Hin

23rd sep 2024 soul sustenance telugu

September 23, 2024

స్వభావంలో అందం(పార్ట్ 1)

మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం ఏమిటంటే, మనం కలిసే ప్రతి ఒక్కరినీ ప్రతి దశలో మన ప్రేమ మరియు శుభాకాంక్షలతో కలుసుకోవడం. మంచి స్వభావం గల వ్యక్తి యొక్క లక్షణాలు మరియు మనం అందరికీ ఆనందాన్ని ఇచ్చేవారిలా ఉండాలి అని మనందరికీ తెలుసు. మంచి స్వభావం కలిగిన వ్యక్తులు మిగతా ప్రపంచానికి భిన్నంగా ఉంటారని, అందరికంటే ఉన్నతంగా నిలబడతారని కూడా మనందరికీ తెలుసు. వారు మరింత గౌరవించబడి అందరి ఆశీర్వాదాలను కూడా పొందుతారు. అటువంటి వ్యక్తి చాలా దయగలవాడు, వారు  కలిసే వారందరికీ ఎల్లప్పుడూ శ్రద్ధ మరియు మద్దతు ఇస్తారని మనం తరచుగా చెబుతాము. మీరు ఎప్పుడైనా స్వచ్ఛమైన పాత్ర పోషించాలని ఆలోచించారా? స్వచ్ఛతతో మాట్లాడే మరియు వ్యవహరించే వ్యక్తిని ఉన్నత సంస్కారాలు లేదా అంతర్గత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా చూస్తారని మనందరికీ తెలుసు.

విజయం సాధించిన వ్యక్తి మంచి ప్రవర్తనతో, మంచి స్వభావంతో మంచి వ్యక్తి యొక్క ప్రమాణాలను నెరవేర్చకపోతే శారీరకంగా లేదా భౌతికంగా విజయం సాధించడం వల్ల ఉపయోగం ఏమిటి?  అటువంటి వ్యక్తి భౌతిక సంపద, కీర్తి మరియు విజయానికి గుర్తింపు పొందవచ్చు. కానీ అతను లేదా ఆమె అందరి హృదయాలను మరియు ఆశీర్వాదాలను గెలుచుకుంటారా? ఎందుకంటే మీరు ఒక వ్యక్తిగా ప్రేమించబడితే, గౌరవించబడితే తప్ప, బాహ్యంగా విజయం సాదించలేకపోతే, మీరు ఎప్పటికీ అంతర్గత ఆనందాన్ని, సంతృప్తిని అనుభవించలేరు. అన్నింటికంటే తరచుగా, హృదయాలను గెలుచుకున్నవాడు ధన్యుడు…. అని చెప్పబడుతుంది కదా? మరోవైపు, ప్రశంసలు పొందినప్పటికీ ప్రేమను పొందని వ్యక్తి ఆశీర్వాదాల బహుమతిని పొందడు మరియు ఎల్లప్పుడూ అసంతృప్తిగా మరియు నిరాశగా ఉంటాడు. కాబట్టి ప్రేమలో పైకి ఎగరడానికి, అందమైన అంతర్గత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి, సానుకూల వ్యక్తిగా ఉండి, ప్రతి ఒక్కరికీ సద్గుణాలను బహుమతిగా ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉండండి. మీకు నచ్చని లేదా మీరు అంటే నచ్చని ఒక్క వ్యక్తిని కూడా ఉండనివ్వకండి. 

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »