Hin

30th-sept-2023-soul-sustenance-telugu

September 30, 2023

శుభాశీసులే ముఖ్యం

శుభోదయం! ఈ ఉదయం, మీరు మీ కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగులకు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ లేదా గుడ్ లక్ లతో శుభాకాంక్షలు తెలిపారా? మీరు ప్రతిరోజూ ఇతరులను విష్ చేస్తారా? మీరు శుభాశీసులను ఎలా స్వీకరిస్తారు? మనలో చాలామంది నిజమైన గుడ్ మార్నింగ్ విష్ ను తక్కువగా అంచనా వేస్తారు. అవి కేవలం ఆచారం మాత్రమే కాదు. మంచితనం యొక్క స్వచ్ఛమైన ఉద్దేశ్యాలతో తెలియజేయబడతాయి, ఆశీర్వాదాల శక్తిని ప్రసరింపజేసి రాబోయే మంచి విషయాలను స్వాగతిస్తాయి. ఎవరైనా మనల్ని పలకరించినప్పుడు, మనం పట్టించుకోకుండా లేదా కేవలం తలాడించడం, లేదా మామూలుగా మార్నింగ్ అని చెప్పకూడదు. అలాగే, ఫోన్‌లో వ్యక్తులతో కేవలం రిపీట్ చేయడానికి విషెస్ తెలియజేయవద్దు. మనము ఆ విష్ కు ఉన్న శక్తిని అనుభూతి చెందిన తర్వాత కర్మలోకి  తీసుకురావాలి. అప్పుడు అవతలి వ్యక్తి మన సందేశంతో పాటు మన స్వచ్ఛమైన శక్తిని పొందుతారు. గుడ్ మార్నింగ్ చెప్పడం కష్టం కాకూడదు. వయస్సు, స్థానం లేదా అధికారం ఆధారంగా ఇతరులు పలకరించాలని వేచి ఉండకండి. ఇతరులు సంతోషంగా ఉండవచ్చు, విచారంగా ఉండవచ్చు వారి ప్రతిస్పందనతో సంబంధం లేకుండా, మము కనెక్ట్ అయిన ఆ 2 సెకన్లు మనల్ని కలుసుకున్న వారికి  మంచిగా అనుభవం చేయించగలం.

కను సైగ చేయడం, చిరునవ్వు నవ్వడం, అభినందించడం లేదా ఇతరులను పలకరించడం వంటి సాధారణ సంజ్ఞల శక్తిని మనం తరచుగా పట్టించుకోము. ఈ అర్థవంతమైన చర్యలు మనకు  మరియు ఇతరులకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తాయి. ఇతరులు తమ గురించి మంచిగా భావించడంలో మనం సహాయపడటం ద్వారా, మన ఆనందం గణనీయంగా పెరుగుతుంది. ఈ రోజు మీ పాజిటివ్ శక్తి ఒకరి రోజును ఎలా ప్రకాశవంతం చేస్తుందో చూడడానికి ఒక్క క్షణం వెచ్చించండి. ప్రతి  ఒక్కరు వారిని పలకరించే వారు మరియు వినేవారి కోసం ఎదురు చూస్తున్నారు. కొన్నిసార్లు మీ నుండి ఇతరులకు కావలసిందల్లా అదే. మీ మాటలు మరియు చర్యల ద్వారా వారు మీకు ముఖ్యమైనవారని తెలియజేయండి. మీరు గేట్ వద్ద సెక్యూరిటీ గార్డును పలకరించినప్పుడు, అపరిచితుడి కోసం తలుపు తెరిచినప్పుడు లేదా మీ కుటుంబ సభ్యునికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి. మీరు ఎవరితోనైనా సమయం గడిపినప్పుడు, మీరు వారి విలువ మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. కర్మలలో దయ మీరు అనుకున్నదానికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th sep 2024 soul sustenance telugu

సమూహాలలో ఆధ్యాత్మిక ఉన్నతిని అనుభూతి చెందడం  (పార్ట్ 1)

ఆధ్యాత్మిక అభివృద్ధి వైపు మొగ్గు చూపే ఎవరైనా తమకు సమానమైన మనస్తత్వంగల ఆధ్యాత్మిక సమూహాలలో భాగం అవ్వడం అవసరం అని భావిస్తారు. ఇటువంటి సమూహాలు, సమావేశాలు లేదా సంఘాలు జీవనశైలి అలవాట్లును, మార్గదర్శకాలను అందిస్తాయి.

Read More »
19th sep 2024 soul sustenance telugu

కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది?

మనమందరం ఆధ్యాత్మిక శక్తులము లేదా ఆత్మలము. మనం ఈ ప్రపంచ నాటకంలో వివిధ రకాల చర్యలను చేస్తాము. మనమందరం దేహ అభిమాన ప్రభావంతో ప్రపంచ నాటకంలో చాలా మంచి చర్యలు మరియు కొన్ని ప్రతికూల

Read More »
18th sep 2024 soul sustenance telugu

మన ప్రకంపనల నాణ్యత మరియు అవి ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయి

మనం సృష్టించే ప్రతి ఆలోచన, మనం మాట్లాడే ప్రతి పదం మరియు మనం చేసే ప్రతి చర్య విశ్వంలోకి భౌతికం కాని శక్తి లేదా ప్రకంపనల రేడియేషన్కు,ఇతర వ్యక్తుల వైపు, పరిసరాల వైపు, వాతావరణానికి,

Read More »