Hin

18th-sept-2023-soul-sustenance-telugu

September 18, 2023

తక్కువ మరియు నెమ్మదిగా తినడం

మనం ఎప్పుడు, ఏమి మరియు ఎంత తినాలి  అనే విషయాలపై శ్రద్ధ పెట్టడం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. అయినప్పటికీ, మనం తరచుగా ఫోన్‌లో స్క్రోల్ చేస్తూ,  ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ  లేదా టి వి చూస్తూ , ఆకలి లేనప్పుడు కూడా ఆహారం తీసుకోవడం వంటివి చేస్తాము. మన శరీరపు అంతర్గత మెకానిజం మన ఆహారపు అలవాట్లను గైడ్  చేస్తుంది, కానీ పరధ్యానంగా తినడం ఆ సంకేతాలను పట్టించుకోనివ్వకుండా మనల్ని బలవంతం చేస్తుంది తద్వారా మనం అతిగా తింటాం.  

సరియైన పద్ధతిలో తినడం మరియు ప్రతి భోజనాన్ని ఆస్వాదించడం యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసు. అయినప్పటికీ, భోజన సమయం మీకు ఎంత పవిత్రమైనది? మీ షెడ్యూల్ మిమల్ని మనస్పూర్తిగా తినడానికి అనుమతిస్తుందా? మీరు అతిగా తినడం లేదా మనసు పెట్టకుండా తినడం వంటివి చేస్తుంటారా? భోజన సమయం ఒక పవిత్రమైన ఆచారంగా ఉండాలి, కానీ నేడు మనలో చాలా మంది మనసు పెట్టకుండా పరధ్యానంగా తింటాము. దాని వలన  మనం తినే అనుభూతి, ఆలోచనలు లేదా భావాలను దూరం చేసుకుంటున్నాము. ఇది అతిగా తినడానికి కూడా దారి తీస్తోంది. ఈ విధంగా తినే ఆహారం మనకు అవసరమైన విధంగా పోషణ కాకుండా మనకు హాని చేస్తుంది. వ్యసనాలు, ఒత్తిళ్లు, ప్రలోభాలు లేదా భావోద్వేగ అవసరాల నుండి బయటపడడానికి తినడం అనేది సరి కాదు. మనం మనస్పూర్తిగా తినడం సాధన చేద్దాం – ఎప్పుడు మరియు ఎంత తినాలి అని మన శరీర సంకేతాలను విందాం. ఒకసారి మనం మన ఆకలి మరియు నిండుతనం యొక్క సంకేతాలపై శ్రద్ధ వహిస్తే, అతిగా తినడం నివారించడం సులభం అవుతుంది. మీ స్వంత ఆరోగ్యకరమైన ఆహారపు విధానాలను తయారుచేసుకొని వాటికి అన్ని సమయాలలో కట్టుబడి ఉండండి. నేను ప్రతి ముద్ద పై  దృష్టి పెడతాను,  నేను ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారం తీసుకుంటాను, నేను అతిగా తినను అని మీకు మీరే గుర్తు చేసుకోండి. 

సరైన పరిమాణంలో తినడానికి కట్టుబడి ఉండండి– ఆకలితో ఉండడం లేదా అతిగా తినడం చేయకండి . మీరు మీ శరీర సంకేతాలను విన్నప్పుడు, శరీరానికి ఎంత ఆహారం అవసరమో అంతే తీసుకుంటారు. ఆరోగ్యం మరియు శ్రేయస్సును నిర్ధారించడంలో ఇది ఒక పెద్ద అడుగు. అసలైన ఆకలితో కాకుండా ఇతర కారణాల వల్ల నేను ఆహారం తీసుకోను అని మీకు మీరు గుర్తు చేసుకోండి. నేను నా శరీర సంకేతాలను వింటాను – నాకు ఆకలిగా ఉన్నప్పుడు తింటాను మరియు నిండిన క్షణం ఆపేస్తాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 2)

పరీక్షల సమయంలో  లేదా జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కొంటున్నప్పుడు స్థిరంగా ఉండటానికి చాలా ముఖ్యమైన మార్గం అంతర్గత శాంతి, శక్తి , స్థిరత్వంతో నిండిన కొన్ని సానుకూల ఆలోచనలను చేస్తూ రోజులో కొన్ని సార్లు

Read More »
21st jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 1)

మనమందరం మన ముందు ఎల్లప్పుడూ వివిధ రకాల సవాళ్లతో మన జీవితాలను గడుపుతాము. మనమందరం ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సవాళ్లలో లేదా మన పిల్లలు ఎదుర్కొనే అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటి పాఠశాల

Read More »
20th jan 2025 soul sustenance telugu

మీ సంకల్పశక్తి మీకు అతిపెద్ద బలం

మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలనుకున్నా, వ్యసనాన్ని వదులుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించాలనుకున్నా, విజయం లేదా వైఫల్యాన్ని మన సంకల్ప శక్తికి ఆపాదించుకుంటాము. కొన్నిసార్లు మనం అత్యధిక సంకల్ప

Read More »