Hin

10th march 2025 soul sustenance telugu

March 10, 2025

శుభాశీసులే ముఖ్యం

శుభోదయం! ఈ ఉదయం, మీరు మీ కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగులకు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ లేదా గుడ్ లక్ లతో శుభాకాంక్షలు తెలిపారా? మీరు ప్రతిరోజూ ఇతరులను విష్ చేస్తారా? మీరు శుభాశీసులను ఎలా స్వీకరిస్తారు? మనలో చాలామంది నిజమైన గుడ్ మార్నింగ్ విష్ ను తక్కువగా అంచనా వేస్తారు. అవి కేవలం ఆచారం మాత్రమే కాదు. మంచితనం యొక్క స్వచ్ఛమైన ఉద్దేశ్యాలతో తెలియజేయబడతాయి, ఆశీర్వాదాల శక్తిని ప్రసరింపజేసి రాబోయే మంచి విషయాలను స్వాగతిస్తాయి. ఎవరైనా మనల్ని పలకరించినప్పుడు, మనం పట్టించుకోకుండా లేదా కేవలం తలాడించడం, లేదా మామూలుగా మార్నింగ్ అని చెప్పకూడదు. అలాగే, ఫోన్‌లో వ్యక్తులతో కేవలం రిపీట్ చేయడానికి విషెస్ తెలియజేయవద్దు. మనము ఆ విష్ కు ఉన్న శక్తిని అనుభూతి చెందిన తర్వాత కర్మలోకి తీసుకురావాలి. అప్పుడు అవతలి వ్యక్తి మన సందేశంతో పాటు మన స్వచ్ఛమైన శక్తిని పొందుతారు. గుడ్ మార్నింగ్ చెప్పడం కష్టం కాకూడదు. వయస్సు, పదవి లేదా అధికారం ఆధారంగా ఇతరులు పలకరించాలని వేచి ఉండకండి. ఇతరులు సంతోషంగా ఉండవచ్చు, విచారంగా ఉండవచ్చు, లేదా వారి మూడ్ ఈ రెండీటి మధ్యలో ఉండవచ్చు కానీ వారి ప్రతిస్పందనతో సంబంధం లేకుండా, మనం వారితో కనెక్ట్ అయిన ఆ 2 సెకన్లలో వారికి  మంచిగా అనుభవం చేయించగలం.

కను సైగ చేయడం, చిరునవ్వు నవ్వడం, అభినందించడం లేదా ఇతరులను పలకరించడం వంటి సాధారణ సంజ్ఞల శక్తిని మనం తరచుగా పట్టించుకోము. ఈ అర్థవంతమైన చర్యలు మనకు  మరియు ఇతరులకు ఖచ్చితంగా సంతోషాన్ని ఇస్తాయి. ఇతరులు తమ గురించి మంచిగా భావించడంలో మనం సహాయపడటం ద్వారా, మన సంతోషం గణనీయంగా పెరుగుతుంది. ఈ రోజు మీ పాజిటివ్ శక్తి ఒకరి రోజును ఎలా ప్రకాశవంతం చేస్తుందో చూడడానికి ఒక్క క్షణం వెచ్చించండి. ప్రతి  ఒక్కరు వారిని పలకరించే వారు మరియు వినేవారి కోసం ఎదురు చూస్తున్నారు. కొన్నిసార్లు మీ నుండి ఇతరులకు కావలసిందల్లా అదే. మీ మాటలు మరియు చర్యల ద్వారా వారు మీకు ముఖ్యమైనవారని తెలియజేయండి. మీరు గేట్ వద్ద సెక్యూరిటీ గార్డును పలకరించినప్పుడు, అపరిచితుడి కోసం తలుపు తెరిచినప్పుడు లేదా మీ కుటుంబ సభ్యునికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి. మీరు ఎవరితోనైనా సమయం గడిపినప్పుడు, మీరు వారి విలువ మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. కర్మలలో దయ మీరు అనుకున్నదానికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది.

రికార్డు

25th june 2025 soul sustenance telugu

జీవితంలో విజయం సాధించడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి రోజు భగవంతుని జ్ఞానంలోని ప్రేరణాత్మక వాక్యాలను చదవండి మనం రోజంతా వేర్వేరు సమయాల్లో అనేక రకాల జ్ఞానాన్ని చదువుతాము మరియు

Read More »
24th june 2025 soul sustenance telugu

జీవితంలో విజయం సాధించడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనం చేసే ప్రతి పనిలో బాగా చేయాలనే సానుకూల ఉద్దేశ్యంతో మన జీవితాలను గడుపుతున్నాము, అందుకు మన రోజంతా జీవితంలోని

Read More »
23rd june 2025 soul sustenance telugu

ప్రతిరోజును ఫిర్యాదు లేని రోజుగా చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ఒక వ్యక్తి లేదా పరిస్థితి గురించి మనం చివరిసారిగా ఎప్పుడు ఫిర్యాదు చేసాము? చాలా కాలమయ్యి ఉండకపోవచ్చు… నిన్ననే కావచ్చు. మన

Read More »