Hin

18th-oct-2023-soul-sustenance-telugu

October 18, 2023

తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి

మనలో చాలా మంది మనది వినాలని లేదా మనమంటే ఆసక్తికరంగా అనిపించాలని అందరితో మాట్లాడుతూ ఉండాలి అని భావిస్తాము. ఈ ఆత్రుత మనల్ని ఎక్కువగా ఆలోచించేలా, ఎక్కువగా మాట్లాడేలా చేస్తుంది. కాబట్టి మనము పదాలను స్పష్టంగా పలికేందుకు సమయం తీసుకోము, అవసరమైన దానికంటే ఎక్కువ పదాలను ఉపయోగిస్తాము మరియు ప్రత్యేకమైనది చెప్పడానికి గట్టిగా మాట్లాడుతాము. మనకు చాలా వివేకం ఉన్నప్పటికీ, మనం మాట్లాడే విధానం వినేవారికి చికాకుపెడుతుంది, వారు మనపై శ్రద్ధ చూపడం మానేస్తారు.

  1. ఏ సంభాషణ అయినా, మీరు మీ వేగం, మీ పదాల ఎంపిక మరియు మీ టోన్ పై శ్రద్ధ పెడతారా? మీరు కొన్నిసార్లు ఏదో మాట్లాడాలని అందరితో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందా? మీరు మీ ఆలోచనలను ఆర్గనైజ్ చేసుకోకుండా మాట్లాడి, తరువాత మీరు దానిని చాలా బాగా చెప్పగలరని గ్రహించారా?
  2. రోజంతా మనం నిరంతరం 2 శక్తులను సృష్టించి ప్రసరింపజేస్తాము: ఆలోచనా శక్తి అది మళ్ళి వాక్కు శక్తిగా వస్తుంది. కాబట్టి, మనకు చాలా ఆలోచనలు ఉంటే, మనం ఎక్కువగా మాట్లాడతాము. తొందరపాటు మన పదాలను జాగ్రత్తగా ఎంచుకోవడానికి లేదా ఆహ్లాదకరంగా మాట్లాడటానికి మనకి అవకాశం ఇవ్వదు.
  3. మన పదాలు ప్రభావితంగా, పరివర్తన తీసుకురాగలిగేలా ఉండాలంటే, అవి తక్కువగా ఉండాలి మరియు ఉన్నత-శక్తి గల వైబ్రేషన్స్ తో ఉండాలి. మనం ఇలా చేసినప్పుడు, మనం సహజంగా మంచిగా మాట్లాడతాము, తక్కువ మాట్లాడతాము మరియు మధురంగా మాట్లాడతాము. మనము ఇతరులను ఆకట్టుకోవడమే కాకుండా సంభాషణను ప్రభావితం చేస్తాము.
  4. మన మాటలు మన వైబ్రేషన్స్ ను, పరిస్థితి మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తుల వైబ్రేషన్స్ ను ఉన్నతంగా చేసేవిలా ఉండాలి. మనకు మనమే గుర్తు చేసుకుందాము – నేను నా పరిపూర్ణ ప్రపంచాన్ని సృష్టించే పదాలను ఎంచుకుంటాను. నేను సరైన పద్ధతిలో సరైనది మాత్రమే మాట్లాడతాను మరియు ఉన్నతమైన వైబ్రేషన్స్ ను ప్రసరింపజేస్తాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

12th sep 2024 soul sustenance telugu

మీ జీవితంలో భగవంతుని  జ్ఞానాన్ని తీసుకురావడానికి 5 మార్గాలు

ప్రతిరోజూ మీ మనస్సులో భగవంతుని జ్ఞానంపై దృష్టి పెట్టండి – ప్రతిరోజూ భగవంతుడు మనతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకుంటారు. దానిని చదివి మనం మన డైరీలు మరియు హృదయాలలో నోట్ చేసుకుంటాము. వ్రాసుకున్న తరువాత,

Read More »
11th sep 2024 soul sustenance telugu

సోషల్ మీడియాలో పనిలేని కబుర్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి

వ్యక్తుల  ప్రవర్తన లేదా జీవిత సమస్యల గురించి ప్రతికూల భావంతో మాట్లాడకూడదని, తీర్పు చెప్పేలా, విమర్శనాత్మకంగా లేదా వారి బలహీనతను పేర్కొనకూడదని మనం అభ్యాసం చేస్తాము. అలాగే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చదివే

Read More »
10th sep 2024 soul sustenance telugu

5 రకాల ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోండి

జీవించే కళ  ప్రధానంగా 5 రకాల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది: శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం. పరస్పరం అనుసంధానించబడి ఉండటం వలన, ఇవన్నీ మన

Read More »