలో వివరించినట్లుగా, జీవితంలోని వివిధ అంశాలలో మనం చాలా ఒడిదుడుకులను అనుభవించాము. ఈ రోజు మనకు గుర్తులేని ఈ చేదు అనుభవాలన్నీ మనల్ని బలహీనపరిచాయి. మన ఉపచేతన మనస్సుపై లోతైన మచ్చలను మిగిల్చాయి. వాస్తవానికి ఆత్మలోని భయం, దృఢత్వం లేకపోవడం, నిరాశావాదం మరియు ఆందోళన మొదలైన సంస్కారాల సృష్టికి ఈ చేదు అనుభవాలే ప్రధాన కారణం. మళ్లీ మళ్లీ అవే అనుభవాలు చేసుకుంటూ ఉంటే ఇలాంటి సంస్కారాలు తయారవటానికి కారణమవుతాయి. మనం పదేపదే శాంతిని అనుభవం చేసుకుంటూ ఉంటే – మనం శాంతి గురించి ఆలోచిస్తూ, శాంతిని విజువలైజ్ చేసుకుంటూ, శాంతియుత సంభాషణలు పదేపదే చేస్తూ, ఆత్మలో శాంతి సంస్కారాలు సృష్టించబడతాయి. అదే విధంగా గత జన్మలలో మన జీవితంలో ఏదైనా తప్పు జరిగిన ప్రతిసారీ, ఆధ్యాత్మిక అవగాహన మరియు ఆంతరిక బలం లేకపోవడం వల్ల, మనం దుఃఖం, అశాంతి, మానసిక అలసట మొదలైన వాటిని అనుభవించాము. అది ఆత్మలో ఇలాంటి సంస్కారాల సృష్టికి కారణమైంది. ఈ రోజు మనం జీవితంలోని ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ పరిస్థితిలో మనం విజయం సాధించగలమని చెప్పేందుకు మనపై మనకు నమ్మకం లేకపోవడానికి ఇది ప్రధాన కారణం.

మనం గత జన్మలలో వివిధ సమయాల్లో మరియు చాలాసార్లు వైఫల్యాన్ని అనుభవించాము. అందుకే ఏదైనా తప్పు జరిగిన ప్రతిసారీ, మనం విజయం యొక్క ఆలోచనలు చేసినప్పటికీ, చాలా సార్లు మనం ఈ సానుకూల ఆలోచనలను ఎన్నో బలహీనమైన ఆలోచనలతో, వైఫల్యం యొక్క ఆలోచనలతో పలుచన చేస్తాము. సమస్యలు వచ్చినప్పుడు ఈ రకమైన బలహీన మనసు మన సమస్యల వ్యవధిని పొడిగించడమే కాకుండా, పరిష్కారాన్ని మన నుండి చాలా కాలం దూరంగా ఉంచుతుంది. ఈ రోజు, ఆధ్యాత్మికత సహాయంతో, మన ఆలోచనలు, మాటలు మరియు చర్యలలో విశ్వాసం యొక్క శక్తిని ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని కోసం, మనం మన ఆలోచనా శక్తిని ఘనంగా పెంచుకోవాలి. అప్పుడు అది మన మాటలపై మరియు చర్యలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం లేదా చదవడంతో శక్తివంతమైన ఆలోచనల ఆహారం మరియు ధ్యానంతో ఆత్మకు ఇవ్వబడిన భావోద్వేగ శక్తి యొక్క అనుభవం మాత్రమే కొంత కాలం పాటు ఆత్మలోని భావోద్వేగ మచ్చలను నయం చేయగలవు. ఇలా మనం దృఢత్వం, సంకల్ప బలంతో నిండి ఉండవచ్చు. ఆ బలం ప్రతికూల పరిస్థితులను బలహీనపరుస్తూ వాటిని సానుకూలంగా చేస్తుంది. అప్పుడు పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తూ ప్రతికూలంగా చేయవు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »