Hin

22nd feb 2025 soul sustenance telugu

February 22, 2025

శాంతి సద్గుణాన్ని తెలుసుకొని అనుభవం చేసుకోవడం (పార్ట్ 3)

శాంతిధామం యొక్క శాశ్వతమైన శాంతిని అనుభవం చేసుకోవడానికి, నిన్న వివరించిన సాధారణ వ్యాయామం చేసి, ఆపై నేను ఒక అడుగు ముందుకు వేస్తాను. నేను నుదుటి మధ్యలో, కనుబొమ్మల పైన ఉన్న మెరిసే నక్షత్రం లాంటి శక్తిని అని నా గురించి ఆలోచనను సృష్టించుకుని, దానిని విజువలైజ్ చేసి, ఫలితంగా దానిని అనుభూతి చేశాను. ఇప్పుడు నా లక్ష్యం శాంతిధామంలో నా నక్షత్రం లాంటి రూపాన్ని విజువలైజ్ చేయడం. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నేను ఇప్పుడు నక్షత్రం లాంటి శక్తి శాంతిధామానికి మరియు తిరిగి వచ్చే ఒక చిన్న ప్రయాణం చేస్తానని ఒక సాధారణ ఆలోచనను సృష్టిస్తున్నాను. కాబట్టి, నేను సరళమైన ఆలోచనలను సృష్టించి, ఆత్మ నా భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి పైకి ఎగురుతున్నట్లు విజువలైజ్ చేసుకుంటాను. అప్పుడు నా నక్షత్రం లాంటి రూపం నెమ్మదిగా నేను ఉన్న గది పైకప్పును దాటి ఎగురుతూ ఆకాశంలో వేలాడుతూ నన్ను నేను చూస్తున్నాను. నేను నన్ను అనేక భవనాలు మరియు లైట్స్ పైన ప్రకాశించే కాంతి బిందువుగా చూస్తాను. అప్పుడు నేను నా ఈ కాంతి రూపం ఎక్కువ ఎత్తుకు వెళ్లి, వాతావరణాన్ని దాటి, భూమిని దాటి, అంతరిక్షంలో అనేక నక్షత్రాలు మరియు గ్రహాలను దాటి వెళ్లడం చూస్తాను. నేను ఈ విజువలైజేషన్ను మరింత ముందుకు తీసుకెళ్లి, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో పోలి ఉండే మృదువైన నారింజ-ఎరుపు కాంతి ఉన్న శాంతిధామంలోకి ప్రవేశించడాన్ని చూస్తాను. ఈ ప్రాంతం పరిమాణం లేదా విస్తీర్ణంలో అపరిమితంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో నా తెల్లని బంగారు నక్షత్రం లాంటి రూపం వేలాడుతూ, అన్ని దిశలలో శాంతి యొక్క తెల్లని బంగారు కిరణాలను ప్రసరింపజేయడం నేను చూస్తున్నాను. నేను అదే ప్రాంతంలో నాలాంటి ఇతర తెల్లని బంగారు నక్షత్రాల వంటి ఆత్మలను కూడా చూస్తాను. నా ముందు నేను భగవంతుడిని చూస్తున్నాను, చాలా ప్రకాశించే సుప్రీం వైట్ గోల్డెన్ స్టార్, శాంతి సాగరుడు, అన్ని దిశలలో అతని అపరిమిత శాంతి కిరణాలను ప్రసరింపజేస్తున్నారు, అవి నక్షత్రం వంటి ఆత్మనైనా నాపై పడుతున్నాయి, మరియు నేను వాటిని నా లోపల గ్రహిస్తున్నాను. నేను ఈ ప్రాంతంలో, ఈ అనుభూతిలో కొంత సమయం గడుపుతున్నాను. ఈ ప్రాంతంలో నా ఆలోచనలు ఆగిపోతాయి. నేను కేవలం విజువలైజ్ చేస్తున్నాను.


శాంతిధామంలో ఆధ్యాత్మిక స్వయాన్ని విజువలైజ్ చేసేటప్పుడు అనుభూతి చేసుకునే శాశ్వతమైన శాంతి ఇదే. ఈ వ్యాయామంలో అనుభూతి చేసుకున్న శాంతి నిన్న పేర్కొన్న వ్యాయామం కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఈ వ్యాయామంలో ఆత్మలో సృష్టించబడిన శాంతి సంస్కారం మరింత లోతుగా ఉంటుంది. ఈ అనుభవం యొక్క కొన్ని నిమిషాల తరువాత, నేను శాంతిధామానికి ఎగిరిన విధంగానే నా నక్షత్రం లాంటి రూపం భౌతిక శరీరంలో దిగడం చూస్తున్నాను. ఇది కేవలం ఒక విజువలైజేషన్ వ్యాయామం లేదా అనుభూతి మాత్రమే, ఆత్మ వాస్తవానికి శరీరాన్ని వదిలి ఎక్కడికీ వెళ్ళదు. నిన్నటి మరియు నేటి సందేశంలో వివరించిన రెండు ఆచరణాత్మక అభ్యాసాలను ముందు పేర్కొన్న రెండు రకాల శాంతిని అనుభవం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఒక సమయంలో, మీరు రెండు రకాలైన శాంతిని లేదా మొదటిదాన్ని మాత్రమే అనుభవం చేసుకోవచ్చు. మీరు కొన్ని నిమిషాలతో ప్రారంభించి, క్రమంగా సమయాన్ని పెంచవచ్చు. నిరంతర సాధన శాంతి యొక్క లోతైన సంస్కారాలను సృష్టించి మిమ్మల్ని మీ అసలైన శాంతి స్థితికి దగ్గర చేస్తుంది.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »