Hin

6th june2024 soul sustenance telugu

June 7, 2024

ఉన్నతమైన ఆత్మగౌరవాన్ని సదా అనుభవం చేసుకోవటం

ఏ సంబంధమైనా, అది వ్యక్తిగతమైనా లేదా వృత్తిపరమైనా,   మొదట్లో పూర్తిగా సానుకూలంగా ఉంటుంది. మీలో ఉన్న సానుకూలమైన ప్రతిదాన్ని చూపించే వ్యక్తి ఉంటాడు: మీరు అద్భుతమైనవారు, మీరు ప్రత్యేకమైనవారు, మీరు ఆధారపడదగినవారు, మీరు విలువైనవారు అని అంటారు. ఆ సానుకూలత సానుకూల స్థితిని, ఆనందాన్ని, శ్రేయస్సును సృష్టిస్తుంది, దానితో మీరు హాయిగా ఉంటారు. మీరు ప్రేమించబడ్డారని, మీ పట్ల శ్రద్ధ వహించారని, అవసరమైన మరియు విలువైన వారిగా భావిస్తారు. ఆ సానుకూలత ఆధారపడటాలు మరియు ఆపేక్షల కారణంగా ప్రతికూలత  ప్రారంభమయ్యే కొంత సమయం వరకు ఉంటుంది. నువ్వే నాకు ఫోన్ చేసి ఉండాల్సింది, నువ్వే నాకు చెప్పి ఉండాల్సింది, నువ్వే ఈ టైంకి రావాల్సి ఉంది, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఇలా లేదా అలా చేసి ఉండాల్సింది.

 

ఈ ఆపేక్షలు, డిమాండ్లు మరియు ఆధారపడటం వలన, ఆ పాజిటివిటీ అదృశ్యమవుతుంది  . వారు మీ వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు కావున గతంలో ఉన్న సామరస్యాన్ని కోల్పోతారు. ఒక వ్యక్తి తన గురించి సానుకూల దృష్టిని కలిగి ఉండటం నేర్చుకోవాలి. మీరు అద్భుతమైనవారు, మీరు ప్రత్యేకమైనవారు; అని వారు మిమ్మల్ని అనడంపై ఆధారపడకండి. దీని అర్థం మీరు మీ అహాన్ని పోషించాలని కాదు, కానీ మీరు  అత్యంత సానుకూలతను మీలో నుండి బయటకు తీసుకురావాలి. మీకు  మంచి అనుభూతిని కలగ డానికి ఇతరులు మీపై సానుకూల విషయాలను ప్రదర్శించాల్సిన అవసరం లేకుండా మీ ఆంతరిక సృజనాత్మకత, సానుకూలత మరియు ఆధ్యాత్మికత గురించి ఆలోచిస్తూ వాటిని బయటికి తీసుకురండి. స్వతహాగా మంచిని అనుభవం చేసుకున్నప్పుడు, మీరు ఇతరులతో శాంతి, ప్రేమ మరియు సానుకూలతను పంచుకోగలుగుతారు. మీరు బాధిత స్థితిలో ఉండరు కానీ నిరంతరం ఉన్నతమైన ఆత్మగౌరవంతో మీ జీవితానికి నిజమైన యాజమానిగా , నియంత్రకులుగా ఉంటారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

11th sep 2024 soul sustenance telugu

సోషల్ మీడియాలో పనిలేని కబుర్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి

వ్యక్తుల  ప్రవర్తన లేదా జీవిత సమస్యల గురించి ప్రతికూల భావంతో మాట్లాడకూడదని, తీర్పు చెప్పేలా, విమర్శనాత్మకంగా లేదా వారి బలహీనతను పేర్కొనకూడదని మనం అభ్యాసం చేస్తాము. అలాగే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చదివే

Read More »
10th sep 2024 soul sustenance telugu

5 రకాల ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోండి

జీవించే కళ  ప్రధానంగా 5 రకాల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది: శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం. పరస్పరం అనుసంధానించబడి ఉండటం వలన, ఇవన్నీ మన

Read More »
9th sep 2024 soul sustenance telugu

గందరగోళం కాకుండా స్పష్టత కలిగి ఉండండి

శాంతి మరియు స్థిరత్వంతో కూడిన జీవితాన్ని గడపడానికి స్పష్టత కలిగి ఉండటం కీలకం. కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలి లేదా ఏ దిశలో అడుగు పెట్టాలి అని మనం తరచుగా ఆలోచిస్తూ ఉంటాము.

Read More »