Hin

27th july 2024 soul sustenance telugu

July 27, 2024

తప్పు-ఒప్పులను వివేకంతో పరిశీలించడం

నేటి కాలంలో వస్తువులకు విలువను ఇవ్వడం, వాటిని సొంతం చేసుకోవటం మంచిదని మరియు సాధారణమేనని భావిస్తారు. దానిని భద్రతగా పరిగణిస్తారు. కానీ, నిజాయితీగల ఉద్దేశాలు, గౌరవప్రదమైన చర్యల వల్ల మాత్రమే భద్రత లభిస్తుందని సమయం తెలుపుతుంది. కోరిక, భయం మనల్ని నిజమైన ఆనందానికి ఎన్నటికీ దారితీయని నమ్మకాలను అవలంబించేలా చేస్తాయి.

పరిశీలనా శక్తి అనేది తప్పు-ఒప్పు మరియు సత్య-అసత్యాల మధ్య విచక్షణ కలిగి ఉండే సామర్థ్యం. మన సంస్కారాలు, నమ్మకాలు మరియు ప్రవర్తనను పరిశీలించుకోవటానికి ఈ సామర్థ్యాన్ని ఉపయోగించవచ్చు. మనల్ని మనం పరిశీలించుకోగలిగినప్పుడు, ఇతర వ్యక్తులను మరియు పరిస్థితులను పరిశీలించే సామర్థ్యాన్ని ఉపయోగించుకోగలుగుతాము. మనలో చాలా మందికి,  మన విచక్షణ అనేది మనకు లభించే సమాచారం లేదా ఇతరుల అభిప్రాయాలు లేదా సమాజంలోని నమ్మకాల ఆధారంగా ఉంటుంది. మరొక సాధారణ పద్ధతి ఏమిటంటే, అర్థం చేసుకోవడానికి తర్కాన్ని వర్తింపజేయడం. కానీ తర్కం ఎల్లప్పుడూ సరైనది కాదని మనకు అనుభవం అవుతూ ఉంటుంది.

మనం తప్పుకొని, ఆంతరిక నిశ్శబ్దాన్ని అనుభవం చేసుకున్నప్పుడు, మనం పరిశీలించుకోవటానికి  ఉప-చేతన మనస్సుతో కనెక్ట్ కావచ్చు. జీవితంలోని విభిన్న పరిస్థితులలో, మనం ఉండే మరియు ఆలోచించే విధానాలపై తప్పుడు నమ్మకాల వల్ల తలెత్తే వ్యతిరేక అభిప్రాయాలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా, మన అత్యున్నత, స్వచ్ఛమైన స్వయాన్ని విశ్వసించడమే పరిశీలించుకోగలిగే సామర్థ్యం. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి – నేను సరిగ్గా ఆలోచిస్తున్నానా… నా కర్మ ఫలితం ఏమిటి… అది ఆత్మ శక్తిని పెంచుతుందా? మనం తరచుగా ఇతరుల ప్రవర్తన గురించి తీర్పు చెప్తూ లేదా విమర్శనాత్మకంగా ఉంటాము. పరిశీలన శక్తి వారి ఉద్దేశాలను మరియు ఆ ప్రవర్తనను ప్రేరేపించిన సంస్కారాలను విశ్లేషించేలా చేస్తుంది. ఇది వారిని అర్థం చేసుకొని, మన ఆంతరిక శాంతితో ప్రతిస్పందించడానికి మరియు వారి ప్రతికూలతకు స్పందించకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఈ సామర్థ్యం మనం ప్రశాంతంగా ఉండటానికి, ఇతరులు అలా లేనప్పటికీ సరైన ప్రతిస్పందనను ఎంచుకోవడానికి సహాయపడుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »
13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »