Hin

10th Feb 2024 Soul Sustenance Telugu

February 10, 2024

శరీర ఆరోగ్యం కోసం మనసును ఆరోగ్యవంతంగా ఉంచుకుందాం

మీరు జిమ్‌కి వెళ్లి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. ఆరోగ్యానికి మీరు పండ్లు మరియు కూరగాయలను తీసుకుంటారు. మీరు రోజూ 7 నుండి 8 గంటల నిద్రను పొందుతారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, మీరు అనారోగ్యాలు, నొప్పులతో బాధ పడుతూ ఉంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని నడిపించడానికి నేను ఇంకా ఏమి చేయాలి? అనే ప్రశ్న మీ మనస్సులో ఉందా?  మన ఆలోచనలు మరియు భావాలు సూక్ష్మ శరీరాన్ని సృష్టిస్తాయి. ఆహారం మరియు వ్యాయామం శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నట్టు, పరిపూర్ణ భౌతిక శరీరాన్ని నిలబెట్టుకోవడానికి స్వచ్ఛమైన శక్తి శరీరం అవసరం. భయం, నొప్పి, గందరగోళం, కోపం లేదా అసూయ వంటి ఏదైనా భావోద్వేగ అడ్డంకులు శక్తి శరీరంలో శక్తి అడ్డంకులను సృష్టిస్తాయి. ఇది మన భౌతిక శరీరంలో ఒక అనారోగ్యంగా వ్యక్తమవుతుంది. శరీరంలోని ప్రతి కణానికి ఆనందం మరియు ప్రేమను ప్రసరింపజేయడానికి మన ఆలోచనలను శుద్ధి చేద్దాం. ప్రతి అవయవాన్ని బలోపేతం చేయడానికి గత బాధను విడిచి పెట్టండి. నొప్పులను నయం చేయడానికి ఇతరులను క్షమించండి. శరీరాన్ని శుభ్రపరచడానికి ప్రశాంతంగా మరియు స్థిరంగా ఉండండి. ఆరోగ్యకరమైన మనస్సును సృష్టించే శక్తి మనకు ఉంది, అది ఆరోగ్యకరమైన శరీరాన్ని మరియు సంతోషకరమైన జీవితాన్ని సృష్టిస్తుంది. నా ప్రతి ఆలోచన ఆనందం మరియు ఆరోగ్యాన్ని సృష్టిస్తుంది. నా ఆరోగ్యం పర్ఫెక్ట్‌గా ఉంది. నా శరీరం ఆరోగ్యంగా ఉంది అని మీకు మీరు గుర్తు చేసుకోండి.

అలాగే, మీ శరీరానికి ఏదైనా ఇబ్బంది ఉంటే, మీ ఆలోచనల శక్తితో మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చని మీకు తెలుసా? ప్రతి ఆలోచన మన శరీరంలోని కణాలపై ప్రభావం చూపుతుంది. మనం శారీరకంగా అస్వస్థతకు గురైనప్పుడు, మనం మందులతో శరీరాన్ని నయం చేస్తాం, కానీ మనం మనసులోని అడ్డంకులను నయం చేస్తామా?  ఇలా ఆలోచించడం ద్వారా లేదా చెప్పడం ద్వారా – నా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది… నా జ్వరం తగ్గడం లేదు, తరువాత ఏమి జరుగుతుంది… ఈ వెన్నునొప్పితో నేను ఎలా నడవగలను… మన శరీరానికి దుఃఖం, ఆందోళన యొక్క శక్తిని ప్రసరింపజేస్తాము. ఈ వైబ్రేషన్స్ నయం చేయడాన్ని నెమ్మదిస్తాయి లేదా నిరోధిస్తాయి. శరీరానికి చికిత్స చేయడం ఎంత ముఖ్యమో మన ఆలోచనలను మార్చుకోవడం కూడా అంతే ముఖ్యం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

16th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, జీవితానికి మరింత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు మనం మన జీవితాన్ని వివిధ రకాలుగా ఆస్వాదిస్తున్నాము. ఐదు

Read More »
15th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మన విధి అందంగా ఉంటుంది  నేడు, మనం ప్రతిరోజూ ఒక సాధారణ లక్ష్యంతో జీవిస్తున్నాము – మన

Read More »
14th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి ఉదయం మనం రోజును ప్రారంభించినప్పుడు, వివిధ చర్యలను చేయాల్సి ఉంటుంది. మనం ఇంట్లో ఉన్నా లేదా మన ఆఫీసులో ఉన్నా

Read More »