Hin

13th May 2025 Soul Sustenance Telugu

May 13, 2025

తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి

మనలో చాలా మంది మనది వినాలని లేదా మనమంటే ఆసక్తికరంగా అనిపించాలని అందరితో మాట్లాడుతూ ఉండాలి అని భావిస్తాము. ఈ ఆత్రుత మనల్ని ఎక్కువగా ఆలోచించేలా, ఎక్కువగా మాట్లాడేలా చేస్తుంది. కాబట్టి మనం పదాలను స్పష్టంగా పలికేందుకు సమయం తీసుకోము, అవసరమైన దానికంటే ఎక్కువ పదాలను ఉపయోగిస్తాము మరియు ప్రత్యేకమైనది చెప్పడానికి గట్టిగా మాట్లాడుతాము. మనకు చాలా వివేకం ఉన్నప్పటికీ, మనం మాట్లాడే విధానం వినేవారికి చికాకుపెడుతుంది, వారు మనపై శ్రద్ధ చూపడం మానేస్తారు.

  1. ఏ సంభాషణ అయినా, మీరు మీ వేగం, మీ పదాల ఎంపిక మరియు మీ టోన్ పై శ్రద్ధ పెడతారా? మీరు కొన్నిసార్లు ఏదో మాట్లాడాలని అందరితో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందా? మీరు మీ ఆలోచనలను ఆర్గనైజ్ చేసుకోకుండా మాట్లాడి, తరువాత మీరు దానిని చాలా బాగా చెప్పగలరని గ్రహించారా?
  2. రోజంతా మనం నిరంతరం 2 శక్తులను సృష్టించి ప్రసరింపజేస్తాము: ఆలోచనా శక్తి అది మళ్ళి వాక్కు శక్తిగా వస్తుంది. కాబట్టి, మనకు చాలా ఆలోచనలు ఉంటే, మనం ఎక్కువగా మాట్లాడతాము. తొందరపాటు మన పదాలను జాగ్రత్తగా ఎంచుకోవడానికి లేదా ఆహ్లాదకరంగా మాట్లాడటానికి మనకి అవకాశం ఇవ్వదు. 
  3. మన మాటలు ప్రభావితంగా, పరివర్తన తీసుకురాగలిగేలా ఉండాలంటే, అవి తక్కువగా ఉండాలి మరియు ఉన్నత-శక్తి గల వైబ్రేషన్లతో ఉండాలి. మనం ఇలా చేసినప్పుడు, మనం సహజంగా మంచిగా మాట్లాడతాము, తక్కువ మాట్లాడతాము మరియు మధురంగా మాట్లాడతాము. మనము ఇతరులను ఆకట్టుకోవడమే కాకుండా సంభాషణను ప్రభావితం చేస్తాము.

4. మన మాటలు మన వైబ్రేషన్లను, పరిస్థితి మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తుల వైబ్రేషన్లను ఉన్నతంగా చేసేవిలా ఉండాలి. మనకు మనమే గుర్తు చేసుకుందాము – నేను నా పరిపూర్ణ ప్రపంచాన్ని సృష్టించే పదాలను ఎంచుకుంటాను. నేను సరైన పద్ధతిలో సరైనది మాత్రమే మాట్లాడతాను మరియు ఉన్నతమైన వైబ్రేషన్లను ప్రసరింపజేస్తాను.

రికార్డు

15th June 2025 Soul Sustenance Telugu

వ్యక్తులు మీపై ఆధారపడేలా చేయవద్దు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొంతమందికి లేదా కొన్ని పరిస్థితులకు మనమే ఎంతో ముఖ్యమని, మనం లేకుండా వారు జీవితాన్ని గడపలేరనే నమ్మకంతో మనం తరచుగా జీవిస్తుంటాము.

Read More »
14th June 2025 Soul Sustenance Telugu

భగవంతుడు – ఈ సృష్టి యొక్క ఆది బిందువు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు సర్వ శక్తివంతుడు. వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో  మంచితనం మరియు దైవత్వం క్షీణించిన ప్రతిసారీ

Read More »
13th June 2025 Soul Sustenance Telugu

మిమ్మల్ని మీరు ఎలా ఆశీర్వదించుకోవాలి?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో సాధువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదాల శక్తిని మనమందరం పొందాము. ఆశీర్వాదం అంటే వారందరూ మన

Read More »