Hin

9th dec 2023 soul sustenance telugu

December 9, 2023

టీం మీటింగ్స్ లో ఎలా భాగం కావాలి

టీం మీటింగ్ ఒక ఉమ్మడి లక్ష్యం కోసం పని చేయడానికి, నేర్చుకోవడానికి, అభిప్రాయాలు పంచుకొని భాగస్వామ్యం కావడానికి అవకాశాన్ని అందిస్తుంది. తరచుగా, మనం మన అహం మరియు అసహనాన్ని మనతో పాటు మీటింగ్ కు తీసుకువెళతాము. అప్పుడు చర్చ వాదనగా మారుతుంది.

  1. టీం మీటింగ్ లు మీరు మీ పని లేదా వ్యక్తిగత జీవితంలో ఉపయోగించగల కొత్త విషయాలను పంచుకోవడానికి మరియు తెలుసుకోవడానికి ఒక అవకాశం. ఇతరులతో కనెక్ట్ అయ్యే సమయం కూడా.
  2. మీరు మీటింగ్ ప్లాన్ చేసుకున్న రోజున, మీరు చేయవలసిన పనులు అమలు చేస్తున్నప్పుడు మీ మనస్సు మీటింగ్‌లో ఎలా ఉండాలో అలా సిద్ధం చేసుకోవడం కోసం ఉదయమే మెడిటేషన్ చేయండి. మీ టీం తో మీటింగ్‌లో మిమ్మల్ని మీరు ఓపికగా వింటునట్లుగా, మీ అభిప్రాయాలను గౌరవపూర్వకంగా చెప్తునట్లుగా, మంచి కోసం నిలబడుతున్నట్లుగా, ఇతరులకు సరిగ్గా ఆలోచించడానికి మీ సంకల్పాలతో వారిని సాధికారపరుస్తునట్లుగా విజువలైజ్ చేసుకోండి.
  3. మీటింగ్‌లో వ్యక్తులను అంగీకరించడం అంటే ఎవరినైనా ఏదైనా చేయడానికి మీరు అనుమతించినట్లు కాదు. మీరు మీ విలువల ఆధారంగా మీ మంచి ఉద్దేశాలను కలవరపడకుండా ప్రసరింపజేయడం అని అర్థం. సరైన వైఖరిని కలిగి ఉండటం ద్వారా మీరు ఇతరులను వారి ఉత్తమమైన వాటిని బయటకు తీసుకురావడానికి ప్రేరేపిస్తారు.

 

  1. మీటింగ్‌లో మీకు మంచి ఆలోచన ఉండవచ్చు కానీ ఇతరుల మాటలు వింటున్నప్పుడు మీ ఆలోచన నుండి వేరు అవ్వండి. అవసరమైతే మీ అభిప్రాయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీటింగ్ యొక్క లక్ష్యానికి ప్రయోజనం చేకూరడము మాత్రమే మన ఉద్దేశ్యంగా ఉండాలి. మన ఉద్దేశ్యం ఇతరులను మెప్పించడం లేదా సంతోషపెట్టడం కాకూడదు. ఇతరులు తిరస్కరించినందున మీ ఆలోచనను అనుమానించకండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

14th november 2024 soul sustenance telugu

సంబంధాలలో విభేదాలను ఎలా పరిష్కరించాలి? (పార్ట్ 1)

సంబంధాలలో, కొన్నిసార్లు అవతలి వ్యక్తి సమస్య మాత్రమే కాదు, సంఘర్షణలకు మూలం కూడా అని మనం భావిస్తాము. సంఘర్షణ జరగాలంటే ఎల్లప్పుడూ ఇద్దరు వ్యక్తులు పాల్గొనాలని మనం తెలుసుకోవాలి. మనం ఏదైనా సంఘర్షణలో ఉన్నప్పుడు,

Read More »
13th november 2024 soul sustenance telugu

భగవంతుని ప్రేమ అనే రెక్కలతో ఎగరటం

మన జీవితంలో ప్రతిరోజూ భగవంతుడిని అనుభవం చేసుకుంటాము. అడ్డంకుల ప్రభావం నుండి దూరంగా ఉంటూ మన జీవితాలను అందంగా ఎలా గడపాలో చూపించినందుకు ప్రతి దశలో మనం వారిని గుర్తుచేసుకుంటాము,  వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము.

Read More »
12th november 2024 soul sustenance telugu

ప్రశంసలలో స్థిరంగా ఉండటం

మన విశేషతలు వాలనో లేదా  మనం సాధించిన విజయానికో ఇతరులు మనల్ని మెచ్చుకున్నప్పుడు, వారు మన గురించి చెప్పేది నిజానికి మన గురించి కాదు. మనలో మంచితనాన్ని చూడగలిగే వారి సుగుణాన్ని వారు కనబరుస్తారు.

Read More »