Hin

26th october 2024 soul sustenance telugu

October 26, 2024

శారీరక అనారోగ్యాలను అధిగమించడం.

మనం శారీరకంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు, మనలో చాలా మంది భయాందోళనకు గురవుతారు లేదా కలత చెందుతారు. మనం పదే పదే అనారోగ్యం గురించి మాత్రమే ఆలోచిస్తాము మరియు మాట్లాడుతాము. మనస్సు-శరీర యొక్క పరస్పర సంబంధం కారణంగా, మన ప్రతి ఆలోచన మన శరీరంలోని ప్రతి కణాన్ని ప్రభావితం చేస్తుంది. మన ఆలోచనలు మనల్ని నయం చేయగలవు లేదా హాని చేయగలవు. అనారోగ్యం గురించిన ఆలోచనలు మనల్ని మరింత అనారోగ్యానికి గురిచేస్తాయి. మంచి ఆరోగ్యాన్ని గురించిన ఆలోచనలు ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇస్తాయి.  ఒక నిమిషం మీ శారీరక అనారోగ్యం పట్ల  మీ స్పందన ఎలా ఉందో  ఆలోచించండి. అనారోగ్యానికి గురికావడం వల్ల మీరు అతిగా ఆలోచిస్తున్నారా? ఇది ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో అని మీరు ప్రశ్నిస్తున్నారా? పరిపూర్ణమైన(పర్ఫెక్ట్) శారీరక ఆరోగ్యం ఉండదనే ఆలోచనలు మిమ్మల్ని బాధిస్తున్నాయా? మన శారీరక ఆరోగ్యంపై మన భావోద్వేగ స్థితి భారీ పాత్ర పోషిస్తుందని వైద్య శాస్త్రం నిరూపించింది. దీని అర్థం బాధ, ఆందోళన, నొప్పి లేదా ఇప్పటికే ఉన్న అనారోగ్యం గురించి భయం దానిని మరింత తీవ్రతరం చేస్తుంది. శరీరానికి ఆరోగ్యం యొక్క ప్రకంపనలను ప్రసరింపచేయడం అనేది కోలుకోవడంలో సహాయపడుతుంది. మనం అనారోగ్యాన్ని అంగీకరించాలి, ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంపై దృష్టి పెట్టి చికిత్సతో పాటు శరీరాన్ని  నయం చేసేటువంటి కంపనాలను నిరంతరం ప్రసరింపజేయాలి. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంది, నా జీవితం అందంగా ఉంది, నా శరీరం హాయిగా ఉంది అనే ఆలోచనలతో వైద్యం చేసే శక్తిని ప్రసరింపజేసి, కోలుకోవడాన్ని వేగవంతం చేద్దాం. మీ శరీరంలో పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి మీ మనస్సు యొక్క శక్తిని ఆప్టిమైజ్ చేయండి. వ్యాధి ఆలోచనల నుండి పూర్తి స్వస్థత వైపుకు మారండి. నేను నా శరీరాన్ని అంగీకరిస్తాను మరియు నా శరీరం నన్ను అంగీకరిస్తుంది, మనసు – శరీరం యొక్క శక్తులు సామరస్యంగా ఉంటాయి, నేను నా మనస్సుతో ఆరోగ్యకరమైన శరీరాన్ని సృష్టిస్తాను అని మీకు మీరు గుర్తు చేసుకోండి.

ప్రతి క్షణాన్ని అనుభూతి చెందుతూ సంతోషంగా ఉండటం ప్రారంభించండి. మీరు మీ మనస్సు మరియు శరీరానికి యజమాని. మీ శరీరంలోని ప్రతి కణానికి ఆనందాన్ని మరియు ప్రేమను ప్రసరింపజేసి, మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మీ శరీరం కోసం ఆరోగ్యకరమైనవి తినండి, త్రాగండి. శరీరం అనారోగ్యంతో ఉంటే, వ్యాధి, నొప్పి, బాధ ఉంటే, సరిగ్గా ఎలా ఆలోచించాలో తెలుసుకొని మీ అనారోగ్యం గురించి చింతించకండి. మీ కుటుంబాన్ని ఆందోళన చెందనివ్వవద్దు. ఉత్తమమైన మందులు మరియు చికిత్సపై మాత్రమే దృష్టి పెట్టకండి, మీ ఆలోచనలపై కూడా దృష్టి పెట్టి మీ ఆలోచనలతో మీ శరీరాన్ని నయం చేయండి. మీ మనస్సు, నమ్మకాలు, ఆలోచనలు, వైఖరి మరియు ప్రవర్తనతో మీ శారీరక ఆరోగ్యం యొక్క ప్రతి అంశాన్ని చూసుకోండి. మీ శరీరాన్ని  నయం చేయడానికి, ఉల్లాసంగా ఉండటానికి మరియు ఉపశమనం, వైద్యం యొక్క ఆలోచనలు మాత్రమే ప్రసరింపచేయడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించండి. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని…నా శరీరంలోని ప్రతి కణం రిలాక్స్ గా ఉంది …ప్రతి అవయవం దాని గరిష్ట స్థాయిలో పనిచేస్తోంది…అన్ని పారామితులు సరిగ్గా ఉన్నాయి … నా శరీరం చికిత్సకు బాగా స్పందిస్తోంది… నా మందులు నాకు ఆరోగ్యాన్ని మాత్రమే ఇస్తున్నాయి.సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు…అసౌకర్యం లేదు…నేను కోలుకున్నాను…నా రోగనిరోధక శక్తి అద్భుతమైనది…నాకు మంచి ఫీలింగ్ కలుగుతోంది అని పదేపదే ఆలోచించండి, మాట్లాడండి మరియు విజువలైజ్  చేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »