Hin

25th-oct-2023-soul-sustenance-telugu

October 25, 2023

స్వీయ సందేహం మరియు అభద్రతలను అధిగమించడం

మన ఆనందాన్ని క్షీణింపజేసి, మనకు నిరాశ కలిగించే ఒక భావోద్వేగం – అభద్రత. మన గురించి, మన సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థికం లేదా కెరీర్‌ల గురించి అసురక్షితంగా ఉండటం మన జీవనశైలిలోని ప్రతి అంశాన్ని దెబ్బతీస్తుంది. మనకు వచ్చే అభద్రత భావాలు కొన్ని నిజమై ఉండవచ్చు, మరికొన్ని మన ఊహ అయి ఉండవచ్చు. ఏది ఏమైనా, అభద్రతా భావాలను అధిగమించాలంటే మన సమర్థత ఏమిటో మనం తెలుసుకోవాలి, మనం ఏమిటో యథార్థంగా అర్థం చేసుకోవాలి. ప్రతి అడుగులో మీరు మీపై నమ్మకంతో ఉంటే మీరు సంతోషాన్ని మరియు ఆరోగ్యాన్ని పొందుతారు. గత వైఫల్యాలను మరియు లోపాలను పదే పదే పరిగణలోకి తీసుకోవడం మానేస్తే మీరు ఎంచుకున్న సుందరమైన విధిని తయారు చేసుకోవడానికి మీరు ముందుకు చూసి నడుస్తారు.   

మీ ఆరోగ్యం, బంధం, కెరీర్, ఆర్థికం లేదా జీవితం వంటి విషయాలలో మీరు అసురక్షితంగా భావిస్తున్నారా? స్వీయ సందేహాలతో మీ మనస్సు ఎప్పటికప్పుడు బెదిరిపోతూ ఉందా? ఏదీ తగినంత మంచిగా లేదు అనిపిస్తుందా? చూస్తుంటే, ఈరోజు అందరినీ ఈ అభద్రతా భావం తన గుప్పెట్లో పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందో కూడా మనకు అర్థం కావడం లేదు. మన చుట్టూ ఉన్న వాతావరణం లేక మీడియా నుండి వచ్చే సమాచారమే ఈ అభద్రతా భావానికి మూలం అవుతుంది. ఎందులోనైనా అభద్రతా భావంగా అనిపిస్తే మనల్ని, ఇతరులను, పరిస్థితులను దేనినీ నమ్మలేని పరిస్థితి కలుగుతుంది. దీర్ఘకాలిక నెగిటివ్ చర్చలకు మన మనసులో స్థానమివ్వకూడదు. అలా చేస్తే అభద్రతగా ఫీల్ అవ్వడం మన వ్యక్తిత్వంగా మారిపోతుంది. మనలో వచ్చే తప్పుడు ఆలోచనలు అంటే భయం, అనుమానం లేక ఆందోళన వంటి వాటి ద్వారా అభద్రత వస్తుంది. నమ్మకము, పాజిటివిటీ, ఆత్మ విశ్వాసము మరియు సానుకూల ఆలోచనలతో అభద్రతను సమాప్తం చేయవచ్చు. శ్రద్ధతో మీ మనసును పవిత్రమైన, పాజిటివ్ స్వీయ చర్చలో ఉంచండి. మీ చుట్టూ కూడా పాజిటివ్, ఆశావాద వాతావరణం ఉండేలా చూసుకోండి. నేను సురక్షితంగా మరియు భద్రంగా ఉన్నాను. నా జీవితం చక్కగా ఉంది. నాకు కావలసినదంతా నా వద్ద ఉంది అన్న ఆలోచనలను రోజూ మీకు మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

10th sep 2024 soul sustenance telugu

5 రకాల ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోండి

జీవించే కళ  ప్రధానంగా 5 రకాల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది: శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం. పరస్పరం అనుసంధానించబడి ఉండటం వలన, ఇవన్నీ మన

Read More »
9th sep 2024 soul sustenance telugu

గందరగోళం కాకుండా స్పష్టత కలిగి ఉండండి

శాంతి మరియు స్థిరత్వంతో కూడిన జీవితాన్ని గడపడానికి స్పష్టత కలిగి ఉండటం కీలకం. కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలి లేదా ఏ దిశలో అడుగు పెట్టాలి అని మనం తరచుగా ఆలోచిస్తూ ఉంటాము.

Read More »
8th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 2)

శ్రీ గణేషుని పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. వ్యక్తుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేషుని చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం చూపిస్తారు,

Read More »