Hin

3rd november 2024 soul sustenance telugu

November 3, 2024

త్వరగా నిద్రపోవడం, త్వరగా మేల్కొనడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు

  1. మానసిక స్వచ్ఛత, ఆంతరిక శక్తిని అనుభవం చేసుకోవడం – ఆధ్యాత్మికత యొక్క ఒక ముఖ్యమైన అంశం త్వరగా నిద్రపోవడం, త్వరగా మేల్కొనడం. మనకు హాయిగా అనిపించటానికి మనం ఎన్ని గంటలు నిద్రపోతున్నామనే దానిపై మాత్రమే ఆధారపడదు. కానీ ఎప్పడు నిద్రపోతున్నాము, ఎప్పడు మేల్కొంటున్నామనేది కూడా మన మనసుకు తేలికతనం, శక్తితో కూడిన మెరుగైన అనుభూతిని ఇస్తుంది.

ఇది కూడా ప్రకృతి నియమం, దీనిని ఆధునిక మానవులు ఈ రోజుల్లో విచ్ఛిన్నం చేస్తున్నారు.  దాని కారణంగా, రోజంతా తక్కువ మానసిక స్థితిని అనుభవించడమే కాకుండా, సులభంగా చిరాకు మరియు అలసటకు గురవుతున్నారు.

  1. ధ్యానంలో భగవంతునితో సులభంగా కనెక్ట్ అవ్వడం – రోజంటిలో మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యలను సర్దుకున్న తర్వాత త్వరగా నిద్రపోవడం మనస్సును శక్తివంతం చేసి ప్రశాంతత మరియు స్థిరత్వంతో నింపుతుంది. అటువంటి వ్యక్తి తెల్లవారుజామున మేల్కొని, దృఢత్వం మరియు తేలికతనంతో నిండిన భగవంతుని స్మృతితో రోజును ప్రారంభిస్తాడు. భగవంతుని ఆధ్యాత్మిక ప్రకాశాన్ని, శక్తిని లోలోపల పొందుతాడు.
  2. తెల్లవారు జామున స్వచ్ఛమైన వైబ్రేషన్లను అనుభవం చేసుకోవడం – సూర్యోదయానికి ముందు, మానవులు తమ స్వచ్ఛమైన స్మృతిలో ఉంటారు, ప్రతిచోటా మంచి వైబ్రేషన్లు ఉంటాయి. అలాగే, ప్రకృతి చాలా శుద్ధంగా, శాంతి మరియు స్వచ్ఛతతో నిండి ఉంటుంది. ఆ సమయంలో, మంచి రాత్రి నిద్ర తర్వాత మనం త్వరగా మేల్కొన్నప్పుడు, మన చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని అనుభవం చేసుకుంటాము. మన చుట్టూ ఉన్న పర్యావరణం యొక్క స్వచ్ఛతను కూడా గ్రహించి, ఉన్నతమైన అనుభూతి చెందుతాము.
  3. మంచి శారీరక ఆరోగ్యం మరియు మెదడు శక్తిని అనుభవం చేసుకోవటం – త్వరగా నిద్రపోవడం, త్వరగా మేల్కొని సరైన సమయం వరకు నిద్రపోయే అలవాటును అనుసరించే వ్యక్తులు మెరుగైన శారీరక ఆరోగ్యాన్ని, అన్ని భౌతిక శరీర వ్యవస్థల మెరుగైన పనితీరును అనుభవం చేసుకుంటారని సాధారణంగా కనిపిస్తుంది. అలాగే, వారు మెరుగైన మెదడు ఆరోగ్యం, చురుకైన మనసును కలిగి ఉంటారు. ఆ చురుకైన మనసు, మెదడుతో సానుకూలమైన సమన్వయంతో పనిచేస్తుంది. అప్పుడు అది భౌతిక శరీరం ద్వారా జీవితంలోని వివిధ రంగాలలో మరింత విజయాన్ని సృష్టిస్తుంది.
  4. కలలు లేకుండా, ఉన్నతమైన స్మృతిలో నిద్రపోవడం – ఆధ్యాత్మికతలో చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే, మీ ఆలోచనలు ఎంత ప్రశాంతంగా ఉంటాయి మరియు నిద్ర నాణ్యత ఎంత బాగుందని. ఏ కలలు లేకుండా ఉన్న నిద్రను శాంతియుత నిద్ర అని అంటారు. ఆలస్యంగా నిద్రపోయే అలవాటు మనసును, జీవ గడియారాన్ని మరియు ఆత్మ స్వస్థతను భంగపరచడమే కాకుండా వాటిపై ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపుతుంది. దీని కారణంగా నిద్రలో ఎక్కువ కలలు వస్తాయి, రోజంతటిలో ప్రతికూల మరియు వ్యర్థ ఆలోచనలు చాలా సాధారణం అవుతాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »
3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »