Hin

8th august 2024 soul sustenance telugu

August 8, 2024

శ్రద్ధ అనే వాచ్మన్ ను  అప్రమత్తంగా ఉంచడం

అన్ని మతాలు, ఆధ్యాత్మిక సమూహాలు క్రమశిక్షణకు చాలా ప్రాముఖ్యతను ఇస్తాయి. క్రమశిక్షణ లేకుండా మీరు ప్రతికూల అలవాట్లను మార్చలేరు మరియు ఆధ్యాత్మికత యొక్క అనుభవం లేకుండా ఆత్మలో కొత్త అవగాహన స్థితిని మీరు సృష్టించలేరు. ప్రతిరోజూ మీరు తింటారు, పళ్ళు తోముకుంటారు, స్నానం చేస్తారు, నీరు తాగుతారు మరియు ఊపిరి పీల్చుకుంటారు, ఇవన్నీ మీరు క్రమశిక్షణగా పరిగణించరు; మీరు వాటిని సహజమైనవిగా స్వీకరించారు. అలాగే ఆధ్యాత్మిక స్థాయిలో కూడా మిమ్మల్ని మీరు పాలన చేసుకోవాలి.   ఆధ్యాత్మికత యొక్క అభ్యాసం మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటూ,   అది సహజంగా మారే సమయం వచ్చేతంట క్రమశిక్షణను కలిగి ఉండాలి. మార్పు ప్రక్రియలో మీరు పాత  అలవాట్లను తిరిగి రానివ్వకుండా ఉండటానికి మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో ఉంచుకోవాలి. మీరు పాత అలవాట్లు కాలి బూడిద అయ్యే వరకు, స్వయం పట్ల నియంత్రణను కొనసాగించడానికి మీరు శ్రద్ధగల కాపలాదారుని గా అప్రమత్తంగా ఉండాలి.  ఎందుకంటే మీరు చర్యలో ప్రతికూల అలవాటును ఉపయోగించిన ప్రతిసారీ, మీరు దానిని బలోపేతం చేస్తారు. మీరు దానిని ఉపయోగించనప్పుడు, మీరు దానిని అంతం చేయడానికి అనుమతిస్తారు.
అందువల్ల ఆధ్యాత్మిక యాత్రికుడి మార్గం మేల్కొనడం (ఆత్మగా తనను తాను తెలుసుకోవడం) మరియు నిద్రపోవడం (మనం మన శరీరం అనే భ్రమలో),  మేల్కొని నిద్రపోవడం. ఆత్మ-చైతన్యంలో స్థిరత్వాన్ని పొందేవరకు మనం రెండింటి మధ్య హెచ్చుతగ్గులకు గురవుతాము. అందుకే మేల్కొలపడంతో పాటు మెలకువగా ఉండటం చాలా ముఖ్యం.  అందుకే మన మనస్సు మరియు బుద్ధికి మంచి ఆధ్యాత్మిక ఆహారం (ఆధ్యాత్మిక జ్ఞానం) మరియు వ్యాయామం (ధ్యానం) ప్రతిరోజూ ఇవ్వడం చాలా ముఖ్యం. ఆత్మిక  స్పృహ కలిగి, ఆ స్పృహలో  వ్యవహరిస్తే  శారీరక అవగాహన యొక్క భ్రమల ఆధారంగా గత చర్యల వల్ల మిగిలిపోయిన మచ్చలు (అలవాట్లు మరియు ధోరణులు) నయం అవుతాయి. మీరు సంతృప్తికరమైన మరియు శాశ్వత ఫలితాలను పొందాలనుకుంటే ఆధ్యాత్మిక పెరుగుదలకు మరియు వ్యక్తిగత పరివర్తనకు క్రమశిక్షణ అవసరం. లేకపోతే, మీ జీవితంలో పాత అలవాట్లు కొనసాగుతాయి. ధ్యాన సాధనలో మన క్రమశిక్షణ పనిచేస్తుందనడానికి సాక్ష్యం మానసికంగా తేలికగా ఉండడం. ఇతరులతో మన పరస్పర చర్యలలో పెరుగుతున్న సౌలభ్యం మరియు మనం చేసే ప్రతి పనిలో విజయం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th jan 2025 soul sustenance telugu

మీ సంకల్పశక్తి మీకు అతిపెద్ద బలం

మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలనుకున్నా, వ్యసనాన్ని వదులుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించాలనుకున్నా, విజయం లేదా వైఫల్యాన్ని మన సంకల్ప శక్తికి ఆపాదించుకుంటాము. కొన్నిసార్లు మనం అత్యధిక సంకల్ప

Read More »
19th jan 2025 soul sustenance telugu

మిమ్మల్ని విమర్శించే వ్యక్తులపై దృష్టి పెట్టవద్దు

మనం లేదా మనం చేసే పనికి మనల్ని ఇష్టపడని వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారి గురించి మనకు తెలిసినప్పటికీ, వారిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మనకు మద్దతు ఇచ్చి, సానుకూల శక్తిని పంపే

Read More »
18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »