Hin

వైఫల్యాలను సానుకూలతతో, శక్తితో అంగీకరించండి

March 11, 2024

వైఫల్యాలను సానుకూలతతో, శక్తితో అంగీకరించండి

ఎంత కష్టపడ్డా, ఎంత వద్దనుకున్నా కానీ మనమంతా ఎప్పుడో ఒకసారి జీవితంలో వైఫల్యాలను చవిచూసినవారిమే. అయితే ఆ వైఫల్యాలను విజయాలుగా, బలహీనతలను బలాలుగా మార్చుకోగలము అన్న మంచి మాటను గుర్తుంచుకోండి. అందుకు వైఫల్యాలను మీరు అంగీకరించాలి, పునః ప్రయత్నించాలి. లేకపోతే ఓటమి కలిగించే ఒత్తిడి లేదా గమ్యాన్ని చేరుకోలేదన్న కలవరం మనల్ని వెంటాడుతాయి. జీవితం ఒక పోటీ, ఈ పోటీలో గెలుపుతోటే సంతోషం లభిస్తుందని చాలామంది అపోహ పడుతుంటారు. ఈ తప్పుడు భావమే ఓటమి అంటే భయపడేలా చేస్తుంది. వైఫల్యాలను మనం శత్రువులుగా చూస్తున్నాము, నిజానికి అవి మనకు పాఠాలు నేర్పే టీచర్లు. ఓటమి కలిగినప్పుడల్లా మనలో పెరిగే అనుభవం, అవగాహన మనకు బహుమానాలు.

  1. పొరపాట్లు, వైఫల్యాలు జరిగినప్పుడు అపరాధ భావంతో ఉండకండి. నేను యోగ్యుడిని కాను అన్న భావాన్ని అపరాధ భావం కలిగిస్తుంది. నేను తప్పు చేసాను అని మాత్రమే అనుకుంటే, ఆ తప్పును సరిదిద్దుకునే సమర్థత మరోసారికి వస్తుంది. కానీ వైఫల్యం అంటే అయోగ్యత అని అనుకుంటే మీ ఆత్మ గౌరవాన్ని మీరు తగ్గించుకుంటున్నారని అర్థం.
  2.   మీలో వచ్చే ఆలోచనలు, భావాలకు మీరే బాధ్యత  వహించండి, అందుకు మీతో మీరు రోజూ మాట్లాడుకుంటూ ఉండండి. ఆత్మ గౌరవానికి మీరు సాధించే విజయంతో సంబంధం లేదని గుర్తించండి. శాంతి మరియు సంతోషాలను మీరు గమ్యాన్ని చేరుకునే మార్గంలోనే సృష్టించుకోవాలిగానీ మీరు గమ్యాన్ని చేరుకున్న తర్వాత పొందే అనుభూతులు కావు అవి.
  3. కొన్నిసార్లు వైఫల్యం అనేది అనివార్యమవుతుంది. మీరు మీవంతు కృషి అత్యుత్తమంగా చేసారా లేదా అని మాత్రమే చూసుకోండి. అలా చేసి ఉంటే, మిమ్మల్ని మీరు అంగీకరించండి. పొందిన అనుభవాన్ని, పాఠాలను తీసుకుని మరోసారి ఆ పొరపాటు జరగదు అని వాగ్దానం చేయండి. అపరాధ భావంలోకి వెళ్ళి బలహీనంగా, ప్రశ్నార్థకంగా, నిందిస్తూ మీ శక్తిని హరించుకోకండి. ఆ శక్తిని స్వయాన్ని బలపర్చుకోవడానికి ఉపయోగిస్తూ ముందుకు సాగండి.
  4. పరిస్థితులు, వ్యక్తులు మీ నియంత్రణలో లేవు అని అర్థం చేసుకోండి. వాటికి మీరు ఎలా స్పందిస్తారన్నదే మీ నియంత్రణలో ఉంటుంది. నిజమైన ఓటమి మీరు విరమించుకున్నప్పుడే జరుగుతుంది కానీ మీరు పునః ప్రయత్నించడానికి సిద్ధమైనప్పుడు కాదు.
  5. లక్ష్యాలను నిర్దేశించుకోండి, ప్లాన్ చేయండి, అమలు చేయండి, సాధించండి మరియు విజయాన్ని ఆస్వాదించండి. కానీ మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సు కంటే పని లేదా దాని ఫలితాన్ని ముఖ్యమైనదిగా చేయవద్దు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th june2024 soul sustenance telugu

  పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 3)

భవిష్యత్తు మాత్రమే అత్యంత ముఖ్యమైనది అనే ఆలోచన నుండి కూడా మనం విముక్తి పొందాలి. సామాజికంగా చెల్లుబాటు అయ్యే లక్ష్యాలను సాధించే ఈ ట్రెడ్‌మిల్‌లో, విజయాన్ని గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము,  కనీసం దానిని సాధించినందుకు

Read More »
18th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 2)

సంతోషం మరియు విజయం వాస్తవానికి పరస్పరం ముడిపడి ఉంటాయి. ఆ రెండు ఒక సాధారణ అంశాన్ని పంచుకుంటాయి – వాటిని అనుసరించలేము. మనం ఆత్మిక స్థితిని అభ్యసిస్తే, విజయం మరియు సంతోషం  రెండింటినీ సాధించిన

Read More »
17th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 1)

ప్రతి ఆత్మ సంతోషాన్ని కోరుకుంటుంది. సంతోషంగా ఉండటం కోసం సంతోషాన్ని వెతుకుతుంటాము. ఆరోగ్యం, అందం, ధనము, పాత్ర వంటి ఇతర గమ్యాలు కూడా విలువైనవే ఎందుకంటే అవి మనకు సంతోషాన్నిస్తాయి అని మనం భావిస్తాము.

Read More »