Hin

2nd jan 2025 soul sustenance telugu

January 2, 2025

సులువుగా విడిచి పెట్టడం

కొన్నిసార్లు మనం మోస్తున్న మానసిక సామాగ్రి యొక్క భారాన్ని తెలుసుకోము. మానసిక సామాగ్రి అంటే  మన అజ్ఞానం, గత అనుభవాల వల్ల కలిగే బాధ, మోహం, ఆపేక్షలు, తప్పుడు అలవాట్లు, పరిమితమైన నమ్మకాలు మరియు ఇతరుల అభిప్రాయాలు కావచ్చు. మనం ఈ పాత పద్ధతులను సమాప్తం చేసినప్పుడు మాత్రమే, మనం కొత్త ఆలోచనా విధానాలకు, ప్రవర్తనకు అనుగుణంగా ఉండగలము. జీవిత ప్రయాణంలో, అవసరమైన వాటిని మాత్రమే మోసుకెళ్లి తేలికగా ప్రయాణించడం తెలివైన పని. ఇది భావోద్వేగ సామాగ్రికి కూడా వర్తిస్తుంది. మనం బాధాకరమైన గతాన్ని – నిరాశలు, తప్పుడు అలవాట్లు, బాధలను మరియు భయాలను కలిగి ఉంటాము. విడిచిపెట్టడం కొత్త ఆలోచనా విధానాలకు, కొత్తగా ప్రవర్తించడానికి మరియు అలా ఉండటానికి అవకాశాన్ని సృష్టిస్తుంది. 

ఏదైనా అనవసరమైన భావోద్వేగ భారాన్ని వదిలించుకోవడానికి ఈ విధానాలను అనుసరించండి –

 

  1. మీ మనస్సు కలత చెందినప్పుడు, అది ఏమి ఆలోచిస్తుందో చెక్ చేసుకోండి. ఇది గతానికి లేదా భవిష్యత్తుకు సంబంధించినది కావచ్చు. దానిని వర్తమానంలోకి మళ్లించండి.
  2. ప్రతి సన్నివేశంలో సరైన ప్రతిస్పందనను ఎంచుకోండి. ఇతరులను నిందించకూడదు, తీర్పు చెప్పడం లేదా విమర్శించకూడదు.
  3. ఎవరైనా మీకు ద్రోహం చేసినప్పటికీ, బాధ అనేది మీ సృష్టి. వారు నాకు ఎందుకు ఇలా చేసారు అని మనస్సు ప్రశ్నించినట్లయితే, వాటికి బదులు నేను వదిలేస్తున్నాను…నేను వ్యక్తులను అర్థం చేసుకుంటాను… నేను వాళ్ళని అంగీకరిస్తాను…నేను స్థిరత్వంతో పరిస్థితులను ఎదుర్కొంటాను…అనే సంకల్పాలు చేయండి. 
  4. ఎవరూ లేదా ఏదీ మీకు చెందినది కాదు. ప్రతిదీ మీ కర్మల ఖాతా ప్రకారం వచ్చింది. కాబట్టి మీ పట్ల, వ్యక్తుల పట్ల మరియు పరిస్థితుల పట్ల మోహం లేదా ఆగ్రహం వదిలివేయండి.

 

ఒత్తిడి లేని మనస్సు కొరకు ప్రతిరోజూ ఈ ధృవీకరణను రిపీట్ చేయండి. మీరు ప్రతికూలత యొక్క పొరలను తొలగించినప్పుడు, మీరు మీ అసలైన స్వభావంతో కనెక్ట్ అవ్వడం ప్రారంభిస్తారు. సంతోషం, ప్రేమ మరియు దయాభావం వంటి మీ అసలు సుగుణాలను కలిగి ఉంటూ వాటిని సక్రియం చేయడానికి అంతరంగంలో కొంత స్థానం ఉంటుంది.

 

నేను ఒక సంతోషకరమైన వ్యక్తిని… నేను ఒక సన్నివేశం నుండి మరొక సన్నివేశానికి సులభంగా మారుతాను. నేను వర్తమానంలోనే ఉంటాను… నిందించడం… ఆందోళన చెందడం… విమర్శించడం… అనే నా పాత అలవాట్లను నేను వదిలేసాను. ఆ పాత దృశ్యం నా మనస్సులో ఉండదు…  నేను వ్యక్తుల మంచితనంపై దృష్టి పెడతాను. వారి పట్ల నాకు దయ కలుగుతుంది. వారి ప్రవర్తన నా మనస్సులో ఉండదు… ఈ జీవిత ప్రయాణంలో…నేను తేలికగా ప్రయాణిస్తాను.

రికార్డు

18th july 2025 soul sustenance telugu

స్వీయ సందేహం మరియు అభద్రతలను అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆనందాన్ని క్షీణింపజేసి, మనకు నిరాశ కలిగించే ఒక భావోద్వేగం – అభద్రత. మన గురించి, మన సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థికం

Read More »
17th july 2025 soul sustenance telugu

ఇదే సరైన సమయం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మీరనుకున్న మార్పును తీసుకురావడానికి లేదా అసంపూర్ణంగా ఉన్న పనిని పూర్తి చేయడానికి ఏది సరైన సమయం? నేను నూతన సంవత్సరంలో ప్రారంభిస్తాను…

Read More »
16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »