Hin

21st august 2024 soul sustenance telugu

August 21, 2024

స్పృహ ప్రక్షాళన (పార్ట్ 1)

మీ పాత అలవాట్లు ఏమాత్రం లేకుండా జీవితాన్ని గడపడం మిమ్మల్ని మానసికంగా బలోపేతం చేస్తుంది. అలాంటి జీవితం అన్ని రకాల జీవిత పరిస్థితులలో విజయాన్ని పొందెందుకు అవసరమైన అన్ని శక్తులతో నిండి ఉంటుంది. కాబట్టి, రోజుకు ఒకసారి, రోజు చివరిలో ఈ విధంగా మనల్ని మనం చెక్ చేసుకోవడానికి సమయం ఇవ్వడం, మరుసటి రోజు మనల్ని మనం తిరిగి తయారు చేసుకోవడానికి, తదనుగుణంగా వ్యవహరించడానికి సహాయపడుతుంది. పాత అలవాట్లు మన ఆలోచనా విధానంపై ఆధిపత్యం చెలాయిస్తాయి, మనల్ని ప్రశాంతంగా ఆంతరిక సంతృప్తితో ఉండనివ్వవు. కాబట్టి, మీరు రోజును ప్రారంభించి, పనులు మొదలు పెట్టినప్పుడు, నేను జీవితంలోని అన్ని రంగాలలో ఆంతరిక సంతృప్తిని అనుభవం చేసుకుంటానని మీకు మీరే చెప్పుకోండి. పూర్తి స్వచ్ఛత, శాంతి మరియు ఆనందం యొక్క నా అసలైన స్వభావానికి అనుగుణంగా ఉంటేనే నేను దీన్ని చేయగలను. మనస్సు పవిత్రంగా ఉంటే, శాంతి మరియు ఆనందం ఉంటుంది.

స్వచ్ఛతను మనస్సు యొక్క పూర్తి పరిశుభ్రతగా నిర్వచించవచ్చు. అంటే ఆత్మకు ఐదు శత్రువులు అయినటువంటి కామం, కోపం, దురాశ, మొహం మరియు అహంకారం లేకుండా ఉండటం. ఈ ఐదు దుర్గుణాలు ఆత్మ యొక్క ఆకృతిని పాడు చేస్తాయి, సుగుణాల పరంగా దాని నాణ్యతను తగ్గిస్తాయి. పరిశుభ్రత అనేది ఒక నిర్దిష్ట దోషం లేకపోవటానికి మాత్రమే పరిమితం కాదు, కానీ సంపూర్ణ అర్థంతో ఆత్మ యొక్క పూర్తి లక్షణం. కానీ, సంపూర్ణ పరిశుభ్రత అంటే అన్ని దుర్గుణాల నుండి పూర్తిగా విముక్తి పొందిన మనస్సు. ఉదా – పనిని పూర్తి చేయడానికి కోపాన్ని మితిమీరి దుర్వినియోగం చేయడం ఒక దుర్మార్గం, కానీ అదే పనిని దృఢత్వంతో చేయాలనుకోవడం ఒక దుర్గుణం కాదు. అలాగే, జీవితంలో పెద్ద విషయాలను సాధించడానికి దురాశను మితిమీరి దుర్వినియోగం చేయడం అనేది ఒక దోషం, కానీ అదే విషయాన్ని సాధించడానికి ఆచరణాత్మకమైన ఆశ ఉండటం అనేది దోషం కాదు. మరొక ఉదాహరణ – మీ కుటుంబ సభ్యులను ప్రేమించడం అనేది దోషం కాదు, కానీ వారితో మొహం కలిగి ఉండటం, ఇది కొన్నిసార్లు దుఃఖాన్ని కలిగిస్తుంది, ఇది ఒక దుర్గుణం. అలాగే, ఆత్మగౌరవంతో నిండి ఉండటం, మీ ప్రత్యేకతలు మరియు ప్రతిభ గురించి సంతోషంగా ఉండటం అనేది తప్పు కాదు, కానీ వాటి గురించి అహంభావంతో పాటు వాటి గురించి గొప్పగా చెప్పుకోవడం కూడా తప్పే. కాబట్టి, పరిశుభ్రత అంటే అన్ని దుర్గుణాలు మరియు వాటి వివిధ ఛాయల గురించి తెలుసుకొని వాటి నుండి విముక్తి పొందడం.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

11th july 2025 soul sustenance telugu

చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల

Read More »
10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »