Hin

25th november 2024 soul sustenance telugu

November 25, 2024

ఉద్యోగ అభద్రతను అధిగమించడానికి చర్యలు

చాలా మందికి, ఉద్యోగం అంటే కేవలం ఒక జీవనోపాధి కాదు అది వారి గుర్తింపులో ఒక భాగం. ఉద్యోగ అభద్రత వారి ఆత్మగౌరవం, ఆరోగ్యం, సంబంధాలు మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఉద్యోగస్థులుగా మనం మన ఉద్యోగాలతో ఎంతగా అనుసంధానించబడి స్థిరపడ్డాము అంటే, మనం దానిని కోల్పోతే, మనం విఫలమైనట్లుగా భావిస్తాము. మనలో కొందరు తరచుగా అనుభవించే ఉద్యోగ అభద్రత ఒత్తిడిని మనం అధిగమించాలి.

  1. ప్రతిరోజూ ఉద్యోగానికి వెళ్లడాన్ని ఆనందించడం, కార్యాలయంలో మీ ప్రతి పని పట్ల మక్కువతో కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వండి, లక్ష్యాలను సాధించి విజయాన్ని ఆస్వాదించండి. కానీ మీ కార్యాలయంలో జరిగే ఒడిదుడుకుల నుండి భావోద్వేగపరంగా స్వతంత్రంగా ఉండండి.
  2. భయం, అభద్రత యొక్క వైబ్రేషన్లు మీ భావోద్వేగ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ పనిలో మీ పనితీరును ప్రభావితం చేస్తాయి. సానుకూల శక్తిని అనుభవం చేసుకోవడానికి మీ ఉద్యోగాన్ని నాది అనే భావనతో చేయండి. ఉన్నత నైతిక ప్రమాణాలను ఏర్పరచుకోండి. ఉల్లాసంగా ఉండండి, జ్ఞానాన్ని పంచుకొంటూ మీ నైపుణ్యాలను పెంచుకోండి. మీరు మీ ఉద్యోగానికి ఇచ్చే విలువ మరియు ఉద్యోగంలో మీరు పొందే ఆదరాభిమానాలు ప్రశంసించబడతాయి.
  3. ఏ కారణంగానైనా మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోతే, భయపడవద్దు లేదా ఆందోళన చెందవద్దు. మీరు నిజంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవలసిన సందర్భాలు అవి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, ధ్యానం చేయండి, వ్యాయామం చేయండి మరియు బాగా నిద్రించండి. మనసు, శరీరాన్ని దృఢంగా ఉంచుకోండి. కంపెనీలు భావోద్వేగపరంగా బలమైన వ్యక్తులను నియమించుకోవాలనుకుంటాయని గుర్తుంచుకోండి.
  4. మీ నైపుణ్యాలు, అనుభవం, ప్రతిభ, విలువలు, బలాలు మరియు విజయాలు అన్నీ మీ ఆస్తులు – అవి మీతోనే ఉంటాయి. సానుకూలంగా ఉండండి, కొత్త అవకాశాలపై దృష్టి పెడుతూ వీలైనంత త్వరగా కొత్త ఉద్యోగాన్ని కనుగొనండి. ఏది జరిగినా అది మీకు ఖచ్చితమైనది, ప్రయోజనకరంగా ఉంటుందని నమ్మండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »
8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »