Hin

22nd-sept-2023-soul-sustenance-telugu

September 22, 2023

ట్రాఫిక్ జామ్ – రోడ్డుపైనా లేక మనసులోనా?

మనలో చాలా మందికి, ట్రాఫిక్ రద్దీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో  జాప్యం, ఫ్లైట్ మిస్ అవ్వటం లేదా క్యూలలో వేచి ఉండటం నిరాశ, ఒత్తిడి మరియు ఆందోళనకు మూలాలు. ఇవి రొటీన్ కావచ్చు, కావున మనం ప్రతిరోజూ ఎలా స్పందిస్తామో మన పూర్తి మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఎవరిధైనా డ్రైవింగ్ సరిగా లేక పోయినా లేదా తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అయినా, ఆ క్షణాన్ని స్థిరత్వంతో స్వీకరించి, నెగిటివ్ ఆలోచనల ప్రవాహాన్ని శ్రద్ధగా ఆపుకుందాం. లేదంటే  దశాబ్దాల పాటు ప్రయాణంలో ప్రతి రోజు మనం 20 నిమిషాల్లో 1,000 తప్పుడు ఆలోచనలను సృష్టించవచ్చు .  ట్రాఫిక్ మన  నియంత్రణలో ఉండదు మరియు కేవలం మనము మాత్రమే లేము. కలత చెందడం వల్ల అది వేగంగా జరగదు. మన ప్రయాణాన్ని రీ-షెడ్యూల్ లేదా రీ-రూట్ చేసుకుందాము. లేదా ఎవరికైనా కాల్ చేయడానికి లేదా టెక్స్ట్ చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రించడానికి లేదా సంగీతం వినడానికి సమయాన్ని ఉపయోగించుకుందాం. ట్రాఫిక్ వద్ద ప్రారంభమయ్యే నిరాశ సాధారణంగా రోజులోని తదుపరి కార్యాలలో చేరుకుంటుంది. మన పాడైన మూడ్ కొనసాగుతుంది, వ్యక్తులతో మరియు మన పనిలో ప్రతిబింబిస్తుంది. 

వ్యక్తిగతంగా మరియు సమాజికంగా మనమందరికీ  తక్కువ సమయంలో ఎక్కువ సాధించడానికి వేగం ముఖ్యమని బోధించారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ జీవితాన్ని ఒక సరి అయిన వేగంతో సాగనివ్వము. మనం అనుకున్నట్లుగా లేని వ్యక్తుల పట్ల మనకు ఓపిక ఉండదు. డ్రైవింగ్ మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మనకున్న అత్యవసరము, అసహనం కనిపిస్తాయి. ఈరోజు నియంత్రించలేని విషయాల గురించి మీ మనస్సు ఒత్తిడికి గురికాకుండా,  ప్రవాహానికి అనుగుణంగా వెళ్లడం మనసు కు  నేర్పడానికి కొంత సమయం కేటాయించండి. మీరు ఈరోజు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండే పాజిటివ్ ఆలోచనలను చేయండి. రోడ్డు పై ట్రాఫిక్ క్లియర్ కావడానికి సమయం తీసుకున్నప్పటికీ, మీ మనస్సులో ఆలోచనల రద్దీ పోగవకూడదు. గందరగోళంలో కూడా ప్రశాంతంగా ఉండే కళను మీ మనసుకు నేర్పండి. ‘చికాకు సహజమే’ అన్న పదజాలం క్రమంగా సమాప్తి చేయండి. మీరు మీ కార్యాలయంలో లేదా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు సృష్టించబడిన శాంతి మరియు సహనం యొక్క శక్తి మీ తదుపరి సన్నివేశాలకు కొనసాగుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

12th sep 2024 soul sustenance telugu

మీ జీవితంలో భగవంతుని  జ్ఞానాన్ని తీసుకురావడానికి 5 మార్గాలు

ప్రతిరోజూ మీ మనస్సులో భగవంతుని జ్ఞానంపై దృష్టి పెట్టండి – ప్రతిరోజూ భగవంతుడు మనతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకుంటారు. దానిని చదివి మనం మన డైరీలు మరియు హృదయాలలో నోట్ చేసుకుంటాము. వ్రాసుకున్న తరువాత,

Read More »
11th sep 2024 soul sustenance telugu

సోషల్ మీడియాలో పనిలేని కబుర్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి

వ్యక్తుల  ప్రవర్తన లేదా జీవిత సమస్యల గురించి ప్రతికూల భావంతో మాట్లాడకూడదని, తీర్పు చెప్పేలా, విమర్శనాత్మకంగా లేదా వారి బలహీనతను పేర్కొనకూడదని మనం అభ్యాసం చేస్తాము. అలాగే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చదివే

Read More »
10th sep 2024 soul sustenance telugu

5 రకాల ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోండి

జీవించే కళ  ప్రధానంగా 5 రకాల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది: శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం. పరస్పరం అనుసంధానించబడి ఉండటం వలన, ఇవన్నీ మన

Read More »