Hin

11th sep 2024 soul sustenance telugu

September 11, 2024

సోషల్ మీడియాలో పనిలేని కబుర్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి

వ్యక్తుల  ప్రవర్తన లేదా జీవిత సమస్యల గురించి ప్రతికూల భావంతో మాట్లాడకూడదని, తీర్పు చెప్పేలా, విమర్శనాత్మకంగా లేదా వారి బలహీనతను పేర్కొనకూడదని మనం అభ్యాసం చేస్తాము. అలాగే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చదివే మరియు వినే వ్యక్తుల విషయంలో కూడా అదే సాధన చేద్దాం. ఇతరుల గురించి అన్ని రకాల పనిలేని కబుర్లు, ఇతరులను అవమానించడం, తీర్పు చెప్పడం నుండి మనల్ని మనం రక్షించుకుందాం. మీరు ఏ రకమైన పనిలేని కబుర్లలో పాల్గొనకూడదని నిర్ణయిం తీసుకోండి: అసత్యాలు, అర్ధ సత్యాలు, వ్యక్తిగత సత్యాలు, పుకార్లు మరియు తీర్పులు. కానీ మీ సోషల్ మీడియా న్యూస్ ఫీడ్ మీకు సన్నిహితుల గురించి, మీకు తెలియని వ్యక్తుల గురించి మరియు పూర్తిగా అపరిచితుల గురించి కథలతో నిండి ఉంటుంది. వాటి నుండి మీరు తప్పుకుంటూ ఎలా బలమైన సామాజిక బంధాలను కొనసాగిస్తారు? సోషల్ మీడియా ద్వారా అందరూ ఎక్కువగా పుకార్లను వ్యాప్తి చేస్తున్నారు లేదా విమర్శలను వ్యక్తం చేస్తున్నారు. కానీ వాటిలో పాల్గొనకపోవడం లేదా వ్యాప్తి చెందకుండా ఉండటం మన బాధ్యత. ఇది వారి అభిప్రాయం, మనం వారి కథలో, వారి సమస్యలో లేదా వారి పరిష్కారంలో భాగం కాదు. కాబట్టి, ఆ పనిలేని కబుర్లలో కూడా భాగం కావాల్సిన అవసరం లేదు. ఒకరి ఇమేజ్ దెబ్బతింటుందా, ఎవరైనా విడాకులకు దరఖాస్తు చేస్తున్నారా లేదా ఎవరైనా ఉద్యోగం నుండి తొలగించబడ్డారా, ఇది వారి వ్యక్తిగత విషయం. అంతే కాని చర్చించడానికి ఆహ్వానం కాదు. మర్యాదతో పాటు  దృఢంగా వైదొలగడానికి లేదా మన అయిష్టతను వ్యక్తం చేయడానికి ధైర్యం చేద్దాం. మనం సంభాషణను వేరొక దానిపై కూడా మార్చవచ్చు. మనం ఎప్పుడైనా ఇతరుల గురించి మాట్లాడవలసి వస్తే, ప్రశంసలను తెలియజేద్దాం. లేకపోతే మన సౌరభం, అలాగే మన చిత్తశుద్ధికి కళంకం ఏర్పడుతుంది. ప్రతిరోజూ మీకు మీరే గుర్తు చేసుకోండి-నేను స్వచ్ఛమైన ఆత్మను. నేను సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగిస్తాను, పనిలేని కబుర్లకు దూరంగా ఉంటాను. నేను సమాచారాన్ని తెలివిగా ఎంచుకుని వినియోగిస్తాను.

కూర్చొని మీరు సరైన విధంగా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నట్టుగా చూసుకోండి. మీరు జ్ఞానస్వరూపులని మీకు మీరే గుర్తు చేసుకోండి. మీకు ఏది సరైనదో అర్థం చేసుకోండి. సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి, చూడండి మరియు వినండి. మీ భావోద్వేగ ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే గ్రహించండి. మీరు ఇతరుల గురించి సమాచారాన్ని చదివేటప్పుడు, చూస్తున్నప్పుడు స్థిరంగా ఉండండి. విరామం తీసుకొని, ఇది నిజమేనా లేదా ఇది ఒకరి అభిప్రాయమా? అని మీకు మీరే ప్రశ్నించుకోండి. దాని గురించి నేను ఏదైనా చేయగలనా? అవును అయితే, మీ దృక్పథాన్ని, సానుకూల దృక్పథాన్ని పంచుకోండి, నిర్మాణాత్మక ప్రతిస్పందన ఇవ్వండి. మీ ఉద్దేశం శ్రేయస్సు, సాధికారత మరియు గౌరవంతో మార్పును తీసుకురావటమని నిర్ధారించుకోండి. మీ స్వచ్ఛమైన ఆలోచనలు, మాటలతో సానుకూల పరివర్తనకు దోహదం చేయండి. మీరు ఏమీ చేయలేకపోతే, మౌనంగా ఉండండి. మీ నిశ్శబ్ద మనస్సు మిమ్మల్ని, ఇతరులను రక్షిస్తుంది. ఇది వాతావరణం యొక్క ఆధ్యాత్మిక శక్తిని కూడా సంరక్షిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »
17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »