Hin

12th may 2024 soul sustenance telugu

May 12, 2024

శాంతి మరియు ప్రేమ యొక్క అనుభూతి – మన అసలు స్వభావం (పార్ట్ 3)

మనలో చాలా మంది కొన్నిసార్లు కోపాన్ని ఆయుధంగా ఉపయోగిస్తాము. దానినే  వ్యక్తులను నియంత్రించడం అని అంటాము. వ్యక్తులను నియంత్రించడం సాధ్యం కాదని దానికంటే వారిని ప్రభావితం చేయడం సులభమని మనం మరచిపోతాము. శాంతి, ప్రేమ మరియు శుభభావనలతో వ్యక్తులను ప్రభావితం చేయడం ఎల్లప్పుడూ సులభమే. అలాగే, వ్యక్తులను సానుకూలతతో చూడటం, వారు మంచివారని భావించడం వలన వారి నుంచి మనం ఆశించింది వారు చేసేలా సహాయపడుతుంది. అలాగే, వినయం మరియు దయగల హృదయంతో ఉండటం వలన ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు; మీరు కోరుకున్నది చేస్తారు లేదా మీరు కోరుకునే ఏదైనా మార్పును మరింతగా తీసుకురాగలరు.

మనం స్వతహాగా శాంతియుతమైన మరియు ప్రేమగల ఆత్మలమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మనం జనన -మరణ చక్రంలోకి వచ్చినప్పుడు మనం ఈ గుణాలను కోల్పోయి రకరకాల కోరికలతో నిండిపోతాము. వేరొకరి నుండి ఒక నిర్దిష్ట ప్రవర్తనను ఆశించడం లేదా కోరుకోవడం అన్ని రకాల కోపానికి మూల కారణం. అలాగే, మన ఇష్టానుసారం ఒక నిర్దిష్ట పరిస్థితిని కోరుకోవడం కోపానికి మరొక కారణం. ఈ రెండు కోరికలు, నెరవేరనప్పుడు, కొన్ని సందర్భాల్లో మనల్ని చిరాకు లేదా కలత లేదా కొన్ని సార్లు హింసాత్మకంగా కూడా చేస్తాయి. మరోవైపు, విభిన్న గుణాలు మరియు శక్తులు కలిగి, అంతర్గతంగా నిండుగా ఉన్నవారికి పరిస్థితులను మరియు వ్యక్తులను సులభంగా అంగీకరించడం సాధ్యమవుతుంది. ఈ గుణాలు మరియు శక్తులు మన జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞాన మార్గాన్ని అనుసరించడంతో వస్తాయి. మనం ఆధ్యాత్మికంగా ఎంత బలంగా ఉంటామో, మన జీవితంలో మనకు నచ్చని మార్పులకు అతీతంగా ఉండగలుగుతాము. అలాగే, కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మనం ఇష్టపడేదానికి లేదా సరైనదిదానికి భిన్నంగా ప్రవర్తించినప్పుడు మనం స్థిరంగా ఉంటాము. అలాగే బాహ్య స్థాయిలో విజయం పొందినపుడు కొన్నిసార్లు అహంభావాన్ని కలిగిస్తుంది. మరోవైపు, విభిన్న సుగుణాల యొక్క అంతర్గత విజయం మన వ్యవహారాలలో మనల్ని వినయంగా మరియు చాలా సరళంగా చేస్తుంది, ఈ ప్రవర్తన ఇతరులను  సులభంగా సంతృప్తిపరుస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

9th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 2)

సానుకూల శక్తిని ఎప్పటికీ కోల్పోవద్దు వ్యక్తులు మన జీవితాల్లోకి వేర్వేరు, కొన్నిసార్లు వ్యతిరేక సంస్కారాలతో కూడా వస్తారు. తరచుగా, మన ప్రియమైనవారిలో అలాంటి వ్యక్తులు కనిపిస్తారు – భర్త లేదా భార్య, తల్లిదండ్రులు, పిల్లలు

Read More »
8th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 1) 

ఎమోషనల్ ఓదార్పు మరియు శక్తిని ఇవ్వడం   మన జీవితమంతా మనకు తెలిసిన వ్యక్తులకు మరియు మనకు తెలియని వ్యక్తులకు కూడా సేవ చేస్తాము. ఎందుకంటే ఇవ్వడం, సేవ చేయడం మన సహజ లక్షణాలు.

Read More »
7th feb 2025 soul sustenance telugu

అంతర్గత శాంతి మరియు ఆనందం కోసం ఇంట్లో ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం

ధ్యానం కోసం ఇంట్లో ప్రత్యేకమైన, ఉన్నతమైన తరంగాల గది లేదా చోటును ఏర్పర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మనము అంతర్గత శాంతి, ఆనందం కోసం ఉన్నత ఆధ్యాత్మిక శక్తి గల ప్రదేశాలకు వెళ్తాము. మనం మానసికంగా

Read More »