Hin

23rd august 2024 soul sustenance telugu

August 23, 2024

స్పృహ ప్రక్షాళన (పార్ట్ 3)

మనస్సు యొక్క స్వచ్ఛత అనేది మీ జీవిత లక్ష్యంగా మార్చుకోవలసిన విషయం. ఇది మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన విశిష్టత. అన్నింటికంటే, మీరు ఎంత స్వచ్ఛంగా ఉంటారో, మీ జీవితంలో మీరు అంత ఎక్కువ సానుకూల పరిస్థితులను ఆకర్షిస్తారో, అంత మీకు సంతోషాన్ని ఇస్తుంది. మనకు ఏదైనా వికారంతో కూడిన అపవిత్రమైన ఆలోచన వచ్చిన ప్రతిసారీ, మనం ప్రతికూల స్వభావం గల వైబ్రేషన్ ను విశ్వానికి ప్రసరిస్తాము. ఆ వైబ్రేషన్ ఏ రకంగానైనా దుఃఖంతో నిండిన పరిస్థితి రూపంలో మన వద్దకు తిరిగి వస్తుంది. కాబట్టి, ఆత్మ యొక్క స్వచ్ఛత లేదా మన స్మృతి మన జీవిత అనుభవాలన్నింటికీ మరియు మనం ఎదుర్కొనే పరిస్థితుల రకానికి పునాది.

ఒక వ్యక్తి తరచూ శారీరక అనారోగ్యాల రూపంలో ప్రతికూల జీవిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటే,  తను మునుపటి జన్మల యొక్క గతంలోని కొన్ని ప్రతికూల చర్యల కారణంగా తనలో ప్రతికూల శక్తి ఉందని అర్థం. ఈ ప్రతికూల శక్తి విశ్వంలోకి ప్రసరిస్తోంది మరియు ప్రస్తుత సమయంలో తన జీవితంలో ప్రతికూల దృశ్యాల రూపంలో తన వద్దకు తిరిగి వస్తోంది. కాబట్టి, ఈ సమయంలో తను చేయవలసినది చాలా సానుకూల ఆలోచనలను సృష్టించడం. స్వచ్ఛతతో నిండి ఉన్నవి అంటే కామం, కోపం, దురాశ, మొహం మరియు అహంకారం లేనివి. శాంతి, ప్రేమ, ఆనందం మరియు ఆధ్యాత్మిక శక్తితో నిండిన ఆలోచనలను సృష్టించడం. అలాగే, ఈ ఆలోచనలు చాలా ఆత్మగౌరవంతో నిండి ఉండాలి. తన జీవితంలో ప్రతికూల సన్నివేశాలపై దృష్టి పెడుతూ ఈ శక్తివంతమైన ఆలోచనలను సృష్టించి, ఆపై వాటిని విజయవంతమైన ఆలోచనలను చేసి పూర్తి చేయాలి. ఈ ఆలోచనలు అద్భుతాలు చేయగలవు. ఈ ఆలోచనలు అనారోగ్యాలకు సరైన పరిష్కారాలను ఆకర్షించి, బాధలను అంతం చేయగలవు. స్వచ్ఛమైన స్మృతి చేయగలిగేది ఇదే. అలాగే, ఒక వ్యక్తి తరచూ అంతులేని ఆర్థిక నష్టాలతో బాధపడుతుంటే, అతను ప్రతి ఉదయం సానుకూలమైనదాన్ని చదవడం ప్రారంభించి, ప్రతి ఉదయం కొన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. ఇది అతని స్మృతిను శుభ్రంగా మరియు స్పష్టంగా చేస్తుంది. కొన్ని రోజుల వ్యవధిలో, అతను తన ప్రతికూల పరిస్థితులలో మార్పును గమనించడం ప్రారంభిస్తాడు. అతను తన జీవితంలో సానుకూల సంపదను సంపాదించే అవకాశాలను ఆకర్షిస్తాడు. ఇది తప్పకుండా జరుగుతుంది మరియు ఆచరణాత్మక జీవితంలో స్మృతి ప్రక్షాళన అవుతుంది. ఇది మన జీవితాల సారాంశం. మన జీవితంలో శాంతి, ఆనందం యొక్క అదృశ్య సంపదకు కీలకం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »