Hin

21st feb 2025 soul sustenance telugu

February 21, 2025

శాంతి సద్గుణాన్ని తెలుసుకొని అనుభవం చేసుకోవడం (పార్ట్ 2)

ప్రపంచ నాటకం లేదా జీవిత చక్రంలో మానవ ఆత్మలలో శాంతి గుణం ఎలా ఉంటుందో నిన్న మనం వివరించాము. ఈ సందేశంలో మరియు తరువాతి సందేశంలో, జనన-పునర్జన్మ చక్రం యొక్క ప్రారంభ దశలలో అనుభవం చేసుకున్న మన అసలైన శాంతి స్థితిని మరియు శాంతిధామం యొక్క శాశ్వతమైన శాంతిని ఎలా అనుభవం చేసుకోవాలో వివరిస్తాము. ఈ రెండు అనుభవాలను పొందాలంటే, నేను గుర్తుంచుకోవలసిన ప్రాథమిక సూత్రం ఏమిటంటే, శాంతిని అనుభూతి చేసుకోవడానికి, నేను దానిపై ఏకాగ్రత పెట్టాలి – ఏకాగ్రత అంటే దాని గురించి ఆలోచనలను సృష్టిస్తూ అదే సమయంలో దానిని విజువలైజ్ చేయడం. రెండవది, నేను నా స్మృతి లో నా శరీరం మరియు పరిసరాల నుండి నన్ను నేను వేరు చేసుకోవాలి. మరి, నేను ఈ రెండు సూత్రాలను ఆచరణలోకి ఎలా తీసుకురావాలి?

 

బ్రహ్మా కుమారీలు భోదించే రాజయోగ ధ్యాన కోర్సు యొక్క మొదటి సెషన్లో ఒక సాధారణ వాస్తవాన్ని చెపుతారు. నేను ఈ శరీరం కాదని, భౌతికం కాని ఆధ్యాత్మిక శక్తి వంటి నక్షత్రం అని, మెదడులోని భాగాలైన హైపోథాలమస్ మరియు పిట్యూటరీ గ్రంధికి దగ్గరగా మెదడుకి మధ్యలో ఉండే ఒక శాశ్వతమైన ఆత్మ అని గ్రహించేలా చేస్తుంది. మనం నుదిటి మధ్యలో, కనుబొమ్మల పైన ఆత్మను విజువలైజ్ చేస్తాము. ఆత్మ యొక్క అసలు స్వభావం శాంతి. శరీరం నా వస్త్రం లేదా వాహనం, దీని ద్వారా ఆత్మ తనను తాను వ్యక్తపరుస్తుంది. ఇప్పుడు, జనన-పునర్జన్మ చక్రం యొక్క ప్రారంభ దశలలోని శాంతిని అనుభూతి చేయడానికి, నా మనస్సు పైన పేర్కొన్న వాస్తవాన్ని లేదా జ్ఞానాన్ని నా బుద్ధి నుండి తీసుకుంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క రిజర్వాయర్ అయిన బుద్ధిలోనే పైన పేర్కొన్న వాస్తవం దాగి ఉంటుంది. అప్పుడు, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్న నా బుద్ధి, ఆ ఆలోచనను సరైనదా కాదా అని నిర్ణయిస్తుంది. ఒకసారి నా బుద్ధి దానికి కలిగి ఉన్న జ్ఞానం ఆధారంగా, అది వాస్తవం అని ఒప్పుకుంటే, అది ఆలోచనను సరైనదిగా నిర్ణయిస్తుంది. తరువాత, నేను ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకువెళతాను. ఈ ఆలోచనను సృష్టించడంతో పాటు నేను ఈ ఆలోచనను నా బుద్ధి తెరపై విజువలైజ్ చేస్తాను. అనగా నా కనుబొమ్మల పైన నక్షత్రం లాంటి తెలుపు లేదా బంగారు కాంతి అన్ని దిశలలో శాంతి యొక్క తెలుపు లేదా బంగారు కిరణాలను ప్రసరింపజేస్తున్నట్లు నేను చూస్తాను. ఇలా నేను కొన్ని సార్లు చేస్తాను. ఈ ఏకాగ్రత వ్యాయామం నన్ను శాంతి అనుభూతికి దారితీస్తుంది, దీని ఫలితంగా శాంతి సంస్కారం సృష్టించబడుతుంది. కానీ శరీరం నుండి ఒక వేరైనా అస్తిత్వంగా, శరీరంలో ఆత్మని విజువలైజ్ చేసేటప్పుడు అనుభూతి చేసుకునే శాంతి ఇదే. ఇది భౌతిక ప్రపంచ వేదికపై ఉన్నప్పుడు, జనన-పునర్జన్మ చక్రంలో భాగంగా ఉన్నప్పుడు ప్రారంభ దశలలో అనుభవం చేసుకునే శాంతి.

శాంతిధామం యొక్క శాశ్వతమైన శాంతిని మనం ఎలా అనుభవించవచ్చో రేపు వివరిస్తాము.

(సశేషం…)

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »