Hin

28th march 2025 soul sustenance telugu

March 28, 2025

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా మారుతోంది. మనలో చాలా మంది, వ్యక్తులు మెచ్చుకుంటారని నమ్మి ఏదైనా పోస్ట్ చేస్తుంటాము. లైక్‌లు మరియు సానుకూల కామెంట్ల కోసం దానిని చూస్తూ ఉంటాం. మనం ఎంత ఎక్కువ పొందితే అంత ఎక్కువ కావాలి అని కోరుకుంటాం. పాజిటివ్ కామెంట్లు తక్కువ వచ్చినా, నెగిటివ్ కామెంట్లు వచ్చినా అవి మన మూడ్‌ను పాడు చేస్తాయి. ఈ విధంగా వ్యక్తుల అభిప్రాయాలకు మనసు గాయపడుతూ ఉంటుంది.

  1. మీరు పబ్లిక్ ధ్రువీకరణ కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారా? మీరు ఏదైనా పోస్ట్ చేసి, ప్రజలు దానిని గమనించే వరకు, లైక్ చేసే వరకు లేదా దానిపై వ్యాఖ్యానించే వరకు ఓపికగా (లేదా అసహనంగా) వేచి ఉన్నారా? ఎక్కువ లైక్‌లు మిమ్మల్ని అంగీకరించినట్లు అనిపిస్తుందా మరియు లైక్‌లు లేకపోవడం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుందా?
  2. ఉపయోగకరమైన సమాచారాన్ని పంచుకోవడానికి మరియు వ్యక్తులతో కనెక్ట్ కావడానికి సోషల్ మీడియా ఒక అందమైన వేదిక. కానీ నేడు, ముఖాముఖి మాట్లాడలేని వ్యక్తులు, సోషల్ మీడియాలో పోస్ట్‌లను చురుకుగా పంచుకుంటున్నారు, వారి ఆలోచనలను పోస్ట్ చేస్తున్నారు. తమకు శ్రద్ధ, ప్రశంసలను అందించే ఆన్‌లైన్ ప్రేక్షకుల కోసం తపిస్తున్నారు.
  3. మనకు నచ్చిన మరియు ప్రయోజనకరమైన కంటెంట్‌ను పంచుకోవడానికి సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించుకుందాం. ఆ తర్వాత, అది 100 లైక్‌లను సంపాదించినా లేదా సున్నా లైక్‌లను సంపాదించినా పర్వాలేదు. వాస్తవానికి, ప్రజల స్పందన కోసం పదే పదే చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పెట్టే పోస్ట్‌పై ప్రజలకున్న అభిప్రాయాన్ని స్వీయ-విలువతో ముడిపెట్టకూడదు.

4. మీ సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ ఉంచండి. మీ జీవితం ఎంత ప్రశాంతంగా లేదా అందంగా ఉందో సోషల్ మీడియాలోని వ్యక్తులు ధృవీకరించాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి – నాకు నచ్చిన వాటిని పంచుకోవడానికి నేను సోషల్ మీడియాను ఉపయోగిస్తాను. ఇతరులు దీనిని లైక్ చేయాలని నేను వేచి ఉండను.

రికార్డు

22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »
20th april 2025 soul sustenance telugu

మెడిటేషన్ ఎలా చేయాలి? ఒక ప్రాథమిక మెడిటేషన్ కామెంటరీ (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు (నిన్నటి సందేశం నుండి మెడిటేషన్ కామెంటరీ కొనసాగుతుంది…)   ఇది నా వాస్తవిక ఇల్లు, శాంతిధామం, భూమిపై వివిధ భౌతిక శరీరాల

Read More »