HI

10th may 2024 soul sustenance telugu

May 10, 2024

శాంతి మరియు ప్రేమ యొక్క అనుభూతి – మన అసలు స్వభావం (పార్ట్ 1)

మనందరి జీవితం అనేక పరిస్థితులతో నిండి ఉంటుంది. కొన్నిసార్లు అవి మనలో అహం మరియు కోపాన్ని  కలిగిస్తాయి. కోపం మరియు అహం రెండూ సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనమందరం వాటిని మన జీవితం నుండి దూరంగా ఉంచడానికి, ప్రశాంతంగా ఉండటానికి నిశబ్ద ప్రయత్నం చేయాలి. చాలా సార్లు మన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో లేదా కొన్ని ఇతర అప్రధానమైన పరస్పర చర్యలలో కూడా, ఈ రెండింటిపై మనం పరీక్షించబడతాము. మరో మాటలో చెప్పాలంటే, అటువంటి పరిస్థితులలో కోపం రావటం చాలా సులభం. మన అంతర్గత శక్తులైన శాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని మనం ఉపయోగించుకునేలా జాగ్రత్త వహించడం; ఇతరులకు అదే అనుభవాన్ని అందించడం మనపై ఆధారపడి ఉంటుంది.

కోపం మన ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రపంచంలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. రక్తపోటు, గుండెపోటు, నిద్రలేమి మరియు వెన్నునొప్పి వంటి అనారోగ్యాలు; జీర్ణ రుగ్మతలు వంటి ఇతర సమస్యలు కోపంతో రగిలి పోవడం వల్ల కలుగుతాయి. వ్యక్తులు తమ కుటుంబాల్లో లేదా మరెక్కడైనా కోపంతో సర్వ సాధారణంగా ప్రవర్తిస్తుంటారు. అలాగే, కొద్దిగా కోపం మంచిదని, అది అడ్రినలిన్ అనే హార్మోన్ ని పెంచుతుందని ప్రపంచంలోని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అహం మిమ్మల్ని శక్తివంతం చేసి మీరు విజయవంతం కావడానికి సహాయపడుతుందని నమ్మే కొందరు వ్యక్తులు ఉన్నట్లు కూడా చూస్తుంటాము. కోపం సామర్థ్యాన్ని పెంచుతుందని, ఎందుకంటే ఇది చాలాసార్లు పనిని పూర్తయ్యేలా చేస్తుందని కొందరు భావిస్తారు. కానీ ఇవన్నీ తప్పుడు నమ్మకాలు మరియు నిజానికి నిజం ఏమిటంటే అహం బలహీనత;  గౌరవం పొందడానికి బదులుగా, మీరు దానితో గౌరవాన్ని కోల్పోతారు. కోపం ఇతరుల నుండి ప్రేమ మరియు సహకారాన్ని పొందడం కన్నా కోల్పోయేలా చేస్తుంది.

 

(సశేషం …)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd may 2024 soul sustenance telugu

భిన్నంగా ఉన్న వారి పట్ల దయకలిగి ఉండటం

మీరు ప్రపంచాన్ని ఇతరులకు భిన్నంగా ఎలా చూస్తున్నారో గుర్తించడం ద్వారా మాత్రమే మీకు భిన్నంగా ఉన్న వారి పట్ల దయ కలిగి ఉండాలనే అవగాహనను పెంపొందించుకోవచ్చు. భిన్నంగా ఉన్న వారు అంటే మీరు కలిసే

Read More »
21st may 2024 soul sustenance telugu

మిమ్మల్ని మీరు మార్చుకోవాలని లోతుగా అనుకుంటున్నారా?

చాలా సార్లు, మనం మన స్వపరివర్తన లక్ష్యాలపై ముందుకు వెనుకకు ఊగిసలాడుతూ ఉంటాము . ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం పైపై మార్పులు చేస్తూ ఉత్సాహంగా మొదలుపెడతాము. చాలా వరకు మన దృష్టి ఏమి

Read More »
20th may 2024 soul sustenance telugu

బహిరంగ ప్రసంగ(పబ్లిక్ స్పీకింగ్)భయాన్ని అధిగమించడం

మనలో చాలా మందికి బహిరంగంగా మాట్లాడాలని ఆలోచించటానికే  భయపడతాము, సిగ్గుపడతాము, చెమటలు పడుతూ ఉంటాయి . ప్రపంచంలోని అత్యంత భయంతో కూడిన పనులలో ఒకటిగా, బహిరంగంగా మాట్లాడటం అనేది ఉందని మీకు తెలుసా? మనలో

Read More »