Hin

27th jan 2025 soul sustenance telugu

January 27, 2025

తొందరపడకుండా ఉండటానికి 5 చిట్కాలు

  1. కష్టమైన పరిస్థితి ఉన్నప్పుడు విరామం పాటించండి – ప్రతికూల పరిస్థితులకు ఒక సాధారణ ప్రతిస్పందన ఏమిటంటే వెంటనే ఎక్కువ  ఆలోచించడం. అది చర్యలలో హడావిడిని సృష్టిస్తుంది. మీరు ఏమి చేస్తున్నారో ఆపి, ఆ సమయంలో శాంతి, సానుకూలత మరియు శక్తి యొక్క కొన్ని ఆలోచనలను సృష్టించండి, ఇది ఆలోచనలను మందగించడానికి, ఆలోచనలపై దృష్టి కేంద్రీకరించడానికి మరియు హడావిడి నుండి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.

 

  1. ధ్యానం మరియు మౌనంతో మీ రోజును ప్రారంభించండి – రోజంతా మీ ఆలోచనలను మందగించడానికి ఉత్తమ మార్గం శాంతి సాగరుడైన భగవంతునితో లోతైన సంబంధంతో మీ రోజును ప్రారంభించడం. ఉదయం మన మనస్సు చాలా తాజాగా ఉంటుంది, ఆ సమయంలో ధ్యానంతో మౌనం పాటిస్తే, మీ రోజంతా దాని వల్ల ప్రభావితమవుతుంది మరియు మనం తక్కువ తొందరపడి ఎక్కువ పని చేస్తాము.

 

  1. లోతుగా ఆలోచించుకొని మీ మనస్సులో మీ సమయాన్ని పునర్వ్యవస్థీకరించండి – అకస్మాత్తుగా మన ముందు మన నుండి ఎక్కువ ఆశించే ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం తొందరపడతాము, అప్పుడు మనం దానికి అలవాటుపడతాము. అటువంటి సమయాల్లో, చాలా తక్కువ సమయం ఉందని భావించి తొందరపడతాము. బదులుగా మనం లోలోపలికి వెళ్లి, సరళంగా ఉంటూ సమయాన్ని పొడిగించాలి, ఆపై మన సాధారణ పనులు కాకుండా కొత్త సమయ ప్రణాళిక చేసి మళ్లీ మన పనిని ప్రారంభించాలి. ఇది మన హడావిడిని తగ్గిస్తుంది.

 

  1. కొన్ని క్షణాల పాటు మీతో భగవంతుడిని అనుభవం చేసుకొని వారి మార్గదర్శకత్వం తీసుకోండి – కొన్నిసార్లు, మనం పనిలో ఉన్నప్పుడు లేదా మన కుటుంబాలలో ఉన్నప్పుడు, చేయవలసినవి చాలా ఉన్నప్పుడు, అనేక అసంపూర్తి పనులు మరియు సమయ గడువులు ఉన్నప్పుడు, మీ మనస్సు, బుద్ధిని భగవంతునితో అనుసంధానించి వారి మార్గదర్శకత్వం తీసుకోవడం మంచిది, ఇది మనల్ని స్థిరంగా ఉంచి హడావిడి నుండి విముక్తి చేస్తుంది. ఇది మన మనస్సును మరింత వ్యవస్థీకృతంగా మరియు సమర్థవంతంగా చేస్తుంది.

 

  1. అవసరమైనది మాత్రమే చదవండి మరియు వినండి – మన ఆలోచనలు అన్ని సమయాలలో ఎక్కువగా ఉండటానికి, మనం అలసిపోవడానికి మరియు తొందరపడటానికి ఒక కారణం ఏమిటంటే, మన రోజును వార్తాపత్రిక లేదా టెలివిజన్ తో ప్రారంభించి, రోజంతా ఇతరులు ఏమి చేస్తున్నారనే దాని గురించి చాలా ఆలోచిస్తాము, చర్చిస్తాము, ఇది అసలు అవసరం లేదు. మనం దీనిని నివారిస్తూ మరింత సానుకూలంగా మరియు పొదుపుగా చదవాలి, మాట్లాడాలి మరియు వినాలి.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »