Hin

13th feb 2025 soul sustenance telugu

February 13, 2025

స్వీయ నియంత్రణ కళలో ప్రావీణ్యం పొందటం

మనమందరం బాగా జీవించడానికి మన జీవితాలపై నియంత్రణ కలిగి ఉండాలని కోరుకుంటాము. మన మనస్సు, బుద్ధి మరియు స్వభావాన్ని నియంత్రించడం మన శక్తి. అది మన భౌతిక ఇంద్రియాలను కూడా ఆటోమేటిక్ గా నియంత్రిస్తుంది. మనం మన స్వంత నైతిక విధానాలను జాగ్రత్తగా చూసుకుంటున్నందున, సమాజం ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనే వాటిలో చిక్కుకోము. ఒకసారి మనం స్వయాన్ని బాగా సంభాళించుకున్నట్లైతే, మనం ఇతరులను సరైన మార్గంలో సంభాళిస్తాము. మనం ఎక్కువగా కోరుకునే అన్ని విషయాలలో, స్వీయ నియంత్రణ పైన ఉండాలి. ఇది మన ఆలోచనా విధానాలను, స్వయాన్ని మరియు ప్రవర్తనను నియంత్రించే మన సామర్థ్యాన్ని సూచిస్తుంది. స్వీయ నియంత్రణను పాటించడం సాధ్యమే అనిపించినప్పటికీ, మనం ప్రలోభానికి గురై భిన్నంగా వ్యవహరించడానికి లొంగిపోయే సందర్భాలు ఉన్నాయి.

 

స్వీయ నియంత్రణ మరియు శ్రేయస్సును అనుభవం చేసుకోవటానికి ఈ విధానాలను అనుసరించండి:

 

  1. స్వీయ నియంత్రణ అనేది జీవితంలోని సాధారణ సంఘటనల్లో పాటించడంతో మీరు పెంపొందించుకోగల బలం.

 

  1. ధ్యానం చేసేటప్పుడు, మీ ఆలోచనలను గమనించండి. ఇది మీ మనస్సును నియంత్రించడానికి మరియు దానితో ఒక అందమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది.

 

  1. ఆటోమేటిక్ గా, అలవాటుగా చేసే ప్రతిచర్యలకు బదులుగా, ప్రతి పరిస్థితిలో శక్తివంతమైన మరియు సరైన ప్రతిస్పందనను ఎంచుకోండి. ఎంపికలను కలిగి ఉండటం, ఎంపికలు చేయడం గురించి అవగాహన స్వీయ నియంత్రణను పెంచుతుంది.

 

  1. మీ విలువలు, ఆదర్శాలకు కట్టుబడి ఉండండి. ప్రతి ఒక్కరితో మరియు ప్రతి పరిస్థితిలో నిర్భయంగా వాటిని ఉపయోగించండి. ఉదాహరణకు, మీ తప్పును అంగీకరించి, అది తీవ్రమైన పరిణామాలను కలిగించినప్పటికీ క్షమాపణ చెప్పండి. అదేవిధంగా, రోడ్డు మీద మీరు ఒక్కరే ఉన్నా కూడా ట్రాఫిక్ నియమాలను పాటించండి.

 

  1. మీరు చదివే, చూసే, వినే మరియు మాట్లాడే ప్రతిదానిలో స్వచ్ఛతను ఎంచుకోండి. ప్రలోభాలకు లొంగిపోకుండా, సరైన ఆహార పానీయాల నియమాలను అనుసరించండి. ఇతరుల ఆమోదం కొరకు వేచి చూడకుండా మీకు సరైనది మరియు ఆరోగ్యకరమైనది చేయండి.

 

మీ జీవితంపై నియంత్రణను తిరిగి పొందడానికి ఈ ధృవీకరణను 3 సార్లు రిపీట్ చేయండి. మీ మనస్సు సూచనలను ఎలా పాటిస్తుందో, మీ శరీరం మీ లక్ష్యాలకు ఎలా సహాయ పడుతుందో గమనించండి. స్వీయ నియంత్రణ కళను నేర్చుకోండి:

 

నేను ఒక శక్తివంతమైన వ్యక్తిని… నా ప్రతి ఆలోచనకు, మాటకు, ప్రవర్తనకు నేనే సృష్టికర్త. నేను నా మనస్సును సరైన రీతిలో ఉపయోగిస్తాను. పరిస్థితులు నా ప్రకారంగా కాకపోవచ్చు… నా మనస్సు ఎల్లప్పుడూ నాకు నచ్చే విధంగా ఉంటుంది. ఎక్కడ దృష్టి పెట్టాలో, ఏమి చూడాలో, ఏమి వినాలో, ఏమి మాట్లాడాలో నేను ఎంచుకుంటాను. నేను ప్రతి ఒక్కరిలో మంచితనాన్ని చూస్తాను. ప్రజాభిప్రాయం నన్ను తాకలేదు… నేను క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతున్నాను. నేను నా మనసుకు యజమానిని… నేను నా శరీరానికి యజమానిని.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »