Hin

22nd august 2024 soul sustenance telugu

August 22, 2024

స్పృహ ప్రక్షాళన (పార్ట్ 2)

మీరు దినచర్యను ప్రారంభించగానే మీ మనస్సును ఇతరుల పట్ల స్వచ్ఛమైన స్మృతి మరియు వ్యవహారం వైపు మళ్లే కొన్ని సానుకూల ఆలోచనలను చేయండి. శుద్ధత అనేది ఆత్మ యొక్క అసలైన సంస్కారం అని మనందరికీ తెలుసు. మన స్మృతిలో శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి ఉన్న చోట శుద్ధత ఉంటుంది. అలాగే, అక్కడ కోపం, అహం, అసూయ, ద్వేషం, ఇతర దుర్గుణాల యొక్క భావోద్వేగాలు లేదా ఆలోచనలకు చోటు లేదు. ఇంకా, గతం లేదా భవిష్యత్తు గురించి లేదా సాధారణంగా ఇతరుల గురించి ఏదైతే కొన్నిసార్లు అనవసరమో దానిని ఎక్కువగా ఆలోచించడం ఉండదు.

కాబట్టి, మన రోజువారీ పని దినచర్యను ప్రారంభించినప్పుడు, దానికి ముందు సానుకూలమైనదాన్ని చదవడం, మన మనస్సును సానుకూలతతో నింపడం చాలా ముఖ్యం, ఇది మిగిలిన రోజంతా మన మనస్సును నిమగ్నమయ్యేలా చేస్తుంది. ఉదయాన్నే ఆధ్యాత్మిక జ్ఞానం లేదా మనస్సు సాధికారత కోసం ఆచరణాత్మక చిట్కాలను చదవడం మీ మనస్తత్వాన్ని మారుస్తుంది మరియు మీరు మానసికంగా తాజాగా, శక్తివంతంగా అనుభవం చేసుకుంటారు. మరోవైపు, సానుకూల ఆలోచనలతో నిండని ఒక ఖాళీ మనస్సు రోజంతటిలో వివిధ ఒడిదుడుకులు లేదా మీ కార్యాలయంలోని, మీ కుటుంబంలోని రకరకాల వ్యక్తుల స్వభావాల ప్రభావంలోకి సులభంగా వస్తుంది. ఉదయాన్నే సానుకూలమైనవి చదివే వ్యక్తి, నిరంతరం ఉత్సాహంగా, శక్తితో నిండి ఉంటాడు, సంతృప్తిని ప్రసరింపజేస్తాడు, జీవితం గురించి మరియు జీవితంలోని వివిధ పరిస్థితుల గురించి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ఉంటాడు. అలాగే, ఆహారం, విశ్రాంతి మరియు వ్యాయామం ఆరోగ్యకరమైన శరీరానికి కీలకమని మనకు తెలుసు. అదే విధంగా, స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటూ బుద్ధి నేత్రంతో ఆధ్యాత్మిక తండ్రి, పరమాత్మ లేదా భగవంతుడిని అనుభవం చేస్తూ వారి ఆధ్యాత్మిక శక్తి, సానుకూలతతో మిమ్మల్ని మీరు ఉత్తేజపరచుకోవడం ఒక వ్యాయామం లాంటిది. భగవంతునితో ఆలోచన మరియు విజువలైజేషన్ శక్తితో అనుసంధానం అయ్యే వ్యాయామం,  ఆత్మకు చాలా బలాన్ని ఇస్తుంది. అలాగే, సానుకూల ఆలోచనలు లేదా జ్ఞానం ఆత్మకు ఆహారం లాంటివి. అలాగే, ఆత్మకు విశ్రాంతి, ప్రతి గంటకు ఒక సారి శాంతిని అనుభవం చేసుకోవడం అనేదే భగవంతుడిని రోజంతా వివిధ రకాలుగా ప్రేమించడం. భగవంతుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ప్రతి ఆత్మకు శుభభావనలను ఎలా ప్రసరింపజేయాలో, వారిని భగవంతునితో స్వచ్ఛమైన ప్రేమ బంధంలో ఎలా బంధించాలో నేర్పిస్తారు. కాబట్టి, చర్యలను చేసేటప్పుడు భగవంతుని సాంగత్యాన్ని ఆస్వాదించడం, వారి నుండి మీరు పొందే ప్రేమ యొక్క వైబ్రేషన్లను ఇతరులకు ఇవ్వడం, ఆత్మకు చాలా శాంతి, విశ్రాంతి మరియు నెరవేర్పును ఇస్తుంది. ఎందుకంటే మీరు భగవంతుని ప్రేమను పంచుకున్న వారి నుండి చాలా ఆశీర్వాదాలను ప్రతిఫలంగా పొందుతారు.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

11th july 2025 soul sustenance telugu

చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల

Read More »
10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »