Hin

9th june2024 soul sustenance telugu

June 9, 2024

సులువుగా విడిచి పెట్టడం

విడిచి పెట్టడం అంటే ఆత్మకు సరైనది కాని,  ఆరోగ్యకరమైనది కాని ప్రతిదానితో విముక్తి పొందగల మన సామర్ధ్యం. గతాన్ని వర్తమానం మరియు భవిష్యత్తులోకి తీసుకెళ్లకూడదని దీని అర్థం. మన అజ్ఞానం, గత అనుభవాల నుండి బాధ, మొహం, ఆపేక్షలు, ప్రతికూల అలవాట్లు, తప్పుడు నమ్మకాలు, ప్రతికూల సంస్కారాలు మరియు అందరి అభిప్రాయాలు వంటి భారాన్ని తగ్గించడం. మన పాత పద్ధతులను వదిలేయటం వల్ల, కొత్త ఆలోచనలు, ప్రవర్తన, ఉండే తీరు, మార్చుకోవటం వంటి కొత్త మార్గాలను మనం స్వాగతిస్తాము. ధ్యానం మరియు భగవంతునితో కనెక్ట్ అవ్వడం ప్రతికూలతను వదిలేసే సామర్థ్యాన్ని బలపరుస్తుంది. నేను శరీరం లేదా పాత్రను కాదు ఆత్మనని తెలుసుకోవడం, వ్యక్తులతో జీవించడం, వస్తువులను కలిగి ఉండి కూడా వాటిపై మొహం లేకుండా లేదా కోల్పోతామనే భయం లేకుండా ఉండటాన్ని సులభం చేస్తుంది. మనం ట్రస్టీ పాత్రను పోషిస్తాము, కాబట్టి ఎవరూ, ఏదీ మనకు చెందినది కాదు. అందరూ సామరస్యంగా కలిసి జీవించడానికి మన జీవితంలోకి వస్తారని మనకు ఉన్న వస్తువులను కృతజ్ఞతతో, శ్రద్ధతో ఉపయోగించాలని మనం అర్థం చేసుకుందాము.

మన తప్పుడు ఆలోచనలు, నమ్మకాలు మరియు సంస్కారాలను వదిలేయాలి. అవి కలిగించే నష్టాన్ని మనం గుర్తించినప్పుడు, మనం వాటిని అంతం చేయగలము. మన సంస్కారాలు, కర్మల ఖాతాలలో వ్యత్యాసం కారణంగా వ్యక్తులు మరియు పరిస్థితులు ఎప్పటికీ మనం అనుకున్నట్లుగా ఉండవని అర్థం చేసుకోవడంతో ఆపేక్షలను కూడా మనం వదిలేస్తాము. వ్యక్తులతో మన గత అనుభవాల బాధను మనం వదిలేయకపోతే, వారితో మన ప్రస్తుత అనుభవాలు ఇబ్బందిగా ఉన్న గతంతో రంగులద్దబడతాయి. కాబట్టి, మనం ప్రతిసారీ వారిని కలిసినప్పుడు, వారి మునుపటి ప్రవర్తన యొక్క ఫిల్టర్ ద్వారా వారిని గ్రహిస్తాము. గత పరిస్థితుల యొక్క ఇబ్బందికరమైన భావోద్వేగాలను పట్టుకోవడం మానసిక గాయాలను తీవ్రతరం చేస్తుంది. విడిచి పెట్టడం అనేది మనల్ని బరువుగా ఉంచుతూ ప్రతిరోజూ బలంగా, భారీగా మారుతున్న ప్రతికూల శక్తుల భారాన్ని కిందికి దింపడం లాంటిది. దానిని వదలడం ద్వారా మనం ఉపయోగకరమైన వాటిని మాత్రమే పట్టుకుని తేలికగా ప్రయాణం చేస్తాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd june2024 soul sustenance telugu

నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలు

నిద్ర మనిషి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. మన శారీరక, ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని అపారంగా ప్రభావితం చేస్తుంది. నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలను చూద్దాం –

Read More »
22nd june2024 soul sustenance telugu

మీ మనస్సు ఒక బిడ్డ వంటిది

మనస్సు మన బిడ్డలాంటిది. మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, మీలో ఉన్న ఈ బిడ్డ  శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దానిని ప్రేమించాలి, పాలన చేయాలి మరియు ఓదార్చాలి. మనుష్యులు తమ మనస్సుపై నియంత్రణ

Read More »
21st june2024 soul sustenance telugu

మనుష్యుల వైబ్రేషన్లను అనుభూతి చెందడం ప్రారంభించండి

మీరు ఎవరినైనా కలిసినప్పుడు, మీ దృష్టి ఎటు వెళుతుంది? ఒకటి: వారి రూపం మరియు వస్త్రాలు పై మీ దృష్టి వెళుతుంది. రెండు: వారి మాటలు మరియు చేతల పై దృష్టి వెళుతుంది. ఇపుడు

Read More »