Hin

20th feb 2025 soul sustenance telugu

February 20, 2025

శాంతి సద్గుణాన్ని తెలుసుకొని అనుభవం చేసుకోవడం (పార్ట్ 1)

ప్రతి మానవ ఆత్మ యొక్క అసలైన సంస్కారం శాంతి. ప్రతి ఆత్మ తన మొదటి భౌతిక శరీరాన్ని తీసుకోవడానికి భూమిపైకి దిగే ముందు, ఆత్మ శాంతిధామంలో ఉండి, పూర్తి శాంతి స్థితిలో ఉంటుంది. శాంతిధామంలో, ఆత్మ యొక్క రెండు శక్తులు-మనస్సు మరియు బుద్ధి పూర్తిగా క్రియారహితంగా ఉంటాయి, మూడవ శక్తి అయిన సంస్కారం లేదా ఆధ్యాత్మిక వ్యక్తిత్వం అనేది ఆనందం, ప్రేమ లేదా జ్ఞానం యొక్క అనుభవం లేకుండా శాశ్వతమైన శాంతి మరియు స్వచ్ఛతతో నిండి ఉంటుంది. మనస్సు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది, ఆలోచించడానికి తన శక్తిని ఉపయోగించదు మరియు ఒక్క ఆలోచనను కూడా సృష్టించదు. సరైన ఆలోచనలు, మాటలు మరియు చర్యలను తప్పుడు ఆలోచనలతో పరిశీలించగలిగే శక్తి ఉన్న బుద్ధి తన శక్తిని ఉపయోగించదు ఎందుకంటే శాంతిధామంలో ఆలోచనలు, మాటలు లేదా చర్యలు ఉండవు, కాబట్టి పరిశీలించెందుకు ఏమీ ఉండదు. బుద్ధి విజువలైజ్ చేసే శక్తిని కూడా కలిగి ఉంటుంది, కానీ శాంతిధామంలో అది ఉపయోగించబడదు. అలాగే, సంస్కారాలు లేదా వ్యక్తిత్వంపై ఆధారితమైన ఆలోచనలు, భావాలు, మాటలు లేదా చర్యలు సృష్టించబడవు. ఆత్మ తన సంపూర్ణమైన, స్వచ్ఛమైన మరియు శాంతియుతమైన ఆశరీరి స్థితిలో ఉంటుంది.

 

పునరావృతమయ్యే ప్రపంచ నాటక చక్రం యొక్క మొదటి యుగం అయిన స్వర్ణయుగం లేదా స్వర్గంలో ఆత్మ మొదట ప్రపంచ వేదికపై భౌతిక శరీరాన్ని తీసుకున్నప్పుడు, అది తక్కువ ఆలోచనలను సృష్టిస్తుంది, అవి సహజంగానే సానుకూలంగా, అవసరమైనవిగా ఉంటాయి. ఆత్మ యొక్క పరిశీలన శక్తి చురుకుగా మరియు పూర్తిగా ఖచ్చితమైనదిగా ఉంటుంది. ఆత్మ సరైన ఆలోచనలు, మాటలు మరియు చర్యలను మాత్రమే సృష్టిస్తుంది. తన విజువలైజేషన్ కూడా ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది. అలాగే, తన ఆలోచనలు, మాటలు మరియు చర్యలన్నీ దైవిక మరియు స్వచ్ఛమైన గుణాలు కలిగిన సంస్కారాలపై ఆధారపడి ఉంటాయి. దీని ఫలితంగా, ఆత్మ అపారమైన శాంతిని అనుభూతి చేసుకుంటుంది, కానీ శాంతి యొక్క పరిధి శాంతిధామంలో పూర్తిగా నిశ్చలమైన మరియు లోతైన నిశ్శబ్దం లేదా శాంతిని అనుభూతి చేసుకునే శాంతి కంటే తక్కువగా ఉంటుంది. భౌతిక ప్రపంచంలో దాని ప్రయాణం యొక్క ఈ ప్రారంభ దశలో ఆత్మ ఎప్పుడూ అశాంతిగా ఉండదు. ఆత్మ జనన-మరణ చక్రం లోకి రావడం ప్రారంభించి, స్వర్ణయుగం మరియు వెండి యుగం తరువాత రాగి యుగం లేదా నరకంలోకి ప్రవేశించినప్పుడు, అది దైహిక స్మృతి కారణంగా తన ఆధ్యాత్మిక శక్తిని కోల్పోవడం ప్రారంభిస్తుంది. అలాగే తన మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలు కొన్నిసార్లు ప్రతికూలంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఆత్మ దుర్గుణాలు లేదా వివిధ ప్రతికూల అలవాట్ల ప్రభావంలోకి రావడం ప్రారంభిస్తుంది. అప్పుడు, ఎక్కువ అనవసరమైనవి లేదా ప్రతికూల స్వభావం కలిగి ఉండే ఆలోచనలు, మాటలు మరియు చర్యల సృష్టికి దారితీస్తుంది. తత్ఫలితంగా, ఆత్మ క్రమంగా తన లోతైన మరియు శాశ్వతమైన శాంతిని, శాంతిధామంలో  మరియు భౌతిక ప్రపంచంలో తన ప్రయాణం ప్రారంభంలో చర్యలను చేస్తున్నప్పుడు అనుభూతి చేసుకున్న శాంతిని కోల్పోయి అశాంతిగా మారడం ప్రారంభిస్తుంది.

భౌతిక ప్రపంచం యొక్క మన అసలైన శాంతి స్థితిని ఎలా అనుభవం చేయగలమనే దానిపై రేపు వివరిస్తాము.

(సశేషం…)

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »