Hin

26th august 2024 soul sustenance telugu

August 26, 2024

శ్రీకృష్ణుడిలా అందంగా, దివ్యంగా మారుదాం

శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు ఆధ్యాత్మిక సందేశం-ఆగస్టు 26

శ్రీ కృష్ణ జన్మాష్టమి గొప్ప ప్రాముఖ్యత కలిగిన రోజు, శ్రీ కృష్ణుడి జన్మదినాన్ని జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు తన దివ్యత, తేజస్సు మరియు అందమైన సుగుణాలకు గుర్తుండిపోయేలా ఉన్న అందమైన దేవాత్మ. మనమందరం శ్రీకృష్ణుడిని వారి విశేషతలకు చాలా ప్రేమిస్తాము. వారు మంచితనం, ఆనందం మరియు ప్రేమతో నిండిన చాలా విశేషమైన దేవాత్మ అని కూడా తెలుసు. మనం శ్రీకృష్ణుడి జన్మాష్టమిని జరుపుకునేటప్పుడు, వారి నుండి ప్రేరణ పొంది వారిలాగే అందంగా మారాలని మనకు మనం గుర్తుచేసుకోవాలి. భగవంతుడు ఆత్మ గురించి, తమ గురించి, మరియు ప్రపంచ నాటకం గురించి చక్కటి జ్ఞానాన్ని ఈ సమయంలో మనతో పంచుకుంటారు. ఈ జ్ఞానాన్ని మన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా, మనం శ్రీకృష్ణుడిలాగే ఆధ్యాత్మికంగా, రాజసంగా, దివ్యంగా మారవచ్చు. జ్ఞానం మనకు ఏమి బోధిస్తుంది? శ్రీకృష్ణుడిలా మారడానికి పరిశీలించుకొని చర్యలు తీసుకుందాం –

  1. మీరు స్వచ్ఛమైన ఆత్మ మరియు పవిత్రతా సాగరుడైన భగవంతుని సంతానం. మిమ్మల్ని మీరు ఒక ఆత్మగా అనుభవం చేసుకోవడం ప్రారంభించండి. మళ్ళీ స్వచ్ఛంగా మారడానికి, మీ జీవితంలోని ప్రతి క్షణం భగవంతునితో కనెక్ట్ అవ్వండి.
  2. గతంలో ఉన్న స్వర్ణయుగం లేదా సత్య యుగంలో మీరు ఒక దేవత. ఆ యుగాన్ని స్వర్గం అని కూడా అంటారు. మీలో ఆ స్వర్ణయుగం సుగుణాలను వెలికితీయండి, తద్వారా ప్రస్తుత సమయంలో భగవంతుడు మళ్ళీ స్థాపిస్తున్న స్వర్ణ యుగానికి వెళ్లి మీరు మళ్ళీ దేవతగా మారవచ్చు.
  3. రోజంతా మీ ప్రతి ఆలోచన, మాట మరియు చర్యను చెక్ చేసుకొని, దానిని ఏంజెల్ యొక్క మంచితనం మరియు దైవిక స్వచ్ఛతతో నింపండి. ఆలోచించడం, చూడటం, నడవడం, మాట్లాడటం, తినడం, నిద్రపోవడం మరియు రోజంతా మీరు చేసే ప్రతిదాన్ని రాజసం గల దేవత వలే చేయండి.
  4. భగవంతుడిని మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన భాగంగా చేసుకొని ధ్యానంలో వారి దైవిక మార్గదర్శకత్వం తీసుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉండాలో మరియు ఆ ఆనందాన్ని ఇతరులకు ఎలా పంచాలో వారి నుండి నేర్చుకోండి. ఆధ్యాత్మిక జ్ఞానం, సదా భగవంతుని స్మృతి యొక్క ఆనందంతో నృత్యం చేయండి.
  5. భగవంతుని జ్ఞానం ఆధారంగా మీ మనసులో స్వర్ణయుగం యొక్క చిత్రాన్ని రూపొందించండి. ప్రతిరోజూ స్వర్ణయుగం యొక్క అందాన్ని విజువలైజ్ చేసుకోండి – మీరు ఇతర దేవతలతో కలిసి అక్కడ ఎలా పాత్ర పోషించారు, ముఖ కవళికలు, భౌతిక అందం, దుస్తులు, ఆభరణాలు, ఆహారం, ఆరోగ్యం మరియు సంపదలో పరిపూర్ణత, భౌతిక ప్రకృతి మరియు దృశ్యాలు, జంతువులు మరియు పక్షులు, అక్కడ ఉన్న విజ్ఞానం మరియు దాని దైవిక బహుమతులను కూడా విజువలైజ్ చేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

11th july 2025 soul sustenance telugu

చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల

Read More »
10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »