Hin

11th may 2024 soul sustenance telugu

May 11, 2024

శాంతి మరియు ప్రేమ యొక్క అనుభూతి – మన అసలు స్వభావం (పార్ట్ 2)

మనలో అనేకులకు, మన పనిలో లేదా మన కుటుంబాల్లో వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించాల్సి ఉంటుంది. మన వ్యక్తిత్వాలు, స్వభావాలు, అభిప్రాయాలు భిన్నంగా ఉన్న కారణంగా కోపం తెచ్చుకోకుండా అందరితో మమేకమవడంలోనే సవాలు గా మారుతుంది. కొన్నిసార్లు, ఇద్దరు వ్యక్తులు తమ తమ దృష్టికోణంలో  సరైనప్పటికీ వారి అభిప్రాయాలు నిర్దిష్ట పరిస్థితిలో సరిపోలవు. ఇది కోపంతో కూడిన పరస్పర చర్యలకు దారితీస్తుంది. అలాగే, ఇద్దరు వ్యక్తులు తమ తమ దృష్టికోణంలో సరైనప్పటికి భిన్నమైన అవగాహనల వలన, అహం, ఆ సంబంధంలో శాంతి మరియు సామరస్యాన్ని ఉండనివ్వదు. కాబట్టి, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలోని ఏ రంగంలోనైనా మంచి సంబంధాలకు కోపం మరియు అహం పెద్ద శత్రువులు.

 

అలాగే, కోపం మరియు అహంకారాన్ని అధిగమించే విషయానికి వస్తే, మొదటి అడుగు మనం అంతర్ముఖులుగా ఉంటూ మనలో ఉన్న శాంతి మరియు ప్రేమ యొక్క సంపదలను వెలికి తీయడం. తమ ఆధ్యాత్మిక గుర్తింపు అయిన ఆత్మిక స్వరూపం ద్వారా వాటిని ఆచరణలోకి తీసుకురావాలి. ఆత్మిక చింతన శాంతి మరియు ప్రేమను మన స్వభావంలో భాగం చేస్తుంది. ఆధ్యాత్మిక స్వయాన్ని భగవంతునితో అనుసంధానించడం ద్వారా కూడా ఈ అంతర్గత సంపదలు పెరుగుతాయి. పరమాత్మ  శాంతి మరియు ప్రేమ యొక్క సాగరుడు. ఆత్మ-పరమాత్మల అనుసంధానాన్ని ధ్యానం అని అంటారు. అలాగే రోజంతా అందరిలో కోపం, అహంకారం ఎక్కువగా కనిపించినా వారిని శాంతి, ప్రేమ అనే గుణాలు ఉన్న ఆత్మగా చూడటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే కోపం, అహంకారం బాహ్య సంస్కారాలు మరియు శాంతి, ప్రేమ అందరి నిజ సంస్కారాలు. కాబట్టి, ప్రతి ఒక్కరి అసలు సంస్కారాలను చూడటం, వారికి ఆ సానుకూల భావోద్వేగాల శక్తిని పంపుతుంది. తత్ఫలితంగా, వారు ఆ సంస్కారాలను పైకి తీసుకురావడానికి ప్రేరేపించబడి వాటిని  ఉపయోగిస్తారు మరియు ప్రతికూల సంస్కారాలు అయిన కోపం, అహంకారాలను ఉపయోగించకుండా ఉంటారు.

 

(సశేషం …)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th dec 2024 soul sustenance telugu

నిర్భయంగా ఉండటానికి 5 మార్గాలు

స్వీయ గౌరవం యొక్క శక్తివంతమైన స్మృతిలో ఉండండి – మన భయాలన్నింటినీ అధిగమించగల మొదటి, అతి ముఖ్యమైన మార్గం మన స్వంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను లోతుగా గ్రహించడం. ఇంకా, జ్ఞానం, సుగుణాలు, నైపుణ్యాలు మరియు

Read More »
7th dec 2024 soul sustenance telugu

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల

Read More »
6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »